వైఎస్ మరణం కుట్ర బయటకొస్తుందనే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ మరణం కుట్ర బయటకొస్తుందనే

వైఎస్ మరణం కుట్ర బయటకొస్తుందనే

Written By news on Thursday, May 24, 2012 | 5/24/2012

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం వెనుక ఉన్న కుట్ర బయటకు వస్తుందన్న ఉద్దేశంతోనే కొన్ని శక్తులు ఆయనను అడ్డుకుంటున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఆరోపించారు.

జగన్ అధికారంలోకి వస్తే.. ఆ కుట్ర వెనుక దాగి ఉన్న పెద్దలంతా బయటకు వస్తారన్న ఉద్దేశంతో అంతా కలిసి ఆయనను అణగదొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉప ఎన్నికల గడువు దగ్గర పడుతున్నకొద్ద్దీ వైఎస్ జగన్‌పైన, ఆయన కుటుంబంపైన, పార్టీ నేతలు, కార్యకర్తలపైన వేధింపులు పరాకాష్టకు చేరాయన్నారు. 18 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీలకు ఒక్క స్థానం దక్కదని సర్వేలు స్పష్టం చేయడంతో ఆ పార్టీల నేతలు నీచ రాజకీయాలకు దిగుతున్నారని బుధవారమిక్కడ పార్టీ కార్యాలయంలో విమర్శించారు.

‘‘వైఎస్ మరణం వెనుక పెద్దల హస్తం ఉంది. ఈ కుట్ర బయటకు రాకుండా ఉండేందుకే కొన్ని శక్తులు జగన్ సీఎం కాకుండా అడ్డుకుంటున్నాయి’’ అని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనాన్ని తట్టుకోలేక ఎలాగైనా ఎన్నికలను వాయిదా వేయించాలనే దురుద్దేశంతో కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని విమర్శించారు.

‘‘మాచర్లలో మా పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు పాళ్లు అక్షరసత్యాలు. కాంగ్రెస్, టీడీపీలు కలిసి చేస్తున్న కుట్రలు స్పష్టంగా బయటపడుతున్నాయి. అందుకే జగన్ వాటిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. జగన్‌ను అణగదొక్కేందుకు కాంగ్రెస్, టీడీపీలతో పాటు ఒక వర్గం మీడియా శాయశక్తులా కృషి చేస్తోంది. అందులో భాగంగానే ఎల్లో మీడియా జగన్‌ను అరెస్టు చేస్తారంటూ దుష్ర్పచారం చేసింది’’ అని చెప్పారు. జగన్ వెంట రౌడీలు, గూండాలు ఉన్నారంటూ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు ప్రజలను అవమానపరిచేవిలా ఉన్నాయని దుయ్యబట్టారు.

ఒక్కడిపైకి వంద మంది దాడి: జగన్ ఒక్కడిని ఎదుర్కొనేందుకు కౌరవ సైన్యంలా వంద మంది దాడి చేస్తున్నారని గట్టు వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో చంద్రబాబు కుమ్మక్కు కుట్రలకు మరింత పదును పెట్టారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ గులాంనబీ ఆజాద్ అయితే వయలార్ రవి ఎందుకు మకాం వేశారు?

వీరు చాలదన్నట్లు మరో నేత రానున్నారట! ఇన్ని బుర్రలు కలిసి ఒక్కరిని వేధిస్తాయా?’’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుందని వయలార్ రవి చేసిన వ్యాఖ్యలు ఈ దశాబ్దపు జోక్‌గా గట్టు అభివర్ణించారు. కాంగ్రెస్ బలపడేదిలేదు... దానికి భయపడేది లేదని స్పష్టం చేశారు. పార్టీని వైఎస్ లీడ్ చేసినప్పుడు కాంగ్రెస్ ఒక ముత్యంలా ఉండేదని, ఎప్పుడైతే జగన్ బయటకొచ్చారో అప్పటి నుంచి ముత్యం లేని చిప్పలా మారిపోయిందని చెప్పారు.

చిరంజీవిని బట్టలూడదీసి కొడతారు: ‘‘రాష్ట్ర రాజకీయాల్లో చిరంజీవి అంత దౌర్భాగ్యుడు ఎవరైనా ఉంటారా? తన స్వార్థం కోసం పార్టీని హోల్‌సేల్‌గా అమ్ముకున్నారు. ఢిల్లీ నుంచి డబ్బులు తెచ్చి రాష్ట్రం కాని రాష్ట్రంలో దాచారు. అలాంటి వ్యక్తి రాజకీయాల విలువలు, నీతి, నిజాయతీల గురించి మాట్లాడటం సిగ్గుచేటు. 2009లో పీఆర్పీకి ఓట్లేసిన వారి దగ్గరికి చిరంజీవి వెళ్తే.. బట్టలూడదీసి కొడతారు’’ అని గట్టు హెచ్చరించారు.

‘‘లబ్ధి పొందడం వల్లే నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారని లగడపాటి మాట్లాడుతున్నారు. మరి ఆయన తమ్ముడు కూడా పెట్టుబడి పెట్టారు కదా.. ఆయనేం లబ్ధిపొం దారో లగడపాటి చెప్పగలరా?’’ అని నిలదీశారు. రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు చేయడంలో చంద్రబాబును మించిన వ్యక్తి దేశంలో మరెవరూ ఉండరని గట్టు మండిపడ్డారు. అధికారం కోసం వెన్నుపోటు రాజకీయాలకు శంకుస్థాపన చేసింది, హత్యా రాజకీయాలకు తెరలేపింది చంద్రబాబేనని చెప్పారు. మల్లెల బాబ్జీ అనే వ్యక్తిని తన స్వంత స్వార్థం కోసం ఉపయోగించుకొని అవసరం తీరాక హత్య చేయించింది చంద్రబాబేనని ఆరోపించారు.
Share this article :

0 comments: