జగన్ పార్టీలోకి ఆ ముగ్గురూ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ పార్టీలోకి ఆ ముగ్గురూ

జగన్ పార్టీలోకి ఆ ముగ్గురూ

Written By news on Thursday, May 3, 2012 | 5/03/2012


 శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురు ముఖ్య నాయకులు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ శాసనసభ్యుడు సత్రవాడ మునిరామయ్య, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ఏపీ సీడ్స్ మాజీ డెరైక్టర్ బర్రె సుదర్శన్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బర్రె హేమభూషణ్‌రెడ్డిలను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అభ్యర్థుల జయాపజయాలను శాసించేంత సంఖ్యలో వన్నెరెడ్డి సామాజికవర్గ ఓట్లు ఉన్నాయి. ఈ సామాజికవర్గంలో మాజీ శాసనసభ్యుడు సత్రవాడ మునిరామయ్యకు మంచి పట్టు ఉంది. 1985 నుంచి 1989 వరకు ఆయన శ్రీకాళహస్తి శాసనసభ్యుడిగా పదవిలో కొనసాగారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో మునిరామయ్యకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. వైఎస్‌ను ఆయన ఎంతో అభిమానించేవారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ నాయకులు యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిమీద చేస్తున్న రాజకీయ దాడిని మునిరామయ్య జీర్ణించుకోలేకపోయారు. తెలుగుదేశం పార్టీలోనే ఉన్న ఆయన కొంతకాలం నుంచి చంద్రబాబు తీరును తీవ్రంగా నిరసిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు.

భవిష్యత్ రాజకీయ నిర్దేశకుడు వైఎస్ జగనే అనే అభిప్రాయంతో ఎలాంటి పదవులు ఆశించకుండానే ఆయనతో కలసి పనిచేయాలని మునిరామయ్య భావించారు. ఈయన చేరికతో టీడీపీకి పెద్ద దెబ్బ తగిలినట్లేనని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీలో మంచి వర్గం ఉన్న బర్రె సుదర్శన్‌రెడ్డి, బర్రె హేమభూషణ్‌రెడ్డిలను కూడా నారాయణస్వామి, మధుసూదన్‌రెడ్డి ఇటీవల కలసి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో వీరు పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వీరి చేరికతో కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో నష్టపోనుంది. జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా బుధవారం ఉదయం ఆటోనగర్‌లో జరిగిన బహిరంగ సభా వేదిక మీదే వీరు ముగ్గురూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్‌రెడ్డిని గెలిపించడానికి కష్టపడి పనిచేయాలని జగన్‌మోహన్‌రెడ్డి ఈ సందర్భంగా వారిని కోరారు. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న వారికి అధికారంలోకి రాగానే తగిన గుర్తింపు ఇస్తానని ఆయన చెప్పారు.


Share this article :

0 comments: