‘సాక్షి’ని సాక్ష్యం చెప్పనీయండి! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘సాక్షి’ని సాక్ష్యం చెప్పనీయండి!

‘సాక్షి’ని సాక్ష్యం చెప్పనీయండి!

Written By news on Saturday, May 12, 2012 | 5/12/2012



సీబీఐ అరెస్టు వారెంట్ కోరినట్టు లేదు. అరెస్టు చేయమనీ అడిగినట్టు లేదు. అరెస్టూ చెయ్యలేదు. అతనిపై వచ్చిన అభియోగంపై సమాధానం చెప్పుకోవటానికి కోర్టుకు రమ్మని అడిగింది... అంతే! ఇటువంటి పరిస్థితుల్లో సాక్షికి సంబంధించిన బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం, ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయటం చూస్తుంటే ఈ రెండు చర్యలూ సమంజసం, సహేతుకం, చట్టసమ్మతం కాదని తేలుతున్నది. పైగా కొందరి ప్రజాస్వామిక హక్కులు, ప్రాథమిక హక్కులలో జోక్యం చేసుకోవటం అవుతుంది. జగన్‌మోహన్‌రెడ్డిపై వేయాలనుకున్న దెబ్బ పత్రికా స్వాతంత్య్రం మీద, ప్రజల ప్రాథమిక హక్కుల మీద పడుతున్నది. అక్రమ ఆస్తుల కేసులో సాక్షిపత్రిక, టీవీలను ఇరికించటం అప్రజాస్వామికమైన చర్య అవుతుంది. అభియోగం ఎంత తీవ్రమైనా, ముద్దాయి ఎవరైనా చట్టం అందరికీ ఒకే విధంగా వర్తించాలనేది ధర్మ సూత్రమే కాదు, రాజ్యాంగ సూత్రం కూడా. దానిని కాపాడవలసిన కర్తవ్యం సీబీఐకి, ప్రభుత్వానికీ ఉన్నది. కాపాడుకోవలసిన అవసరం ప్రజలకూ ఉన్నది.

సాక్షి దినపత్రికకు, సాక్షి టీవీకి ప్రభుత్వ ప్రకటనలు నిలిపి వేస్తూ బుధవారం అర్ధరాత్రి ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఉత్తరు వు జారీ చేసింది. ఎందుకోగాని ఇటువంటి ఉత్తరువులన్నీ అర్ధరా త్రులే జారీ అవుతాయి. పోల్చ టం కాదుగాని, 1975లో ‘అత్య వసర పరిస్థితి’ (ఎమర్జెన్సీ)ని కూడా అర్థరాత్రే ప్రకటించారు. ఆ ప్రకటన ప్రకారమే అరెస్టులూ అర్ధరాత్రే అయిపో యాయి. అదే సందర్భంలో ఆంగ్లదినపత్రిక ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ను కూడా అర్ధరాత్రే మూసివేశారు. ఆ మర్నాటి పత్రిక మొదటి పేజీ మొత్తం ఖాళీగా ముద్రించారు. నిర సన ఆ విధంగా తెలియజేశారు. హఠాత్తుగా ఒక రోజున సాక్షి పత్రిక, టీవీలను నడుపుతున్న జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ లిమిటెడ్, జననీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ప్రై) లిమిటెడ్ సంస్థలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను స్తంభింప జేశారు. వీటికి సంబంధించిన లావాదేవీలన్నీ నిలిపి వేయాలని బ్యాంకు అధికారులకు సీబీఐ ఆదేశాలు ఇచ్చింది.

పత్రిక, టీవీలు నడవటానికి డబ్బు అవసరం అనేది అందరికీ తెలుసు. రోజువారీ ఖర్చు కొన్ని లక్షలు ఉంటుం ది. ఈ ఖర్చుకు అవసరమైన డబ్బును నొక్కిపెడితే అటు పత్రికా, ఇటు టీవీ రెండూ గిలగిలలాడతాయని సీబీఐ భావించింది. ‘ఎక్కడైనా కొట్టుకాని కడుపుమీద కొట్టవద్దు’ అనేది మన సామెత. సరిగ్గా సాక్షి కడుపుమీదనే దెబ్బ కొట్టింది సీబీఐ. దానిపైన మరో దెబ్బ వేసింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.

ఈ రెండు చర్యల ద్వారా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కొట్టాలనుకుంటున్నారా, సాక్షిని కొట్టాలనుకుంటున్నారా, లేక లక్షలాది సాక్షి పాఠకుల్ని, వీక్షకుల్ని కొట్టాలనుకుంటు న్నారా? వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కొట్టగలరో లేదో వాళ్లిద్దరూ తేల్చుకుంటారు గాని ఇటు సీబీఐ చర్య, అటు ప్రభుత్వ చర్య రెండూ ప్రత్యక్షంగా సాక్షి పాఠకుల మీద, సాక్షి వీక్షకుల మీద దెబ్బకొట్టడమే అవుతుంది. ఈ చర్య ప్రత్యక్షంగా భావప్రకటనా స్వేచ్ఛ మీద దెబ్బ కొట్టడమే.
సాక్షి ఒక పత్రిక, సాక్షి ఒక టీవీ. వాటిని నడుపుతు న్నవి మూడు సంస్థలు. వాటి అధినేత జగన్‌మోహన్‌రెడ్డి. సాక్షి పత్రికను, టీవీను నడపటానికి కొందరు పెట్టుబ డులు పెట్టారు. సాక్షి 2008లో మొదలయింది కాబట్టి వైఎస్ రాజశేఖరరెడ్డిగారే సాక్షికి పెట్టుబడులు సమకూర్చి ఉంటారు. ‘పెట్టుబడులు’ మాత్రం కోట్లాది రూపాయలు వచ్చాయి.

అయితే, ఆ మొత్తం అక్రమంగా వచ్చిందని సీబీఐ అభియోగం. ఆ విధంగా అక్రమంగా వచ్చిన డబ్బుతో పత్రిక నడుస్తున్నదనేది మరో అభియోగం. ఆ విధంగా అక్రమార్జనతో పత్రిక నడవకూడదనేది మరో నీతి సూత్రం. అందుకని ‘అక్రమ సంపాదన మీ దగ్గర దాచిపెట్టారు. దానిని ఎవరికీ ఇవ్వకండి’ అని సీబీఐ బ్యాంకును ఆదేశించింది. ఈ ఆదేశాలు సక్రమమా, సమం జసమా, సహేతుకమా, చట్టబద్ధమా అనే అంశాలను పరిశీలించాలి. ఎందుకంటే ఈ చర్య వల్ల సాక్షి పాఠకుల, వీక్షకుల ప్రాథమిక హక్కు దెబ్బ తిన్నది గనుక. ప్రజలు తమ ఇష్టం వచ్చిన పత్రిక చదువుతారు, తమకు నచ్చిన టీవీని చూస్తారు. అవి చదవకూడదు, చూడకూడదని చెప్పే అధికారం పోలీసుకూ లేదు, సీబీఐకీ లేదు, ప్రభు త్వానికి అంతకన్నా లేదు. ఈ ప్రాథమిక హక్కు వాడుకొనే విధానాన్ని నియంత్రించవచ్చు గాని మొత్తానికి లేకుండా చేయలేరు.

పత్రికలన్నీ ప్రధానంగా ప్రభుత్వ ప్రకటనల మీద నడుస్తాయి. ‘తనకు ఇష్టం వచ్చిన పత్రికకే ప్రకటనలు ఇస్తాను, నచ్చని వాటిని ఇవ్వను’ అనే స్వేచ్ఛ ప్రభుత్వానికి లేదు. సాక్షి పత్రిక, టీవీలకు ప్రభుత్వం ప్రకటనలు ఇస్తు న్నది. మరి హఠాత్తుగా ఎందుకు మానేస్తానన్నది? ఇస్తూ వస్తున్న ప్రకటనలు మధ్యలో నిలిపివేయవచ్చా? ఏదైనా పత్రిక తన పత్రికలో రాతల ద్వారా చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నప్పుడో, మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నప్పుడో, ప్రజల మధ్య అంతఃకలహాలు రేపుతున్నప్పుడో ప్రభుత్వం ఆ పత్రికపై చర్య తీసుకో వచ్చు. అందులో భాగంగా ప్రకటనలు ఆపవచ్చు. ఆపైన క్రిమినల్ చర్య తీసుకోవచ్చు.

అంతేగాని సాక్షి పత్రికలో జగన్‌మోహనరెడ్డి పర్యటనలో ఎక్కడకు వెళ్లినా అశేష జనం వస్తున్నారని బొమ్మలు ముద్రిస్తున్నారనో, వేలాది జనాన్ని టీవీలో చూపిస్తున్నారనో, ఆయన చేస్తున్న రాజ కీయ ప్రచారానికి ఎక్కువ భాగం కేటాయిస్తున్నారనో, దానిని ప్రజలు చూస్తున్నారనో, ఆదరిస్తున్నారనో ప్రకట నలు మానివేయటం సబబుకాదు, చట్టబద్ధమూ కాదు. పైగా ఇస్తున్న ప్రకటనలు నిలిపివేయాలనుకుంటే, ముం దు పత్రికా యాజమాన్యానికి నోటీసు ఇవ్వాలి. ఎందుకు ప్రకటనలు నిలిపివేయాలనుకుంటున్నారో కారణం చూపాలి. దానికి సంజాయిషీ కోరాలి. దానికి కొంత సమయం ఇవ్వాలి. యాజమాన్యం ఇచ్చిన సంజాయిషీ ప్రభుత్వానికి ఆమోదయోగ్యం కాకపోతే అప్పుడు ప్రకట నలు నిలిపివేయాలి.

అంతేకాని కారణం చెప్పకుండా హఠాత్తుగా అర్ధరాత్రి ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయటం చట్టవ్యతిరేకమైన చర్యే అవుతుంది. పత్రికలపై చర్య తీసు కోవడానికి సంబంధించి సుప్రీంకోర్టు అనేకసార్లు చెబు తూవస్తున్నది. ప్రభుత్వం ఏ మాత్రమూ శ్రద్ధ తీసుకో కుండా, చేల గట్లమీద నీటి కోసం కొట్టుకుంటున్న పెద్ద రైతు, పక్క పొలాలకు నీరు పోనీయకుండా అడ్డుకట్టవేయ టంలా అనిపిస్తున్నది. ఎవరి హక్కు అయినా, అందులో ప్రజల ప్రాథమిక హక్కును హరించివేయాలనుకున్న ప్పుడు చాలా జాగ్రత్తపడాలి.

సాక్షిపై ఏ చర్య తీసుకున్నా అది ప్రజలపై చర్య అవుతుంది. సాక్షిలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగు లపైన తీసుకున్నట్టు అవుతుంది. అంతేకాదు రాజ్యాంగ ధిక్కారమవుతుంది. ఒకవేళ సాక్షి పత్రిక అక్రమార్జనపై నడుస్తున్నదే అనుకుందాం కాసేపు. అయితే అది నిరూ పణ కాలేదు! నిర్ధారణ కాలేదుగదా! అదొక అభియోగం మాత్రమే! అభియోగం మీదనే ఇటువంటి చర్య చేపడ తారా? సాక్షిలో వచ్చిందనుకున్న డబ్బు కేవలం ‘పెట్టు బడులు’ మాత్రమే! కొందరు డబ్బున్నవారు సాక్షిలో పెట్టుబడి పెట్టారు, పెడతారు. అందులో తప్పులేదు. అయితే ఆ డబ్బు ఎక్కడిదో లెక్కచూపాలి. చూపే ఉం టారు. ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వరస్వామి హుం డీలో పేరు చెప్పకండా, దొంగచాటున లక్షలాది రూపా యలు, బంగారు, వెండి, వజ్రాల నగలు వేసినట్టు వెయ్య లేదు గదా! పెట్టుబడి పెట్టిన వ్యక్తి పేరు, పెట్టుబడి మొత్తం రాసి ఉంటుంది. అందులో రహస్యం ఏమీలేదు. అయితే అది సాక్షిని చూసి కాదు, అప్పటి ముఖ్యమంత్రిని చూసి పెట్టినదే అని మరో అభియోగం.

అయితే దానిలో తప్పేమిటి? అయితే ఆ డబ్బు వారికి అప్పటి ముఖ్య మంత్రి కొంత ‘ప్రయోజనం’ కల్పించాడు కాబట్టి దానికి ప్రతిఫలంగా, కృతజ్ఞతాభావంతో వారు సమర్పించుకున్న ముడిపెం కాబట్టి... అది అక్రమమైన డబ్బు అని ఇంకో అభియోగం. అయితే, ఆ ‘ప్రయోజనం’ ఏమిటి? అది చట్టసమ్మతమా కాదా? ముఖ్యమంత్రిగా వారికి మేలు కల్పించే ఉంటే దానికి సంతోషించి పెట్టుబడిగా కొంత డబ్బు సాక్షిలో పెట్టడం నేరమవుతుందా? నేరమే అయితే దానికి ఇప్పుడు సాక్షి యాజమాన్యం బాధ్యత వహిస్తుం దా? వహించినా సాక్షి ఉద్యోగులు దానికి బాధ్యులా? బాధ్యులే అయినా సాక్షి పాఠకులు, ప్రేక్షకులు బాధ్యులా? ఇవన్నీ తేలాలి. అప్పుడే ప్రకటనలు ఆపటం అయినా, బ్యాంకు అకౌంట్ నిలిపివేయటం అయినా చేస్తే సబబు!

అయితే స్వయంగా దొంగతనం చేయకపోయినా, దొంగ సరుకు దగ్గరపెట్టుకున్నా, దాచినా నేరమే! కానీ అది దొంగసరుకని తేలాలి. దానికి ఆధారాలు ఉండాలి. సాక్షి ఖాతాలో ఇప్పుడు పైన చెప్పిన పెట్టుబడులు ఒక్కటే ఉండవు. యాజమాన్యం సొంత డబ్బు ఉంటుంది. ఇతర వాటాదార్లు ఉంటారు. ప్రకటనల ద్వారా వచ్చిన డబ్బు ఉంటుంది. ఇన్ని ఉంటాయి కాబట్టి ఏ చర్య తీసుకున్నా సహేతుకంగా ఉండటం మంచిది, అవసరం కూడా.

అసలు సీబీఐకి బ్యాంకు ఖాతాను స్తంభింపజేసే (ఫ్రీజ్) అధికారం ఉన్నదా? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ) సెక్షన్ 102 కింద ఈ చర్య తీసుకున్నామని సీబీఐ చెబుతున్నది. ఈ సెక్షన్ కింద పోలీసుకు నిర్దిష్టమైన ఆస్తి (డబ్బుతోసహా)ని స్తంభింపచేయడానికి విస్తృతాధికా రాలు ఉన్నమాట వాస్తవమే. అయితే ఆ అధికారాన్ని వినియోగించటానికి రెండు పరిస్థితులు ఉండాలి. అవి ఏమంటే స్తంభింపచేయాలనుకున్న ఆస్తి (ఇక్కడ డబ్బు) దొంగతనం చేయటం ద్వారా వచ్చిన డబ్బు అనే అభియో గం కాని అనుమానం కాని ఉండాలి. అలాగే ఏదో నేరం జరిగిందనే అనుమానం కలిగే పరిస్థితులలో దొరికినదైనా అయి ఉండాలి. ఈ రెంటికీ భిన్నమైన పరిస్థితుల్లో ఏ డబ్బును గాని స్తంభింపచేయటానికి పోలీసుకు అధికారం లేదు. ఒకవేళ స్తంభింపచేసినా దీనిని ఎవరినీ వాడనీయ కండి అంటూ ఆజ్ఞాపించే అధికారం పోలీసుకు లేదు. డబ్బును స్తంభింపచేసి, ఆ సంగతి వెనువెంటనే కోర్టుకు తెలియజేయాలి. ఆ డబ్బును ఎలా వాడాలో కోర్టు నిర్ణయి స్తుంది. అధికారాలు ఎంత విస్తృతమైనవైనా వాటిని విని యోగించటానికి చట్టమే కొన్ని పరిమితులు విధిస్తుంది. వాటిని పట్టించుకోకుండా ఏ చర్య చేపట్టినా అది కోర్టుకు అంగీకారం కాదు, కాజాలదు.

సీఆర్‌పీసీ ఈ విధంగా నిర్దేశిస్తుంటే సీబీఐ చేసిన చర్య దీని పరిధిలోకి వస్తుందోరాదో చూద్దాం. సీఆర్‌పీసీ ఈ అధికారాన్ని వినియోగించటానికి రెండు షరతులు విధిం చింది. అందులో మొదటిది... ఈ డబ్బు దొంగిలించిన డబ్బు అనే అభియోగం లేదా అనుమానం ఉండాలి. సాక్షి పెట్టుబడుల విషయంలో ఈ అభియోగమూ లేదు, అను మానమూ లేదు. ఎందుకంటే సాక్షిలో పెట్టిన పెట్టుబ డులు ‘దొంగడబ్బు’ అని ఎక్కడా ఎవరూ చెప్పటం లేదు. ఆ డబ్బును జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడో దొంగిలించి పెట్టు బడుల రూపంలో బ్యాంకులో దాచిపెట్టాడనే అభియో గమూ లేదు. అతను కాకపోయినా ఎవరో దొంగిలించి ఇతనికి ఇచ్చారని దానిని తాను దాచిపెట్టాడనే అభియో గమూ లేదు.

ఇక పోతే రెండో షరతు... ఏదో నేరం జరిగిందనే అనుమానం వచ్చే పరిస్థితుల్లో ఈ డబ్బు దొరకటం. ఈ షరతూ కనపడటం లేదు. డబ్బు బ్యాంకులో ఉన్నది. అం కెల రూపంలో ఉన్నది. అది పెట్టుబడుల రూపంలో వచ్చి నది. ఆ పెట్టుబడులు పెట్టిన వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఆ డబ్బు నల్లధనం కూడా కాదు. ‘మాకు మీరు ప్రయోజనం కల్పించారు కాబట్టి మీకు మేము ప్రయోజనం అందిస్తాం’ అనే రీతిలో వచ్చినది అనేది అభియోగం. ఈ మొత్తం క్రమంలో ఎక్కడో ఏదో నేరం జరిగి ఉండాలి. లేదా ఆ అనుమానం అయినా రావాలి. డబ్బు బ్యాంకులో దాచటం నేరం కాదు, పత్రికలో గాని టీవీలో గాని పెట్టుబడులు పెట్టడం నేరం కాదు. ఎందుకు పెట్టారనే విషయం నేర మేమో చూడాలి.

అప్పటి ముఖ్యమంత్రి ఎవరికో ఏదో ప్రయోజనం కల్పించటం నేరం అవుతుందో లేదో పరిశీ లించాలి. పోనీ పెట్టుబడులు లంచం రూపంలో వచ్చా యేమో చూడాలి. దేనికి లంచం ఇచ్చారో చూడాలి. ప్రయోజనం కల్పించటం నేరం కాకపోతే, రేపు న్యాయ స్థానంలో అది నేరమే అని రుజువు కాకపోతే, పెట్టుబ డులు పెట్టటం నేరం కాదని రుజువు అయితే, ఆ డబ్బుతో సాక్షిని నడిపించటం నేరం కాదని రుజువు అయితే, ఏ డబ్బుతో నడిపినా పత్రికను నడపటం నేరం కాదని, ప్రజల అవసరమని నిర్ధారణ అయితే, ఈ రోజు సీబీఐ, ప్రభుత్వమూ తీసుకున్న చర్యలకు ఎవరు బాధ్యులవు తారు? సాక్షిలో పనిచేస్తున్న వేలాది మంది జీవన భద్ర తకు ఎవరు హామీ ఇస్తారు?

ఇవన్నీ అలా ఉంచి, మరో ప్రధానమైన అంశం ఈ కేసులో ఉన్నది. జగన్‌మోహన్‌రెడ్డిపై పెట్టిన కేసులో అతను హాజరు కావాలని సీబీఐ కోర్టు ‘సమన్’ పంపింది. అతను ఈ నెల 28న కోర్టులో హాజరుకావాలి. అతను హాజరైన తర్వాత అతనిపై అభియోగం ఏమిటో కోర్టు చెబుతుంది. దానికి ఇతను ఏం సమాధానం చెబుతాడో కోర్టు పరిశీలిస్తుంది. అప్పుడు విచారణ సాగించటమా, అవసరం లేదా అనే విషయం తేలుతుంది. కోర్టు ‘సమన్’ ఇచ్చిందని తెలిసే, ఈ లోపునే సీబీఐ బ్యాంకు ఖాతాను స్తంభింపచేయటం కోర్టు వ్యవహారంలో తలదూర్చటమే అవుతుంది.

ఆ మాటకు వస్తే సీఆర్‌పీసీ ప్రకారం ఏదైనా ఫిర్యాదు ఒక వ్యక్తిపైన వస్తే, పోలీసు ఆ సమాచారాన్ని కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలి. దర్యాప్తులో సాక్ష్యా ధారాలు దొరికితే వాటిని సేకరించి తుది నివేదికను కోర్టుకు సమర్పించాలి. ఫిర్యాదులోనే అభియోగంపై నమ్మ దగిన కారణాలు కనిపిస్తే ముద్దాయిని అప్పుడే అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించవచ్చు. ముద్దాయి బెయిలు పొందక పోతే, ముద్దాయితోపాటు నివేదికను కోర్టుకు సమర్పిస్తూ ఇతనిపై కేసు నడిపించండి అని కోర్టును కోరాలి. జగన్ మోహన్‌రెడ్డికి సంబంధించిన కేసులో ఛార్జిషీటు దాఖలు చేశారు. అతనిని అరెస్టు చెయ్యలేదు. అంటే అతనిని విచారణకు ముందే అరెస్టు చేయదగిన కారణాలు సీబీఐకి దొరకలేదన్నమాట! దర్యాప్తు ప్రారంభించే ముందూ దొర కలేదు, దర్యాప్తు పూర్తయిన తర్వాత కూడా దొరకలేదు.

ఛార్జిషీటులో కూడా జగన్‌మోహన్‌రెడ్డిపై వెంటనే అరెస్టు చేయదగిన కారణాలు కోర్టు వారికి కనపడలేదు. ‘అరెస్టు వారెంట్ అవసరం లేద’ని భావించి కేవలం ‘సమన్’ పంపారు. అంటే కోర్టుకు ‘హాజరుకమ్మ’ని ఉత్తరువు. చాలా కేసుల్లో ఫిర్యాదు (ఎఫ్‌ఐఆర్) నమోదు కాగానే ముద్దాయిని అరెస్టు చేస్తారు. కొందరిని అరెస్టు చేసి ఛార్జిసీటుతో కోర్టులో ప్రవేశపెడతారు. మరికొందరిని ‘పరారీలో ఉన్నాడ’ని చూపిస్తారు. వీటన్నింటికీ పోలీసు కారణాలు చూపాలి. వారి ఇష్ట ప్రకారం జరపడానికి వీల్లేదు.
సీబీఐ అరెస్టు వారెంట్ కోరినట్టు లేదు. అరెస్టు చేయ మనీ అడిగినట్టు లేదు. అరెస్టూ చెయ్యలేదు.

అతనిపై వచ్చిన అభియోగంపై సమాధానం చెప్పుకోవటానికి కోర్టుకు రమ్మని అడిగింది... అంతే! ఇటువంటి పరిస్థి తుల్లో సాక్షికి సంబంధించిన బ్యాంకు ఖాతాలను స్తంభిం పచేయడం, ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయటం చూస్తుం టే ఈ రెండు చర్యలూ సమంజసం, సహేతుకం, చట్టస మ్మతం కాదని తేలుతున్నది. పైగా కొందరి ప్రజాస్వామిక హక్కులు, ప్రాథమిక హక్కులలో జోక్యం చేసుకోవటం అవుతుంది. జగన్‌మోహన్‌రెడ్డిపై వేయాలనుకున్న దెబ్బ పత్రికా స్వాతంత్య్రం మీద, ప్రజల ప్రాథమిక హక్కుల మీద పడుతున్నది. అక్రమ ఆస్తుల కేసులో సాక్షిపత్రిక, టీవీలను ఇరికించటం అప్రజాస్వామికమైన చర్య అవు తుంది. అభియోగం ఎంత తీవ్రమైనా, ముద్దాయి ఎవ రైనా చట్టం అందరికీ ఒకే విధంగా వర్తించాలనేది ధర్మ సూత్రమే కాదు, రాజ్యాంగ సూత్రం కూడా. దానిని కాపా డవలసిన కర్తవ్యం సీబీఐకి, ప్రభుత్వానికీ ఉన్నది. కాపా డుకోవలసిన అవసరం ప్రజలకూ ఉన్నది. 
Share this article :

0 comments: