జగన్ అరెస్టుపై ప్రముఖుల స్పందన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ అరెస్టుపై ప్రముఖుల స్పందన

జగన్ అరెస్టుపై ప్రముఖుల స్పందన

Written By news on Monday, May 28, 2012 | 5/28/2012



జగన్ అరెస్టు కుట్రపూరితం: వై.ఎస్.వివేకా
న్యూస్‌లైన్ నెట్‌వర్క్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు చేయడం కుట్రపూరితమైన చర్య. సీబీఐ విచారణ పేరుతో నోటీసు ఇచ్చి... మూడు రోజులపాటు విచారణ చేసి రాత్రి సమయంలో అరెస్టు చేయడం ఏమిటి? సోమవారం (28వ తేదీన) సీబీఐ కోర్టుకు హాజరయ్యేందుకు సిద్ధమైన జగన్‌ను అరెస్టు చేయడం హేయమైన చర్య.

జగన్ అరెస్టు అత్యంత దుర్మార్గం: ధర్మాన కృష్ణదాస్
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు అత్యంత దుర్మార్గమైన చర్య. ప్రజా న్యాయస్థానంలో జగన్‌ను ఎదుర్కోలేక కాంగ్రెస్, టీడీపీలు కుట్రచేసి జగన్‌ను అరెస్టు చేయించాయి. ఈ రెండు పార్టీలకు ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి.

వాన్‌పిక్‌తో జగన్‌కు ఏం సంబంధం?: బాలినేని
వాన్‌పిక్ సంస్థకు, జగన్‌కు అసలు ఏం సంబంధం? ఆయనెక్కడైనా సంతకాలు పెట్టారా? జీఓలు ఇచ్చారా? దానికీ, జగన్‌కూ లింకు పెట్టి అరెస్టు చేయడం ఏమిటి? ప్రజల్లో జగన్‌కు లభిస్తున్న ఆదరాభిమానాలు చూసి ఓర్వలేకనే ఆయన అరెస్టుకు ఢిల్లీ స్థాయిలో కుట్ర జరిగింది.

పిరికి పందల చర్య: కొండా సురేఖ
జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్ట్ చేయడం పిరికి పందల చర్య. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ప్రజాపోరులో అంతిమ విజయం జగన్‌దే. మేం కడవరకు జగన్‌తోనే ఉంటాం. ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో అధికార పార్టీ చేస్తున్న కుయుక్తులను ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.

కుట్రలను తిప్పికొట్టండి: కొరముట్ల శ్రీనివాసులు
జగన్ అభిమానులు సంయమనం పాటించాలి. దేవుడు అనేవాడు ఉన్నాడు... జగన్‌కు ఏమీ కాదు. వైఎస్‌ఆర్‌పై ఉన్న అభిమానాన్ని ఓటుద్వారా తీర్పునిచ్చి ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కలిగేలా చూడాలి.

రాక్షసపాలన సాగుతోంది: మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి
కేంద్రం, రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోంది. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కై అరెస్టు చేయించడం అప్రజాస్వామికం. ప్రజలు ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కకుండా తరిమికొట్టాలి. అప్పుడే దేశానికి, రాష్ట్రానికి పట్టిన పీడ విరగడవుతుంది.

శాంతియుతంగా నిరసన: కొణతాల రామకృష్ణ
ప్రజాదరణ పొందుతున్న జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనలేక కుయుక్తులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐని అడ్డుపెట్టుకొని అమానుషంగా అరెస్టు చేయడం విచారకరం. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఉప ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాలకు తగిన బుద్ధి చెప్తారు.

ఓర్వలేకే కుట్రలు: ఆకేపాటి అమరనాథరెడ్డి
కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తెచ్చినందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి ఆ పార్టీ పెద్దలు చేస్తున్న అన్యాయం దేశచరిత్రలో ఎక్కడా లేదు. టీడీపీ, కాంగ్రెస్, సీబీఐల దుశ్చర్యలను ప్రజలు ఎండగడతారు.

ప్రజాస్వామ్యం అపహాస్యం: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
ప్రజల హక్కులను కాలరాసిన బ్రిటిష్ ప్రభుత్వం పోయి, అదే విధానాలను అవలంబిస్తున్న ఇటలీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న పెద్దలకు ప్రజలు త్వరలో తగిన రీతిలో బుద్ధి చెబుతారు.

అరెస్టు దుర్మార్గపు చర్య: నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి పోయేకాలం దాపురించి దుర్మార్గాలకు పాల్పడుతోంది. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జగన్ నిర్దోషిగా బయటకు వస్తారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమన్వయంతో వ్యవహరించి అధికార, ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టాలి.

ప్రజలే సమాధానమిస్తారు: మైసూరారెడ్డి
అరెస్టు అకారణం, దుర్మార్గం, దురదృష్టకరం. పసలేని కేసులో పంతానికి పోయి అరెస్టు చేశారు. కక్ష సాధింపు ధోరణిలోనే ఈ అరెస్టు సాగింది. ఈ చర్యలకు ప్రజలు తప్పకుండా తమదైన శైలిలో జవాబిస్తారు.

ఓట్ల రూపంలో నిరసన తెలపాలి: రోజా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలనే పైశాచిక ఆనందం పొందాలనుకోవడంలో భాగంగానే ఈ సర్కారు జగన్‌ను అరెస్టు చేయించింది. ఉప ఎన్నికల్లో ఒక్కచోటా గెలవలేమనే భయంతోనే కాంగ్రెస్ ఈ చర్యలకు పాల్పడుతోంది. ప్రజలు ఓట్ల రూపంలో నిరసన తెలపాలి.

ఓటమి భయంతోనే అరెస్టు: కొండా మురళి
ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్, టీడీపీలు కుట్ర పన్ని సీబీఐని ఉసిగొలిపి జగన్‌ను అరెస్టు చేయించాయి. ప్రజలు మా వెంటే ఉన్నారు. వారి కసి మొత్తం జరగబోయే ఉప ఎన్నికల్లో ఓట్ల రూపంలో చూపిస్తారు.

నిర్బంధాలపై ఫిర్యాదు చేస్తాం: కేకే మహేందర్‌రెడ్డి
విచారణ పేరుతో సీబీఐ అక్రమంగా జగన్‌ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామిక వాదులు ఈ అరెస్టును ఖండించాలి.

కుట్రలో భాగమే అరెస్టు: ఆది శ్రీనివాస్
కాంగ్రెస్, టీడీపీల కుట్రలో భాగమే జగన్ అరెస్టు. సోనియాగాంధీ డెరైక్షన్‌లోనే తొమ్మిది నెలలుగా విచారణ పేరుతో జగన్‌ను హింసిస్తున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవన్న భయంతో మూడు రోజులుగా విచారణను ఎదుర్కొంటున్న జగన్‌ను అరెస్టు చేసి తమ కుట్రను బహిర్గతం చేశారు.

ఇది చీకటి రోజు: పుట్ట మధు
జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేయడం రాష్ట్రంలో చీకటి రోజు. బడుగు బలహీనవర్గాల కోసం పోరాటం చేస్తున్న జగన్‌ను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదు. సోమవారం జరిగే రాష్ర్ట బంద్‌ను ప్రజలు విజయవంతం చేయాలి.
Share this article :

0 comments: