ఆయన భూములు కట్టబెట్టింది.. ఫ్యాక్టరీలు పెట్టడానికి కాదు... ఉపాధి కల్పించడానికీ కాదు.. శ్రీమంతులు కర్ర, బాలు, గుంతతో ‘గోల్ఫ్’ ఆట ఆడుకోవడానికి.. విలాసమంతమైన భవనాలు కట్టుకొని అమ్ముకోవడానికి.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆయన భూములు కట్టబెట్టింది.. ఫ్యాక్టరీలు పెట్టడానికి కాదు... ఉపాధి కల్పించడానికీ కాదు.. శ్రీమంతులు కర్ర, బాలు, గుంతతో ‘గోల్ఫ్’ ఆట ఆడుకోవడానికి.. విలాసమంతమైన భవనాలు కట్టుకొని అమ్ముకోవడానికి..

ఆయన భూములు కట్టబెట్టింది.. ఫ్యాక్టరీలు పెట్టడానికి కాదు... ఉపాధి కల్పించడానికీ కాదు.. శ్రీమంతులు కర్ర, బాలు, గుంతతో ‘గోల్ఫ్’ ఆట ఆడుకోవడానికి.. విలాసమంతమైన భవనాలు కట్టుకొని అమ్ముకోవడానికి..

Written By news on Friday, May 25, 2012 | 5/25/2012


తొమ్మిది నెలలుగా విచారణ చేస్తున్నా సీబీఐ ఎందుకు పిలవలేదు?
ఉప ఎన్నికలకు 15 రోజుల ముందే పిలవాలనిపించిందా!
వయలార్ రవి.. సీఎం కిరణ్, చంద్రబాబు, డీజీపీ, సీబీఐ జేడీతో 
సమాలోచనలు చేశాక.. ఓ కుట్రను రచించారు
నన్ను అరెస్టు చేసి, అల్లర్లు సృష్టించి ఎన్నికలు ఆపేయాలన్నదే ఆ కుట్ర
రేపేం జరుగుతుందో నాకు తెలియదు.. నాకు ఏం జరిగినా ఫర్వాలేదు.. 
ప్రజలంతా నిబ్బరంగా, నిర్భయంగా, సంయమనంతో ఉండండి
ఎలాగైనా ఉప ఎన్నికలు జరిపించుకుని.. ఓటుతో బుద్ధి చెప్పండి

గుంటూరు, న్యూస్‌లైన్ ప్రతినిధి: ఉప ఎన్నికల తరుణంలో సీబీఐ తనకు సమన్లు జారీ చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. ‘రేపు(శుక్రవారం) నన్ను అరెస్టు చేయడానికి సర్వం సన్నద్ధం చేస్తున్నారు. ఈ రోజు నేను సీబీఐను ఒక్కటే ఒక్కటి అడుగుతున్నా. అయ్యా సీబీఐ అధికారులూ తొమ్మిది నెలలుగా మీరు దర్యాప్తు చేస్తున్నారు. ఈ 9 నెలల్లో ఏ ఒక్క రోజూ కూడా జగన్‌ను పిలిచి విచారణ చేయాలని మీకు అనిపించలేదు. కేవలం ఎన్నికలకు 15 రోజులు ఉందనగా.. ఇవాళే మీకు అనిపిస్తోంది జగన్‌ను అరెస్టు చేయాలని, జగన్‌ను విచారణ చేయాలీ అని! ఏ స్థాయిలో రాజకీయాలు జరుగుతున్నాయో తెలుస్తోంది’ అని జగన్ విమర్శించారు. సీబీఐ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన మహానేత విషయంలో ఒక మాదిరిగా, బతికున్న చంద్రబాబు విషయంలో మరొకలా వ్యవహరిస్తోందని అన్నారు. వేల మందికి ఉద్యోగాలు ఇవ్వటం కోసం వైఎస్ భూములు లీజుకిస్తే తప్పుగా భావిస్తున్న సీబీఐ.. చంద్రబాబు ఎమ్మార్‌కు చేసిన భూముల ధారాదత్తాన్ని ఎందుకు తప్పుపట్టడం లేదని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫున ప్రచారం చేస్తోన్న ఆయన.. నాలుగో రోజు గురువారం దుర్గి, కారంపూడి మండలాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో జగన్ ఉద్వేగంగా ప్రసంగించారు. ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

కుమ్మక్కు కుట్ర ఇది..

మొన్న వయలార్ రవి(కాంగ్రెస్ అధిష్టానం దూత) రాష్ట్రానికి వచ్చారు. సీబీఐ జాయింట్ డెరైక్టర్‌తో, డీజీపీతో, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో.. ఆ తర్వాత చంద్రబాబు నాయుడితో సమాలోచనలు జరిపారు. ఆ తర్వాత ఒక కుతంత్రాన్ని రచించారు. అదేంటీ అంటే.. ఎలక్షన్లకు ముందు జగన్‌ను అరెస్టు చేయాలి.. అరెస్టు చేశాక.. కాంగ్రెస్, టీడీపీలు కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలను తీసుకురావాలి.. 18 చోట్ల ఎన్నికలు జరగకుండా చేయాలీ అని పన్నాగం పన్నారు. కారణమేంటంటే.. ఆ రెండు రాజకీయ పార్టీలు 18 నియోజకవర్గాల్లో సర్వే చేయించుకున్నాయట.. ఆ సర్వేల్లో 18 చోట్లా కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు కూడా రావని తేలిందట. అందుకే ఎన్నికలు ఆపాలని నీచ రాజకీయాలకు దిగుతున్నారు.

ఏం జరిగినా నిబ్బరంగా, నిర్భయంగా ఉండాలి


రేపొద్దున(శుక్రవారం) నాకేం జరుగుతుందో తెలీదు. ఏం జరిగినా ఫర్వాలేదు. అందరూ నిబ్బరంగా ఉండాలి.. నిర్భయంగా ఉండాలి. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని దేశమంతటికీ తెలిసేలా చేయాలి. అంటే ఈ ఎన్నికలను ఎలాగైనా జరిపించుకోవాలి. ఈ ఎన్నికల్లో తీర్పు వచ్చాక.. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని దేశం మొత్తం చూస్తుంది. ఓటుతో ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి. ఉప ఎన్నికల్లో వచ్చే అఖండ విజయమే దివంగత నేతకు ఘన నివాళి.

రైతుల్లో ఉరి మేలనే మాట వినిపిస్తోంది.... 


మహా నేత మన మధ్య నుంచి వెళ్ళిపోయాక రాష్ట్రంలో పరిస్థితి దయనీయంగా మారిపోయింది. రైతన్నను అడిగినప్పుడు వ్యవసాయం కన్నా ఉరే మేలనే మాట ప్రతి చోటా వినిపిస్తోంది. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించి లక్ష ఎకరాలను బీడుగా మార్చినా ప్రభుత్వానికి పట్టడం లేదు. అన్నదాత ఆత్మహత్యలు జరుగుతున్నా కనీసం ఆలోచించాలని కూడా ఈ ప్రభుత్వానికి అనిపించడంలేదు. వైఎస్ మరణించాక పేదవాడి ముఖాన చిరునవ్వే కనిపించటం లేదు. ప్రతి ఇంటి నుంచి ఒక్కరైనా ఇంజనీరో, డాక్టరో అవ్వాలని.. కలెక్టర్ లాంటి పెద్ద పెద్ద చదువులు చదవాలనీ.. వారు బయటకు వెళ్లి కాస్తో కూస్తో సంపాదించి ఇంటికి పంపాలని.. అప్పుడే ఆ ఇంటి నుంచి పేదరికం పోతుందని మహానేత గొప్పస్వప్నం చూశారు. అందుకే ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ప్రవేశపెట్టారు. కానీ వైఎస్ మరణించాక విద్యార్థుల్ని పలకరిస్తే.. ‘అన్నా నాకు ఇంజనీరింగ్‌కు రూ.35 వేలు అవుతోంది.. అన్నా డాక్టర్‌కు రూ.55 వేలు కట్టాలి.. మేం కాలేజీకి అయితే వెళ్తున్నాం కానీ ఈ ప్రభుత్వం ఫీజు కడుతుందో, కట్టదో అని భయంగా ఉందన్నా’ అని చెబుతున్నారు.

పేదల ఆరోగ్యంతో చెలగాటం....


పేదలకు హఠాత్తుగా గుండె పోటు వచ్చో.. ఏ ప్రమాదమైనా జరిగో 108కు ఫోన్ చేస్తే 20 నిముషాల్లో వచ్చి.. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి, లక్షలు ఖర్చయ్యే వైద్యమైనా ఉచితంగా చేయించి.. చిరునవ్వుతో ఇంటికి వెళ్లేలా ఓ గొప్ప పథకాన్ని మహానేత ప్రవేశపెట్టారు. కానీ ఈ పథకానికి కిరణ్ సర్కార్ తూట్లు పొడుస్తోంది. ఇప్పుడు 108 అంబులెన్స్‌లు సగానికి సగం రిపేరు షెడ్లలో పడి ఉన్నాయి. గ్రామాల్లో అవ్వలకు, తాతలకు షుగర్‌లు, బీపీలు ఇతర జబ్బులకు మందులివ్వడానికి వైఎస్ 104 సేవలను ప్రారంభించారు. ఆ దివంగత నేత మంచి కొడుకులా 104ను ప్రారంభిస్తే అది ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. 104 ఉద్యోగులు ధర్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోదు. ఆరోగ్య శ్రీ పథకాన్నీ కుదించేశారు. పథకం నుంచి 135 జబ్బులను తొలగించారు. మూగ, చెవుడు ఉన్న పిల్లలకు సంజీవని లాంటి కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్‌కు రూ.6 లక్షలపైనే ఖర్చయినా సరే.. వైఎస్ హయాంలో పిల్లలకు 12 ఏళ్ళ వయసు వరకు ఉచితంగానే చేయించారు. ఆయన మరణించాక.. ప్రస్తుత ప్రభుత్వం రెండేళ్లు దాటిన పిల్లలకు ఆ సర్జరీ చేయంపో అంటోంది.

కుమ్మక్కు రాజకీయాలు..

ప్రభుత్వం సంగతి ఇలా ఉంటే.. ప్రతిపక్షమేమో ప్రజల్ని గాలికొదిలేసి అధికారపక్షంతో కుమ్మక్కై రాజకీయాలు చేస్తోంది. వీరి కుమ్మక్కు ఏ స్థాయిలో ఉందంటే.. ఇద్దరూ కలసికట్టుగా కోర్టుల దాకా వెళ్తారు.. వెళ్లి కలిసి కేసులు కూడా వేస్తారు. మహానేతను అప్రతిష్టపాలు చేయటానికి అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు. ఇద్దరూ లోపాయకారి ఒప్పందాలు పెట్టుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఆర్‌టీఐ కమిషనర్ పదవులను కూడా పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకోవటానికి ఆయనకు సంబంధించిన జి.ఎన్.నాయుడు అనే వ్యక్తికి హైదరాబాద్ నడిబొడ్డున అమీర్‌పేటలో ఐదెకరాల భూమిని స్వయంగా కాంగ్రెస్ సీఎంలే ధారాదత్తం చేశారంటే పరిస్థితి అర్థంచేసుకోవచ్చు. దివంగత మహానేత వేలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని వెనుకబడిన మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో రెండు పెద్ద సంస్థలకు 75 ఎకరాల చొప్పున 25 ఏళ్లపాటు లీజుకిస్తే సీబీఐ తప్పు పడుతోంది. ఇదే సీబీఐ ఎమ్మార్ కేసునూ విచారిస్తోంది. చంద్రబాబు హైదరాబాద్‌లో 535 ఎకరాల భూమిని ఎమ్మార్ సంస్థకు ధారాదత్తం చేసేస్తే.. అది కూడా ఎకరం రూ.4 కోట్ల చొప్పున విలువ చేసే భూమిని ఎకరం రూ.29 లక్షల చొప్పున కట్టబెట్టేస్తే.. ఎందుకిలా చేశారు అని సీబీఐ చంద్రబాబును అడగనైనా అడగదు. ఆయన భూములు కట్టబెట్టింది.. ఫ్యాక్టరీలు పెట్టడానికి కాదు... ఉపాధి కల్పించడానికీ కాదు.. శ్రీమంతులు కర్ర, బాలు, గుంతతో ‘గోల్ఫ్’ ఆట ఆడుకోవడానికి.. విలాసమంతమైన భవనాలు కట్టుకొని అమ్ముకోవడానికి.. అయినా ఇది సీబీఐకు కనపడదు. 
Share this article :

0 comments: