చంద్రబాబు కృష్ణపట్నం పోర్టిచ్చినా, కాకినాడ పోర్టిచ్చినా, గంగవరం పోర్టిచ్చినా.. ఆయన ఎందుకిచ్చారు? ఎలా ఇచ్చారు? అని సీబీఐ కనీసం అడగనైనా అడగడం లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు కృష్ణపట్నం పోర్టిచ్చినా, కాకినాడ పోర్టిచ్చినా, గంగవరం పోర్టిచ్చినా.. ఆయన ఎందుకిచ్చారు? ఎలా ఇచ్చారు? అని సీబీఐ కనీసం అడగనైనా అడగడం లేదు

చంద్రబాబు కృష్ణపట్నం పోర్టిచ్చినా, కాకినాడ పోర్టిచ్చినా, గంగవరం పోర్టిచ్చినా.. ఆయన ఎందుకిచ్చారు? ఎలా ఇచ్చారు? అని సీబీఐ కనీసం అడగనైనా అడగడం లేదు

Written By news on Thursday, May 24, 2012 | 5/24/2012

- కాంగ్రెస్, టీడీపీల కుట్రపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
- ఎన్నికలు ఆపేసి.. ప్రజలు ఓటేసే అవకాశాన్ని లేకుండా చేయాలని చూస్తున్నారు
-ఏది ఏం జరిగినా రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిపించుకోవాలి.. ఆ ఎన్నికల్లో ఓటుతో ఈ రెండు పార్టీలకూ బుద్ధి చెప్పాలి
-ఎన్నికలు ఆపేసి.. ప్రజలు ఓటేసే అవకాశాన్ని లేకుండా చేయాలని చూస్తున్నారు
-ఉప ఎన్నికలకు ముందే నన్ను అరెస్టు చేయటానికి కుట్ర చేస్తున్నారు
-అరెస్టు చేశాక రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ అల్లర్లు సృష్టిస్తాయట
-ఆ అల్లర్లు నేనే చేయించానని చెప్పి.. ఎన్నికలు ఆపేయాలని చూస్తున్నారు
-ఈ చెడిపోయిన రాజకీయాల్లో నిజాయతీని తిరిగి తేవాలంటే ఏది ఏం జరిగినా రాష్ట్రంలో 
ఉప ఎన్నికలు జరిపించుకోవాలి
- ఆ ఎన్నికల్లో ఓటుతో ఈ రెండు పార్టీలకూ బుద్ధి చెప్పాలి
- వైఎస్సార్ నిమ్మగడ్డకు మేలు చేశారంటూ ఆయన్ను జైల్లో పెట్టారు
-బాబు పోర్టుల మీద పోర్టులు కేటాయిస్తే సీబీఐ అడగదేం? 

గుంటూరు, న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘అధికారపక్షంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఇద్దరూ కుమ్మక్కై అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వీరి కుమ్మక్కు ఏ స్థాయిలో ఉందో చెప్పాలంటే.. ఒక్కసారి సీబీఐ దర్యాప్తు తీరు చూస్తే చాలు. పారిశ్రామికాభివృద్ధి కోసం దివంగత నేత వైఎస్ ప్రయత్నిస్తే.. ఆయన నిమ్మగడ్డ ప్రసాద్‌కు మేలు చేశారంటూ సీబీఐ ప్రసాద్‌గారిని జైల్లో పెట్టింది. చంద్రబాబు కృష్ణపట్నం పోర్టిచ్చినా, కాకినాడ పోర్టిచ్చినా, గంగవరం పోర్టిచ్చినా.. ఆయన ఎందుకిచ్చారు? ఎలా ఇచ్చారు? అని సీబీఐ కనీసం అడగనైనా అడగడం లేదు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శిం చారు.

త్వరలో జరుగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల డిపాజిట్లు పూర్తిగా గల్లంతైపోతాయని తెలిసి.. మొత్తం ఆ ఎన్నికలే జరగకుండా అడ్డుకోవడానికి రెండు పార్టీలూ పన్నాగాలు పన్నుతున్నాయని జగన్ విమర్శించారు. ‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఓటేసే అవకాశం కూడా ఇవ్వకుండా చేయాలని చూస్తున్న ఈ పార్టీల దిగజారుడుతనాన్ని చూస్తుంటే బాధనిపిస్తోంది’ అని ఆవేదన వ్యక్తంచేశారు. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి మూడోరోజు బుధవారం మాచర్ల రూరల్, రెంటచింతల, దుర్గి మండలాల్లో రోడ్‌షో నిర్వహించారు. పలు చోట్ల ప్రసంగించారు. ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

నిన్ననే(మంగళవారం) నాకు సమాచారం అందింది. అది విని బాధనిపించింది. ఆ 18 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, టీడీపీల సర్వే ప్రకారం ఆ రెండు పార్టీలకూ డిపాజిట్లు కూడా రావని తేలిందట. డిపాజిట్లు పోతే.. ఇక రాష్ట్రంలో ఆ రెండు పార్టీలకు ఉనికి పోతుందని ఇద్దరూ దిగజారుడు రాజకీయాలు మొదలుపెట్టారు. మొన్ననే కాంగ్రెస్ దూత వయలార్ రవి రాష్ట్రానికి వచ్చారు. డీజీపీ దినేశ్‌రెడ్డితోనూ, సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణతోనూ, సీఎంతోనూ మాట్లాడారు. చంద్రబాబు నాయుడుతోనూ సంభాషణలు జరిపారు. వీరంతా కలిసి ఉప ఎన్నికలు జరిగేలోపే మూడు నాలుగు రోజుల్లో జగన్‌ను అరెస్టు చేయాలని కుట్ర పన్నారు. 

ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి ఇదంతా జగనే చేయించాడని చెప్పుతారట. ఇలా చేసి 18 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగకుండా చేయాలని చూస్తున్నారు. సంయమనం పాటించాలి: ఈ ఎన్నికలు జరుగుతాయో జరగవో నాకైతే తెలియదుగాని.. వీళ్ల పాచికలు పారుతాయో పారవో నాకైతే తెలియదుగాని.. ఒక్కటైతే చెప్తున్నా.. వీళ్లు చేస్తున్న నీచమైన రాజకీయాలకు బుద్ధి చెప్పాలీ అంటే.. ఈ చెడిపోయి ఉన్న రాజకీయ వ్యవస్థలోకి నిజాయతీని తీసుకురావడానికి మనం కచ్చితంగా ఎన్నికలు జరిపించుకోవాలి. ఓటు వేయాలి. ఎవరు ఏం చేసినా.. సంయమనం పాటించాలి. జూన్ 12న ఎన్నికలు జరిగేలా చేసి వాళ్లకు బుద్ధి చెప్పాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.

వైఎస్ తిరిగి రాలేడని: దివంగత వైఎస్సార్‌ను తప్పుపడుతున్న సీబీఐ చంద్రబాబు నాయుడు విషయంలో మరో మాది రిగా వ్యవహరిస్తోంది. ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తిరిగి రాలేడని, ఆయన తరఫున ఎవరూ మాట్లాడరని, ఆయన్ను ఒంటరిని చేసి సీబీఐ నిందలు మోపుతోంది. వెనకబడిన మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో పరిశ్రమలు రావాలని, వేలాది మందికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఇద్దరు పారిశ్రామికవేత్తలకు వైఎస్ 75 ఎకరాల చొప్పున 25 ఏళ్లపాటు భూములు లీజుకిస్తే సీబీఐ తప్పుపడుతోంది. 

అక్కడ తమ లెక్కల ప్రకారం ఎకరా రూ.15 లక్షలు ఉంటే.. రూ.8 లక్షలకే ఇచ్చారంటోంది. మరోపక్క తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో మీరు ఫ్యాక్టరీలు పెట్టండి.. మేం భూములు ఉచితంగా ఇస్తామని ఆ రాష్ట్రాల సీఎంలు అంటున్నా సీబీఐకి కనిపించదు. ఇదే సీబీఐ ఎమ్మార్ కేసులోనూ విచారణ చేస్తోంది. చంద్రబాబు నాయుడు ఈ ఎమ్మార్ సంస్థకు సాక్షాత్తూ హైదరాబాద్‌లో 535 ఎకరాలను ధారాదత్తం చేసేసినా సీబీఐకి కనపడదు. ఎకరా రూ.4 కోట్లు పలికే భూమిని ఎకరా రూ.29 లక్షల చొప్పున శెనక్కాయలకు, బఠానీలకు అమ్మినట్లు చంద్రబాబు ఇచ్చేసినా పట్టించుకోదు. అదీ వెనుకబడిన జిల్లాలో కాదు.. అక్కడ ఫ్యాక్టరీలు పెట్టి వేల మందికి ఉపాధి కల్పించడానికీ కాదు.. హైదరాబాద్‌లో అన్ని ఎకరాలను ఇచ్చింది శ్రీమంతులు ‘గోల్ఫ్’ ఆట ఆడుకోవడానికి.. విలాసవంతమైన విల్లాలు కట్టుకోవడానికి.. ఇది సీబీఐకి కనిపించదు. కనీసం ఆయన వైపు కన్నెత్తయినా చూడదు.

ఆ రెండు పార్టీలే ఉండాలట: ‘సాక్షి’ పత్రికను, ‘సాక్షి’ టీవీని మూసేయించాలని కాంగ్రెస్, చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 అంతా ఒక్కటై కుట్ర చేస్తున్నారు. ఎందుకంటే సాక్షి లేకపోతే మరో మాట జనానికి వినపడదు.. కనపడదు, అప్పుడు ఈనాడు రాసిందే రాత, ఆంధ్రజ్యోతి రాసిందే గీత, టీవీ9 చూపిందే నిజమని నమ్మించాలని చూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, లేదా చంద్రబాబు పార్టీ మాత్రమే ఉండాలట. కాంగ్రెస్‌పై ప్రజలకు విసుగెత్తినప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీకి ఓటేయాలట..ఆ పార్టీపై విసుగెత్తినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలట. రాష్ట్రంలో మూడో పార్టీ ఉండనే కూడదని వీళ్లు నీచ రాజకీయాలు చేస్తున్నారు.
Share this article :

0 comments: