ఆ రెండు పార్టీల ఉమ్మడి ఓట్లకన్నా..వైఎస్సార్ కాంగ్రెస్‌కు 1.59 లక్షల ఓట్లు ఎక్కువ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ రెండు పార్టీల ఉమ్మడి ఓట్లకన్నా..వైఎస్సార్ కాంగ్రెస్‌కు 1.59 లక్షల ఓట్లు ఎక్కువ

ఆ రెండు పార్టీల ఉమ్మడి ఓట్లకన్నా..వైఎస్సార్ కాంగ్రెస్‌కు 1.59 లక్షల ఓట్లు ఎక్కువ

Written By news on Saturday, June 16, 2012 | 6/16/2012

నెల్లూరు లోక్‌సభ స్థానంతో పాటు 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అత్యధిక ప్రజాదరణతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానంలో నిలిచింది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల అభ్యర్థులకు కలిపి వచ్చిన ఓట్లకన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు 1.59 లక్షల ఓట్లు అధికంగా వచ్చాయి. నెల్లూరు ఎంపీ స్థానంతో పాటు 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి 8,44,131 ఓట్లు రాగా.. టీడీపీకి 8,20,256 ఓట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీలకు కలిపి మొత్తం 16,64,387 ఓట్లు రాగా.. ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే 18,23,422 ఓట్లు వచ్చాయి. 

కాంగ్రెస్, టీడీపీలు వేర్వేరుగా పోటీ చేసినా కొన్ని చోట్ల అంతర్గతంగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నా.. ఆ రెండు పార్టీలనూ ఉమ్మడిగా కలిపి చూసినా కూడా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ప్రజాదరణ పొందటం విశేషం. అలాగే.. నెల్లూరు లోక్‌సభ స్థానంతో పాటు 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 48.88 శాతం ఓట్లతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీకి కేవలం 22.63 శాతం ఓట్లు రాగా టీడీపీకి 21.99 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్, టీడీపీలకు కలిపి వచ్చిన ఓట్లు శాతం 44.62 గా ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్ష టీడీపీ కానీ సొంతంగా వైఎస్సార్ కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్ల శాతంలో సగం కూడా సాధించలేని స్థితికి దిగజారినట్లు ఉప ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే ఇటు కాంగ్రెస్, అటు టీడీపీలకు చెందిన ఓటు బ్యాంకును వైఎస్సార్ కాంగ్రెస్ కొల్లగొట్టినట్లు ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 
Share this article :

0 comments: