చంద్రబాబు గుట్టు రట్టు చేసిన కోలా. సింగపూర్ లోని ఒక బ్యాంకులో బాబుకు 15వేల కోట్ల రూపాయల డాలర్లు -కోలా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు గుట్టు రట్టు చేసిన కోలా. సింగపూర్ లోని ఒక బ్యాంకులో బాబుకు 15వేల కోట్ల రూపాయల డాలర్లు -కోలా

చంద్రబాబు గుట్టు రట్టు చేసిన కోలా. సింగపూర్ లోని ఒక బ్యాంకులో బాబుకు 15వేల కోట్ల రూపాయల డాలర్లు -కోలా

Written By news on Saturday, June 9, 2012 | 6/09/2012

 తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు చెందిన విదేశీ బ్యాంకులలోని ఖాతాల గుట్టుని కోలా కృష్ణ మోహన్ రట్టు చేశారు. తనకు కోట్లలో లాటరీ వచ్చినట్లు గతంలో పలువురిని మోసం చేసినట్లు కోలాపై కేసులు ఉన్నాయి. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుకు, అతని కుటుంబ సభ్యులకు విదేశాలలోని బ్యాంకు ఖాతాలలో వేల కోట్ల రూపాయలు ఉన్నట్లు వివరించారు. సింగపూర్ లోని ఒక బ్యాంకులో బాబుకు 15వేల కోట్ల రూపాయల డాలర్లు ఉన్నట్లు తెలిపారు. బాబు విదేశీ ఖాతాల వివరాలను రెండు రోజులలో హైకోర్టుకు తెలుపుతానని చెప్పారు. 

గతంలో తనపై రెండుసార్లు హత్యాయత్నం చేయించినట్లు చెప్పారు. ఇప్పుడు తనకు ఏమైనా జరిగితే దానికే చంద్రబాబే బాధ్యుడవుతారని ఆయన తెలిపారు. తనకు లాటరీ వచ్చినట్లు తెలిసి చంద్రబాబు తనని పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు. 1999లో చంద్రబాబుకు 5 కోట్ల పది లక్షల రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. పది లక్షల రూపాయలు చెక్ రూపంలో ఇచ్చానని చెప్పారు. ఆ చెక్ ని నగదు చేసుకున్నట్లు తెలిపారు. కోటి రూపాయలు నగదు రూపంలో ఆయనకు ఇంట్లోనే ఇచ్చినట్లు చెప్పారు. మిగిలి నాలుగు కోట్ల రూపాయలను లండన్ లోని మిడ్ లాండ్స్ బ్యాంక్ ఖాతా నుంచి సింగపూర్ బ్యాంకులోని చంద్రబాబు నాయుడు ఖాతాలోకి మార్చినట్లు తెలిపారు. లండన్ లోని తన ఖాతా నెంబరు 433846 958001గా తెలిపారు. 

సింగపూర్ లోని డ్యూషే బ్యాంకులో సి.నాయుడు. నారా అనే పేరుతో 0204049121100 నెంబరుతో ఖాతా ఉన్నట్లు వివరించాడు. సింగపూర్ బార్ లేస్ బ్యాంకులో చంద్రబాబుకు మరో ఖాతా ఉన్నట్లు తెలిపారు. లండన్ లోని నార్త్ వెస్ట్ బ్యాంకులో కూడా ఖాతా ఉన్నట్లు చెప్పారు. స్విట్జర్లాండ్ లోని క్రెడిట్ నూయిస్ బ్యాంక్ లో కూడా చంద్రబాబుకు ఖాతా ఉన్నట్లు తెలిపారు. 2003 మార్చిలో కొన్ని ఖాతాలను మూసివేశారని, ఇంకా అనేక ఖాతాలలో వేల కోట్ల రూపాయలు ఉన్నట్లు చెప్పారు. 

1999లో లాటరీ వచ్చిందని తెలియడంతో చంద్రబాబు తనని పార్టీలోకి ఆహ్వానించినట్లు చెప్పారు. అతని వల్లే తాను అనేక కేసులలో ఇరుక్కున్నట్లు ఆయన తెలిపారు. 2003లో తనపై చంద్రబాబు మూడుసార్లు హత్యాయత్నం చేయించారని తెలిపారు. 

చంద్రబాబు కుమారుడు లోకేష్ తన వద్ద 25 లక్షల రూపాయలు తీసుకున్నట్లు తెలిపాడు. ఆ డబ్బుతో ఇంట్లో కూడా మరో 35 లక్షల రూపాయలు తీసుకొని లోకేష్ ఒక అమ్మాయిని తీసుకొని ఎటో వెళ్లిపోయినట్లు చెప్పాడు.
Share this article :

0 comments: