ఉప స్థానాల్లో స్వతంత్రులతో సహా మొత్తం బరిలో 255 మంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉప స్థానాల్లో స్వతంత్రులతో సహా మొత్తం బరిలో 255 మంది

ఉప స్థానాల్లో స్వతంత్రులతో సహా మొత్తం బరిలో 255 మంది

Written By news on Monday, June 11, 2012 | 6/11/2012

* ఉప స్థానాల్లో స్వతంత్రులతో సహా మొత్తం బరిలో 255 మంది 
* 17 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, టీడీపీ మధ్యే పోటీ
* నెల్లూరు పార్లమెంటు స్థానంలోనూ.. పరకాలలో బహుముఖ పోటీ

హైదరాబాద్, న్యూస్‌లైన్: మరో 24 గంటల్లో రాష్ట్రంలో ఒక ఎంపీ, 18 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ఘట్టానికి తెరలేవనుంది. పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ , పరకాల అసెంబ్లీ స్థానాలు మినహా మిగతా 17 అసెంబ్లీ స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. పరకాలలో బహుముఖ పోటీ ఉంది. నెల్లూరు లోక్‌సభతోపాటు 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. ఈ స్థానాల్లో కొన్నిచోట్ల బీజేపీ, వామపక్ష అభ్యర్థులు బరిలో ఉన్నా పోటీ నామమాత్రంగానే ఉంది. 

పరకాలలో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య బహుముఖ పోటీ నెలకొంది. ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులతో కలిపి మొత్తం 255 మంది బరిలో నిలిచారు. అత్యధికంగా ఒంగోలులో 23 మంది, రాజంపేట, తిరుపతిలో 19 మంది చొప్పున అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీంతో ఈ మూడు స్థానాల్లో రెండేసి బ్యాలెట్ యూనిట్లను వినియోగించనున్నారు. మిగతా స్థానాల్లో ఒక బ్యాలె ట్ యూనిట్ సరిపోతుంది. అతి తక్కువగా పోలవరం, నరసన్నపేటలో ఆరుగురు చొప్పున, నరసాపురం, పాయకరావుపేటలో తొమ్మిది మంది చొప్పున పోటీలో ఉన్నారు.

ఎన్నో కుట్రలు.. ఎంతో దుష్ర్పచారం..
ఉప ఎన్నికలు జరిగే స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి చెందిన నాయకులందరూ కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కడినే లక్ష్యంగా చేసుకుని ప్రచారం సాగించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, షర్మిల మాత్రం వైఎస్ పథకాలు, రైతులు, కూలీల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, జగన్‌పై కక్ష సాధింపు కుట్రలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించడం తథ్యమని తెలిసిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు కుట్రలు పన్ని ఉప ఎన్నికల ముందు జగన్ ప్రచారం చేయకుండా నిలువరించేందుకు సీబీఐతో అరెస్టు చేయించారు. అయితే ఆ బాధను దిగమింగుకుని విజయమ్మ, షర్మిల ఉప ఎన్నికల ప్రచారాన్ని భుజానికెత్తుకున్నారు. 

నరసాపురం నుంచి తిరుపతి వరకు వారు నిర్వహించిన ప్రచారానికి జనం నీరాజనాలు పట్టడంతో... కాంగ్రెస్, టీడీపీ నేతలకు భయం పట్టుకుంది. దీంతో దివంగత ముఖ్యమంత్రి సతీమణి, ఆయన కుమార్తె అన్న విచక్షణ కూడా లేకుండా... కాంగ్రెస్ నాయకులు, పెద్దలు వారి మీద విమర్శలకు దిగారు. వైఎస్ గురించి ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజల్లో మరింత చులకనయ్యారు. ఆఖరికి విజయమ్మ ప్రచార సభలకు విద్యుత్ సరఫరాను కూడా నిలుపుదల చేసిన ‘ఘనత’ను అధికార కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. 

అరెస్టు కాకముందు జగన్ నిర్వహించిన ఉప ఎన్నికల ప్రచార సభలు, తర్వాత విజయమ్మ, షర్మిల నిర్వహించిన ప్రచార సభల ముందు ముఖ్యమంత్రి, పీసీసీ అధినేత బొత్స, చిరంజీవి, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన సభలు జనం లేక వెలవెలబోయాయి. అత్యధిక జనాభిప్రాయం జగన్‌మోహన్‌రెడ్డి పక్షాన ఉందనే విషయం తెలుసుకున్న కాంగ్రెస్, టీడీపీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలకు తెరతీశాయి. కనీసం రెండో స్థానంతోనైనా పరువు నిలుపుకునేందుకు కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ విచ్చలవిడిగా నగదు పంపిణీకి పాల్పడింది. టీడీపీదీ ఇదే దారి. ఇందుకు ఒంగోలులో అయితే ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్నే వేదికగా చేసుకుంది. అక్కడి పార్టీ కార్యాలయంలో ఎన్నికల్లో పంపిణీకి సిద్ధంగా ఉంచిన రూ.16 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
Share this article :

0 comments: