30న వైఎస్సార్ సీపీ యువజన సమావేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » 30న వైఎస్సార్ సీపీ యువజన సమావేశం

30న వైఎస్సార్ సీపీ యువజన సమావేశం

Written By news on Thursday, June 28, 2012 | 6/28/2012

వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుల సమావేశం ఈ నెల(జూన్)30న పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని జిల్లాల యువజన అధ్యక్షులు పాల్గొనే ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలతో పాటు రాష్ట్రంలో యువకులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిపారు. అదే విధంగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతి ఉత్సవాలు తదితర అనేక అంశాలపై చర్చించి కార్యాచరణను రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు.
Share this article :

0 comments: