కుట్ర బయటకు రాకుండా కొత్తకథనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కుట్ర బయటకు రాకుండా కొత్తకథనం

కుట్ర బయటకు రాకుండా కొత్తకథనం

Written By news on Saturday, June 23, 2012 | 6/23/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిపై జరుగుతున్న కుట్ర బయటకు రాకుండా కొత్త కథనం మొదలు పెట్టారని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. సిబిఐ అధికారులు వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని దర్యాప్తు చేస్తున్నారన్నారు. జగన్ పేరు చెప్పమని పారిశ్రామికవేత్తలను వేధిస్తున్నారన్నారు. ఒక వ్యాపారి ఈ విషయాన్ని స్వయంగా జడ్జికే చెప్పిన అంశాన్ని గుర్తు చేశారు. జగన్ కు భౌతికంగా హానికలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తాజా పరిస్థితులు ఈ రకమైన ఆలోచనలకు బలం చేకూరుస్తున్నాయన్నారు. 

సిబిఐ జెడి లక్ష్మీనారాయణ వ్యవహార శైలిని ఆయన తప్పుపట్టారు. లక్ష్మీనారాయణ నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. జెడ్ కేటగిరీలో ఉన్న ఒక ప్రజానేతని, ఎంపిని ఒక సాధారణ వ్యాన్ లో కోర్టుకు తీసుకు వచ్చిన తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ కుట్రని బయటపెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుపడుతున్నారన్నారు. అసలు విషయం బయటకు రాకుండా ఒక వర్గం మీడియా తప్పుడు కథనాలు రాస్తున్నాయన్నారు. ఆ కుట్ర బయటకు రాకుండా కొత్త కథనం మొదలు పెట్టారని చెప్పారు. మీడియాని రెచ్చగొడుతున్నరన్నారు. విలేకరులపైన, మీడియాపైన తమకు నమ్మకం ఉందన్నారు. విలేకరుల స్వేచ్ఛని తామ ప్రశ్నించడంలేదని చెప్పారు. వారు సమాచార సేకరణ కోసం ఒక వ్యక్తితో వందసార్లైనా మాట్లాడవచ్చని అన్నారు. ఇక్కడ జరుగుతున్న కుట్రవేరన్నారు. ఒక సిబిఐ అధికారి వందల సార్లు ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో స్వయంగా మాట్లాడటం చట్టవిరుద్ధం అన్నారు. ఒకరి తరువాత ఒకరికి ఫోన్ చేసి మాట్లాడటం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. జగన్మోహన రెడ్డిని మొదటి రోజు విచారణ జరిపిన రోజున అంత బిజీగా ఉండి, మరో పక్క లక్ష్మీనారాయణ చేసిన ఫోన్ కాల్స్ ని పరిశీలిస్తే కుట్ర బయటపడుతుందన్నారు. 

జగన్ ని లక్ష్యంగా చేసుకొని ఒక పత్రిక నీచాతి నీచంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పత్రిక ఉందికదా అని రాధాకృష్ణ అడ్డగోలుగా రాస్తే ప్రజలు నమ్మరన్నారు. జెడి లక్ష్మీనారాయణకు, రాధాకృష్ణకు ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలన్నారు. జెడిని కాపాడటానికి రాధాకృష్ణ ఎందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 

ఉప ఎన్నికలలో తమ పార్టీ అపూర్వమైన ప్రజాధరణతో విజయం సాధించిందని చెప్పారు.
Share this article :

0 comments: