అభ్యర్థులకు షాడో బృందాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అభ్యర్థులకు షాడో బృందాలు

అభ్యర్థులకు షాడో బృందాలు

Written By news on Sunday, June 10, 2012 | 6/10/2012

ఉప ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు షాడో బృందా లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్ లాల్ చెప్పారు. ఈ సాయంత్రం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఈ ఉప ఎన్నికలలో మొత్తం ఓటర్లు 46,13,589 మంది ఉన్నట్లు తెలిపారు. నరసన్నపేట, పోలవరంలలో అతితక్కువగా బరిలో ఆరుగురు అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. అతి ఎక్కువగా ఒంగోలు బరిలో 23 మంది ఉన్నారు. 

నరసన్నపేట నియోజకవర్గంలో మొత్తం లక్షా70 వేల448 ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు ధర్మాన కృష్ణ దాస్(వైఎస్‌ఆర్‌సీపీ), రాందాస్ (కాంగ్రెస్), స్వామిబాబు(టీడీపీ) పోటీలో ఉన్నారు. 

పాయకరావుపేటలో మొత్తం 2 లక్షల ఒక వేయి 364 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు గొల్ల బాబూరావు (వైఎస్‌ఆర్‌సీపీ), సుమన(కాంగ్రెస్), చెంగల వెంకట్రావు(టీడీపీ) పోటీలో ఉన్నారు. 

రామచంద్రపురంలో మొత్తం లక్షా 78 వేల 484 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్ (వైఎస్‌ఆర్‌సీపీ), తోట త్రిమూర్తులు (కాంగ్రెస్), చిక్కాల రామచంద్రరావు (టీడీపీ) బరిలో ఉన్నారు. 

నర్సాపురంలో మొత్తం లక్షా41 వేల 832 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు ప్రసాదరాజు (వైఎస్‌ఆర్‌సీపీ), సుబ్బారాయుడు(కాంగ్రెస్), సత్యనారాయణరావు (టీడీపీ) పోటీలో ఉన్నారు. 

పోలవరంలో మొత్తం లక్షా72 వేల189 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు తెల్లం బాలరాజు(వైఎస్‌ఆర్‌సీపీ), పార్వతి(కాంగ్రెస్), శ్రీనివాస్(టీడీపీ) బరిలో ఉన్నారు. 

ప్రత్తిపాడులో మొత్తం 2 లక్షల 8 వేల ఒక ఓటర్ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు సుచరిత (వైఎస్‌ఆర్‌ సీపీ), సుధాకర్‌బాబు(కాంగ్రెస్), కందుకూరి వీరయ్య(టీడీపీ) పోటీలో ఉన్నారు. 
మాచర్లలో మొత్తం లక్షా 98 వేల 487 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(వైఎస్‌ఆర్‌సీపీ), లక్ష్మారెడ్డి(కాంగ్రెస్), మధు(టీడీపీ) పోటీలో ఉన్నారు. 

ఒంగోలులో మొత్తం 2 లక్షల 514 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు బాలినేని శ్రీనివాస రెడ్డి (వైఎస్‌ఆర్‌సీపీ), పార్వతమ్మ (కాంగ్రెస్), జనార్దన్(టీడీపీ) పోటీలో ఉన్నారు. 

ఉదయగిరిలో మొత్తం లక్షా 95 వేల 963 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి(వైఎస్‌ఆర్ సీపీ), విజయరామిరెడ్డి(కాంగ్రెస్), వెంకటరామారావు(టీడీపీ) పోటీలో ఉన్నారు. 
అనంతపురంలో మొత్తం లక్షా 88 వేల 616 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు గుర్నాథ రెడ్డి(వైఎస్‌ఆర్ సీపీ), ముర్షీదా బేగం(కాంగ్రెస్), శ్రీనివాస్(టీడీపీ) పోటీలో ఉన్నారు. 
రాయదుర్గంలో మొత్తం లక్షా 94 వేల 616 ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు కాపు రామచంద్రా రెడ్డి(వైఎస్‌ఆర్‌సీపీ), వేణుగోపాల్‌రెడ్డి(కాంగ్రెస్), దీపక్‌రెడ్డి (టీడీపీ) బరిలో ఉన్నారు. 

పరకాలలో మొత్తం లక్షా 87 వేల 450 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు కొండా సురేఖ(వైఎస్‌ఆర్‌సీపీ), సమ్మారావు(కాంగ్రెస్), ధర్మారెడ్డి(టీడీపీ) పోటీలో ఉన్నారు. 


ఎమ్మిగనూరులో మొత్తం లక్షా 90 వేల179 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి(వైఎస్‌ఆర్‌సీపీ), రుద్రగౌడ్(కాంగ్రెస్), బీవీ మోహన్‌రెడ్డి(టీడీపీ) పోటీలో ఉన్నారు. 

ఆళ్లగడ్డలో మొత్తం లక్షా 96 వేల133 మంది ఓటర్లు ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు భూమా శోభానాగి రెడ్డి(వైఎస్‌ఆర్‌సీపీ), ప్రతాప్‌రెడ్డి(కాంగ్రెస్), రాంపుల్లా రెడ్డి( టీడీపీ) పోటీలో ఉన్నారు. 

రాజంపేటలో మొత్తం లక్షా 81 వేల 431 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి(వైఎస్‌ఆర్‌సీపీ), మల్లికార్జున రెడ్డి(కాంగ్రెస్), బ్రహ్మయ్య(టీడీపీ) రంగంలో ఉన్నారు. 

రాయచోటిలో మొత్తం లక్షా 93 వేల 439 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి(వైఎస్‌ఆర్‌సీపీ), రాంప్రసాద్‌రెడ్డి(కాంగ్రెస్), బాలసుబ్రహ్మణ్యం(టీడీపీ) బరిలో ఉన్నారు. 

రైల్వేకోడూరులో మొత్తం లక్షా 56 వేల 257 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు శ్రీనివాసులు (వైఎస్‌ఆర్‌సీపీ), ఈశ్వరయ్య(కాంగ్రెస్), అజయ్‌బాబు(టీడీపీ) పోటీలో ఉన్నారు. 

తిరుపతిలో మొత్తం 2 లక్షల 52 వేల780 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు భూమన కరుణాకర్‌ రెడ్డి(వైఎస్‌ఆర్‌సీపీ), వెంకటరమణ(కాంగ్రెస్), కృష్ణమూర్తి (టీడీపీ) రంగంలో ఉన్నారు. 

నెల్లూరు లోక్ సభ నియోజకవర్గంలో మొత్తం 13 లక్షల 51 వేల 269 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి(వైఎస్‌ఆర్‌సీపీ), టి.సుబ్బరామి రెడ్డి(కాంగ్రెస్), వేణుగోపాల్‌ రెడ్డి(టీడీపీ) పోటీలో ఉన్నారు.
Share this article :

0 comments: