వైఎస్సార్‌సీపీపై టీడీపీ, కాంగ్రెస్ నేతల బెట్టింగ్‌ల జోరు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీపై టీడీపీ, కాంగ్రెస్ నేతల బెట్టింగ్‌ల జోరు

వైఎస్సార్‌సీపీపై టీడీపీ, కాంగ్రెస్ నేతల బెట్టింగ్‌ల జోరు

Written By news on Wednesday, June 13, 2012 | 6/13/2012


రాష్ట్రంలో పోలింగ్ ముగిసి, పందేలు జోరందుకున్నాయి. మంగళవారం ఉప ఎన్నికల పోలింగ్ సరళిని గమనించిన పందేల రాయుళ్లు.. గెలుపుగుర్రం వైఎస్‌ఆర్ కాంగ్రెస్సేనని నిర్ధరించుకున్నారు. వైఎస్‌ఆర్ సీపీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయంపైనే ప్రధానంగా బెట్టింగులు సాగుతున్నాయి. అన్నిచోట్లా వైఎస్‌ఆర్‌సీపీ గెలుస్తుందని కొందరు, 18, 17, 16, 15.. ఇలా ఎవరి అంచనాతో వారు పందేలు కాశారు. వైఎస్‌ఆర్‌సీపీ అత్యధిక స్థానాల్లో గెలుస్తుందంటూ టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన నేతలే కోట్లలో బెట్టింగులు కట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మద్యం వ్యాపారుల మధ్య బెట్టింగులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. వీరితోపాటు ఉద్యోగులు, రైతులు కూడా పందేలు కాసినవాళ్లలో ఉన్నారు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఓ ప్రతిపక్ష ప్రజాప్రతినిధి అనుయాయులు వైఎస్సార్ సీపీకి 17 సీట్లు ఖాయం అంటూ కోట్లల్లో బెట్టింగుకు సిద్ధమయ్యారు. వైఎస్సార్ సీపీకి 15 సీట్లు ఖాయమంటూ మరో కాంగ్రెస్ నేత పందేనికి సై అంటున్నారు. ఏలూరు, భీమవరం ప్రాంతాల నుంచి పందేలు కాసేందుకు జిల్లాకు వస్తున్నారు. కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో వైఎస్సార్ సీపీ గెలిచే సీట్ల సంఖ్యతో పాటు నర్సాపురం నియోజకవర్గంలో గెలుపోటములపైనా భారీగా పందేలకు సిద్ధపడుతున్నారు. విజయవాడ వన్‌టౌన్‌లో కోట్ల రూపాయలలో పందేలు ఊపందుకున్నాయి. విజయనగరం జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న అంశంపై చీపురుపల్లిలో ఇద్దరు ఔత్సాహికులు తమ ద్విచక్ర వాహనాలను పందెం కాసి ఓ న్యాయవాది వద్ద ఉంచినట్లు సమాచారం. ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డికి 10వేల లోపు మెజార్టీ వస్తుందని కోట్లలోనే బెట్టింగులు కాశారు. 10 నుంచి 15 వేల లోపు మెజార్టీ వస్తుందని లక్షల్లో బెట్టింగులు పెట్టారు. 15 నుంచి 20 వేల లోపు మెజార్టీ వస్తుందని బెట్టింగులు పెట్టిన వారి సంఖ్య తక్కువైనా బెట్టింగ్‌లు పెట్టిన డబ్బులు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, ఆళ్ళగడ్డ, మాచర్ల, చిలకలూరిపేట, నర్సరావుపేట, అద్దంకి, మార్టూరు, మార్కాపురం, నంద్యాల వంటి ముఖ్య పట్టణాల్లో బాలినేని మెజార్టీపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలపై మంగళవారం ఒక్క రోజే రూ.6 కోట్లకు పందేలు సాగాయని అంచనా. భీమవరం కేంద్రంగా భారీ ఎత్తున పందేలు సాగుతున్నాయి. క్రికెట్ బుకీలు ఎన్నికల పందేల నిర్వహణకు కౌంటర్లు తెరవడంతో గంటగంటకు రకరకాల పందేలకు ఒప్పందాలు సాగాయి. గెలుపోటములపై అభ్యర్థులు, రాజకీయ పక్షాల కంటే పందేల రాయుళ్లే అమితాసక్తి కనబర్చడం కొసమెరుపు.

రాయలసీమలో 8 స్థానాలపై.. 

రాయలసీమలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేస్తుందని పందేలు కాస్తున్నారు. ఒక్కో స్థానానికి రూ.30 నుంచి రూ. 40 కోట్లు ఇప్పటికే పందేలు కాసినట్లు సమాచారం. వైఎస్‌ఆర్ జిల్లా రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలలో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులకు 45 వేల వరకు మెజార్టీ వస్తుందని భావిస్తున్నారు. పరకాలలో వైఎస్‌ఆర్ సీపీ గెలుపునకు అనుకూలంగా చర్చించుకుంటున్నారు. తిరుపతిలో భూమన కరుణాకర్‌రెడ్డి విజయం సాధిస్తారని కొందరు, కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణే గెలుస్తారని మరి కొందరు రూ.50 వేల నుంచి రూ.కోటి వరకు పెట్టినట్లు సమాచారం. తిరుపతి, చిత్తూరు, మదనపల్లితోపాటు, మారుమూల గ్రామాల్లో సైతం వ్యాపారులు, ఉద్యోగులు, రైతులు కూడా బెట్టింగ్‌లు పెట్టటం గమనార్హం. కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు రూ.25 కోట్ల వరకు బెట్టింగ్ జరిగినట్లు తెలుస్తోంది. 

జిల్లాలోని ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కె.చెన్నకేశవరెడ్డి, శోభా నాగిరెడ్డి మెజార్టీపైనే బెట్టింగ్‌లు కడుతున్నారు. చెన్నకేశవరెడ్డికి 15 వేల వరకు మెజార్టీ వస్తుందని కర్నూలు లో ఓ వ్యక్తి రూ.50 లక్షలు పందెం కాసినట్టు సమాచారం. శోభా నాగిరెడ్డి మెజారిటీ 20 వేలు మించుతుందని ఓ వ్యక్తి రూ. కోటి కట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. అనంతపురంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గురునాథరెడ్డి 12 వేల మెజార్టీతో గెలుపొందుతారని టీడీపీకి చెందిన ఒక ముఖ్య నాయకుడు రూ.4 కోట్లు బెట్ కాశాడు. 

టీడీపీ నాయకులు, కార్యకర్తలు గురునాథరెడ్డిపైన మొత్తం రూ.13 కోట్లు బెట్టింగ్ కాసినట్లు ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చెబుతున్నారు. రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి 15 వేల ఓట్లతో గెలుపొందుతారని పందేలు కాస్తున్నారు. ఇక్కడ రూ.8 కోట్ల వరకు పందేలు కాసినట్లు తెలుస్తోంది. అనంతపురం, రాయదుర్గంలో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పడిపోతుందనే అంశంపై కూడా భారీగా బెట్టింగ్‌లు సాగాయి. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా పందేలు కాసిన వారిలో ఉండడం గమనార్హం.
Share this article :

0 comments: