మొదటి గంటలో భారీగా ఓటింగ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మొదటి గంటలో భారీగా ఓటింగ్

మొదటి గంటలో భారీగా ఓటింగ్

Written By news on Tuesday, June 12, 2012 | 6/12/2012

ఉప ఎన్నికలు జరిగే 18 శాసనసభ నియోజకవర్గాల్లో ఈరోజు ఉదయం మొదటి గంటలోనే భారీగా ఓటింగ్ నమోదైంది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని చోట్ల చాలా ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అధికార పార్టీ నేతలు, తెలుగు దేశం నేతలు అక్కడక్కడ వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ నేతల మీద దాడులకు 

పాల్పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఒంగోలులో పలు బూత్‌లు దగ్గర స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు. పలుచోట్ల ఓటర్లకు కార్డు ఉన్నా పోలింగ్‌కు అనుమతించకపోవడంతో వారు ఆందోళనకు దిగుతున్నారు. కొన్నిచోట్ల ఉద్దేశపూర్వకంగానే ఓట్లను తొలగించారని ప్రజలంటున్నారు.

వైఎస్ఆర్‌ జిల్లా రాజంపేటలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండటం కన్నూరులో ఓటర్లను అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. మహిళా ఓటర్లు ఉప్పెనలా పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. వృద్ధులు కూడా కుటుంబ సభ్యుల సాయంతో ఓటింగ్‌కు తరలివస్తున్నారు. 

ఆళ్లగడ్డలోని బూత్‌ నెంబర్‌ 120లో ఇద్దరు ఏజెంట్లు కొట్టుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌ ఏజెంట్‌ను అధికార పార్టీ నేతలు కిడ్నాప్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Share this article :

0 comments: