జగన్ అరెస్ట్ అక్రమం: రాంజెఠ్మలానీ వాదన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ అరెస్ట్ అక్రమం: రాంజెఠ్మలానీ వాదన

జగన్ అరెస్ట్ అక్రమం: రాంజెఠ్మలానీ వాదన

Written By news on Wednesday, June 27, 2012 | 6/27/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అరెస్ట్ అక్రమమని సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ హైకోర్టులో తన వాదన వినిపించారు. వారం రోజుల క్రితం జగన్ తరపున దాఖలైన బెయిల్ పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. జగన్ తరపున రాంజెఠ్మలానీ వాదిస్తున్నారు. 'సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో జగన్ పై చాలా అభియోగాలు మోపింది. సిబీఐ మూడు ఛార్జిషీట్లను దాఖలు చేసింది. ఎన్నికల్లో ప్రచారం చేసే జగన్ హక్కును హరిస్తూ అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్ధం. సీఆర్‌పీసీ సెక్షన్ 41 కింద జగన్ ను అరెస్ట్ చేయడం తగదు. విచారణకు సహకరించనప్పుడు, సాక్ష్యాలను తారుమారు చేస్తారనుకున్నప్పుడు, విచారణకు అందుబాటులో లేకుండా పారిపోయినప్పుడు మాత్రమే అరెస్ట్ చేయాలి. విచారణకు జగన్ పూర్తిగా సహకరించారు.' అని జగన్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. భోజన విరామ అనంతరం హైకోర్టులో వాదనలు కొనసాగుతాయి.
Share this article :

0 comments: