ఊపందుకుంటున్న ఓటింగ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఊపందుకుంటున్న ఓటింగ్

ఊపందుకుంటున్న ఓటింగ్

Written By news on Tuesday, June 12, 2012 | 6/12/2012

ఉప ఎన్నికలు జరిగే ఉప ఎన్నికలలో గంటగంటకు ఓటింగ్ ఊపందుకుంటోంది. పలుచోట్ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలపై టిడిపి, కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడులు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని సీతారాంపురంలో సాక్షి టివి విలేకరి లైవ్‌ను కాంగ్రెస్‌ నేతలు అడ్డుకున్నారు. లైవ్‌లో ఉన్నామని చెప్తున్నప్పటికీ వారు వినలేదు. కెమెరాకు చేతులు అడ్డుపెట్టి ప్రత్యక్షప్రసారానికి అంతరాయం కలిగించారు. 

అనంతపురంలో మంత్రి రఘువీరారెడ్డి ఒత్తిడితో అధికారులు ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి మండలంలో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలపై టిడిపి వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్ఆర్‌ జిల్లాలో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ నేత దేవనాథరెడ్డిపై కాంగ్రెస్‌ వర్గీయులు దాడి చేశారు. నెల్లూరు లోక్‌సభ పరిధిలోని రెండు గ్రామాలు పోలింగ్‌ను బహిష్కరించినట్లు ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్‌ లాల్‌ తెలిపారు. విశాఖ జిల్లా మసాయిపేటలో 80 ఓట్లు గల్లంతు కావడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మొత్తం 5 వేల 413 కేంద్రాల్లో 16 చోట్ల మాత్రమే ఈవీఎంలను మార్చినట్లు భన్వర్‌లాల్‌ తెలిపారు.

ఓటు వేయడానికి పరకాల ప్రజలు ఉత్సాహంగా వస్తున్నారని కొండా సురేఖ తెలిపారు. ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు బాగా చేసిందని ఆమె అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో ధర్మాన కృష్ణదాస్‌ ముందే ఓటేయ్యలేదని భన్వర్‌ లాల్‌ చెప్పారు. మాచర్ల నియోజకవర్గంలోని జమ్మలమడకలో డబ్బులు పంచుతున్న కాంగ్రెస్‌ నేతలను వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు నిలదీశారు. టిడిపి నేతల తీరును కూడా మాచర్ల ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ నేత భూమా నాగిరెడ్డిపై పోలీసులు ఆంక్షలు విధించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ గుండెపోటుతో మృతి చెందారు.

కొన్ని చెదరుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ చెప్పారు. కొన్నిచోట్ల పోలింగ్‌ మందకొడిగా ప్రారంభమైనా ఆ తరువాత ఊపందుకుందని చెప్పారు.
Share this article :

0 comments: