‘రక్షణ స్టీల్స్’ అనిల్‌ను నేను కాదని చెప్పినా తప్పుడు ప్రచారమా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘రక్షణ స్టీల్స్’ అనిల్‌ను నేను కాదని చెప్పినా తప్పుడు ప్రచారమా?

‘రక్షణ స్టీల్స్’ అనిల్‌ను నేను కాదని చెప్పినా తప్పుడు ప్రచారమా?

Written By news on Tuesday, June 12, 2012 | 6/12/2012

* ‘రక్షణ స్టీల్స్’ అనిల్‌ను నేను కాదని చెప్పినా తప్పుడు ప్రచారమా? 
* నాకు సంబంధం లేదని గతంలో ఆ సంస్థే పత్రికాముఖంగా ప్రకటించింది 
* పోలింగ్‌కు ముందు ఉద్దేశపూర్వకంగా నాపై దుష్ర్పచారం 

హైదరాబాద్, న్యూస్‌లైన్: తన మీద పనిగట్టుకుని దుష్ర్పచారానికి దిగిన తెలుగుదేశం పార్టీ, కొన్ని టీవీ చానళ్లపై పరువు నష్టం దావా వేయటంతో పాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నానని అనిల్ వరల్డ్ ఎవాంజలిజం (ఏడబ్ల్యూఈ) వ్యవస్థాపకుడు అనిల్‌కుమార్ వెల్లడించారు. 2010 జూలైలోనే రక్షణ స్టీల్స్ యాజమాన్యంలో ఉన్న అనిల్‌కుమార్ వేరు, తాను వేరని పత్రికా ముఖంగా తెలియజేశాననీ.. అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ర్పచారం చేశారని ఆయన సోమవారం సాయంత్రం జారీ చేసిన ఒక ప్రకటనలో తప్పుపట్టారు. 

‘‘రక్షణ స్టీల్స్ సంస్థకు - ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కూ మధ్య జరిగిన ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకున్న వార్తను సోమవారం టీవీ చానళ్ల ద్వారా చూశాను. ఇదే సందర్భంగా రక్షణ స్టీల్స్ నాకు చెందిన సంస్థ అంటూ టీడీపీతో పాటు కొన్ని టీవీ చానళ్లు ప్రచారం చేయటం చూసి ఈ పత్రికా ప్రకటన చేస్తున్నాను. రక్షణ స్టీల్స్ నాకు బినామీ సంస్థ అంటూ గతంలో వార్తలు, కథనాలు వెలువడినప్పుడు వీటిని ఆ సంస్థ యాజమాన్యం ఖండిస్తూ పత్రి కా ముఖంగా ప్రకటించింది. 2010 జూలైలో రక్షణ స్టీల్స్ యాజమాన్యంలో ఉన్న అనిల్‌కుమార్ వేరు అన్న విషయాన్ని పత్రికా ముఖంగా నేనూ తెలియజేయటం జరిగింది. అయినా సరే ఈ రోజున కొన్ని చానళ్లు, టీడీపీ పనిగట్టుకుని నా మీద వ్యక్తిగత దుష్ర్పచారానికి దిగాయి. 

కాబట్టి టీడీపీ మీద, నిజాలు తెలుసుకోకుండా నా మీద బురద చల్లే ప్రయత్నం చేసిన చానళ్ల మీద పరువు నష్టం దావా వేయటం తో పాటు ఇతర న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నాను. రేపు (మంగళవారం) ఉప ఎన్నికలు జరుగనున్నాయనగా ఈ రోజున (సోమవారం) నాది కాని సంస్థ నాదేనని బుకాయించి టీడీపీ, దాని అనుకూల చానళ్లు ఆడుతున్న రాజకీయ నాట కాన్ని చూసి.. మా కుటుంబాన్ని నిందిస్తే ఓట్లు పడతాయని ఆ పార్టీ నడుపుతున్న రాజకీయాన్ని చూసి జాలి పడుతున్నాను’’ అని అనిల్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Share this article :

0 comments: