'ఫలితాల తర్వాత కాంగ్రెస్, టీడీపీలకు గడ్డుకాలం' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'ఫలితాల తర్వాత కాంగ్రెస్, టీడీపీలకు గడ్డుకాలం'

'ఫలితాల తర్వాత కాంగ్రెస్, టీడీపీలకు గడ్డుకాలం'

Written By news on Wednesday, June 13, 2012 | 6/13/2012

 జగన్‌పై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కక్షగట్టాయని ప్రజలు భావిస్తున్నారని ఎంపీ సబ్బంహరి అన్నారు. వైఎస్‌ఆర్ సీపీ ఓటమికి కాంగ్రెస్, టీడీపీలు కలిసి పనిచేశాయని సబ్బం ఆరోపించారు. అన్నిస్థానాల్లోనూ వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని సబ్బం స్పష్టం చేశారు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్, టీడీపీకి గడ్డుకాలమేనని సబ్బం జోస్యం చెప్పారు. 

రాజ్యాంగసంస్థల పనితీరుకు ఈ ఎన్నికల ఫలితాలు రెఫరెండమని.. ఈ ఫలితాల తర్వాత వచ్చే పరిణామాలను ఎదుర్కోలేక జగన్‌ను జైల్లో పెట్టారని ఆయన అన్నారు. రాష్ట్రం సంక్షోభంలో పడితే టీడీపీ ఆదుకునే అవకాశముందన్నారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీలు పరస్పరం బలహీనంగా ఉన్న చోట్ల ఒకరికొకరు సహకారం అందించుకున్నారు. 

నరసన్నపేటలో కాంగ్రెస్ కు ఓటేయమని టీడీపీ నేతలు ప్రచారం చేశారని ఆయన తెలిపారు. పాయకరావుపేటలో టీడీపీకి ఓటేయాలని కాంగ్రెస్ ప్రచారం చేసిన విషయాన్ని దృష్టికి తీసుకువచ్చారు. ఈ రెండు పార్టీలు మ్యాచ్‌ ఫిక్సింగ్ వల్ల వాళ్ల ఉనికే ప్రమాదంలో పడిందన్నారు. నెల్లూరులో పార్లమెంట్ స్థానంలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి లక్షా 50వేల మెజార్టీ పైగానే గెలుస్తారని ఆయన అన్నారు. 
Share this article :

0 comments: