బయటపడే కొద్దీ పెరుగుతున్న కుతంత్రాలుజగన్ నిర్బంధం ఎవరిని సంతోషపెట్టేందుకు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బయటపడే కొద్దీ పెరుగుతున్న కుతంత్రాలుజగన్ నిర్బంధం ఎవరిని సంతోషపెట్టేందుకు?

బయటపడే కొద్దీ పెరుగుతున్న కుతంత్రాలుజగన్ నిర్బంధం ఎవరిని సంతోషపెట్టేందుకు?

Written By news on Wednesday, June 27, 2012 | 6/27/2012

*బయటపడే కొద్దీ పెరుగుతున్న కుతంత్రాలుజగన్ నిర్బంధం ఎవరిని సంతోషపెట్టేందుకు?
*9 నెలల పాటు విచారణకే పిలవని సీబీఐదర్యాప్తు కూడా పూర్తవకుండానే చార్జిషీట్లు
*కోర్టు సమన్లు జారీ చేశాకే విచారణచార్జిషీటు దాఖలు తర్వాత అరెస్టు
*9నెలల తర్వాత సాక్షులను జగన్ ప్రభావితం చేస్తారా?ఇన్ని చార్జిషీట్లు ఏ కేసులోనైనా చూశామా?
*ఇది విచారణను జాప్యం చేయాలన్న కుట్ర కాదా?క్విడ్ ప్రో కోను గాలికొదిలి.. పక్కదారి పట్టిన దర్యాప్తు
*లీజులు, అనుమతులు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయా?పరిశ్రమలకు రాయితీలు కొత్త విషయమా?
*పెట్టుబడులపై దుష్ర్పచారమే తప్ప నిరూపించిందేమిటి?జగన్‌ను అరెస్టు చేసి నేటికి నెల రోజులు

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కేసు విచారణ తలా తోకా లేకుండా.. దర్యాప్తు సంస్థలు, వాటిని ఆడించే రాజకీయ పార్టీలకు నచ్చిన రీతిలో సాగుతున్న వైనం న్యాయ నిపుణులనే విస్మయపరుస్తోంది. కాంగ్రెస్, టీడీపీలు, వాటికి వంతపాడే ఎల్లో మీడియాకు దర్యాప్తు సంస్థ తోడైందని, అందుకే దర్యాప్తు ఇలా అపసవ్య దిశలో సాగుతోందని ఈ కేసును దగ్గరగా పరిశీలిస్తున్న సీనియర్ న్యాయవాదులంటున్నారు. నిబంధనలతో నిమిత్తం లేకుండా, న్యాయాన్యాయాల ప్రసక్తే లేకుండా, ఆద్యంతం దూకుడుగా వ్యవహరిస్తూ కూడా సీబీఐ ఇప్పటివరకూ ఈ కేసులో తేల్చిందేమీ లేదు. 

ఉప ఎన్నికల ముందు ప్రచారానికి వెళ్లకుండా జగన్‌ను అరెస్టు చేయడం, దర్యాప్తు పూర్తి చేయకుండా ముక్కలు ముక్కలుగా చార్జిషీట్ల దాఖలుతో కేసును సాగదీయడం, కోర్టు చెప్పిన క్విడ్ ప్రో కో కోణాన్ని గాలికొదిలేసి కేసును పక్కదారి పట్టించడం, సాక్షులను వేధిస్తూ వారితో తమకనుకూలంగా సాక్ష్యం చెప్పించేందుకు ప్రయత్నించడం... ఈ కేసు సరైన దిశలో సాగడం లేదనేందుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. పనిలో పనిగా ‘సాక్షి’పైనా దాడులకు పూనుకోవడం ద్వారా సీబీఐ తన అక్కసునంతా తీర్చుకుంది. సాక్షి ఖాతాలు స్తంభింపజేయడం, ప్రకటనలు నిలిపేస్తూ జీవో ఇవ్వడం వంటివన్నీ ఇందులో భాగమే. ఎల్లో మీడియాతో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కుమ్మక్కై, ఎంపిక చేసుకున్న కొన్ని పత్రికలకు, చానళ్లకు దర్యాప్తుకు సంబంధించి లీకులిస్తున్నారనే కుట్రను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బట్టబయలు చేశారు. దాంతో.. దాన్ని సాకుగా చేసుకుని ‘సాక్షి’ రిపోర్టర్‌పైనా కేసులు పెట్టేందుకు జేడీ తెగించారు. లీకులివ్వడం వెనక ఏ కుట్ర దాగుందో విచారణ జరిపి నిజానిజాలు తేల్చకుండా, సమస్యను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించడంలోనే పెద్ద కుట్ర దాగుంది..! జగన్‌ను అరెస్టు చేసి బుధవారానికి సరిగ్గా నెల రోజులు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు సాగుతున్న తీరును ఓ మారు పరిశీలిస్తే..

9 నెలల పాటు విచారించలేదేం?: కేసు నమోదు చేసిన 9 నెలలవరకూ జగన్‌ను విచారించాలని సీబీఐకి ఎందుకు అని పించలేదు? ఆయనేమైనా దర్యాప్తు సంస్థలకు దూరంగానో, విదేశాల్లోనో లేరే! నిత్యం ప్రజల మధ్యే ఉన్నారే! ఒక లోక్‌సభ, 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన తరుణంలో, ముమ్మరంగా ప్రచారంలో ఉన్న సమయంలోనే జగన్‌ను ఎం దుకు విచారణకు పిలిచారో వేరే చెప్పనక్కరలేదు. విచారణ సాకుతో ఆయనను జనం మధ్య లేకుండా చేసే కుట్రతోనే ఆ హడావుడి ప్రహసనాన్ని నడిపించారు. 

అది కూడా.. వ్యక్తిగతం గా గానీ, ప్లీడరు ద్వారా గానీ తన ముందు హాజరవాలంటూ జగన్‌కు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేశాకే దర్యాప్తు సంస్థకు విచారణ విషయం గుర్తుకొచ్చింది! కోర్టుకు హాజరవాల్సిన తేదీకి సరిగ్గా మూడు రోజులు ముందుగా విచారణకు పిలవ డం వెనక దురుద్దేశం లేదంటే ఎవరైనా నమ్ముతారా? ఎన్నికల ప్రచారంలో ఉన్నందున అది పూర్తయ్యేదాకా తనకు వెసులుబాటు కల్పించాలంటూ జగన్ కోర్టును ఆశ్రయించగా, ‘చార్జిషీటు దాఖలు చేశారు గనుక ఇప్పుడేమీ మిమ్మల్ని అరెస్టు చేసే అవకాశం లేదు కదా! అపోహలు పెట్టుకోవద్దు’ అని సాక్షాత్తూ కోర్టే పేర్కొనడం అందరికీ తెలిసిందే. అయినా సరే.. కోర్టు మాటలను కూడా బేఖాతరు చేసి మరీ, ఇంకొన్ని గంటల్లో కోర్టుకు హాజరు కావాల్సిన జగన్‌ను సీబీఐ అత్యంత హడావుడిగా అరెస్టు చేయడం వెనక ఉన్నది అదృశ్య శక్తుల రాజకీయ స్వార్థమే కాదా? దాని నిండా దాగున్నది.. ఎలాగైనా జగన్‌ను ఎన్నికల ప్రచారంలో పాల్గొననీయొద్దన్న దుగ్ధ, కుట్ర కాదా?

సాక్షులను ప్రభావితం చేస్తారనడం సాకే కాదా?: జగన్ ఒక ఎంపీ కనుక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కనుక తన హోదాలతో సాక్షులను ప్రభావితం చేసే ఆస్కారముం దన్న సాకుతో అరెస్టు చేశారు. మరి సీబీఐ దర్యాప్తు మొదలు పెట్టాక 9 నెలల పాటు ఆయన ఆ పదవుల్లో లేరా? భవిష్యత్తులోనూ ఆ పదవుల్లో ఉంటారన్నది నిజం కాదా? అంటే.. ఎంపీ, పార్టీ అధ్యక్షుడు అన్న కారణంతో జగన్‌ను ఇష్టం వచ్చినప్పుడు అరెస్టు చేసే స్వేచ్ఛ ఉంటుందా? ఇలా అప్రజాస్వామికంగా జైల్లో నిర్బంధించడం ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తేవడం లేదూ? సాక్షులను ప్రభావితం చేస్తారన్నది సాకు మాత్రమే. తొమ్మిది నెలల్లో జగన్ అలాంటి ప్రయత్నం చేసినట్టు ఒక్క ఆధారమూ లేదు. ఆయన నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ వచ్చారు. ఇలా సాక్షులను ప్రభావితం చేస్తారన్న సాకుతో జగన్‌ను సీబీఐ ఎంతకాలం నిర్బంధించాలనుకుంటుందో? ఆయన పదవుల్లో ఉన్నంతవరకూ జైల్లోనే ఉంచదలచారా? సాక్షులను ప్రభావితం చేస్తారన్నది కేవలం సాకు మాత్రమేనన్న న్యాయ నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలు సీబీఐకి విన్పించడం లేదా?

దర్యాప్తు పూర్తవకుండా చార్జిషీట్లా?: సీబీఐ దర్యాప్తు, కోర్టులో అది వాదిస్తున్న తీరు తదితరాలను పరిశీలిస్తే.. అంతా ఒక పథకం ప్రకారమే జరుగుతోందన్న అనుమానం బలపడటం లేదా? దర్యాప్తు పూర్తవకుండానే చార్జిషీట్లు, అదీ ఒకే ఎఫ్‌ఐఆర్‌పై విడతలు విడతలుగా వేయడం జగన్ కేసులో మాత్రమే జరుగుతుండటం నిజం కాదా? దర్యాప్తు అధికారి ఫోన్ సంభాషణల తీరుతెన్నులు, విచారణ వివరాలను ఎంపిక చేసుకున్న కొన్ని పత్రికలకు, చానళ్లకు ఆయన లీక్ చేయడం వంటివన్నీ దేనికి సూచికలు? ఏ కేసులోనైనా దర్యాప్తు న్యాయపరంగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలి. 

అలా జరుగుతున్నట్టుగా కన్పించాలి కూడా. పైగా ఆధారాలను బట్టే అది కొనసాగాలి. ఇతర కేసులు, నిందితుల తరహాలోనే జగన్ కేసులోనూ దర్యాప్తు జరగాలి. కానీ సీబీఐ దర్యాప్తు అలా సాగడం లేదని హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్.రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. ముక్కలు ముక్కలుగా చార్జిషీట్లు దాఖలు చేయడానికి వీల్లేదని, ఇందుకు సంబంధించి పలు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని సీనియర్ న్యాయవాదులంటున్నారు. ఎఫ్‌ఐఆర్‌లో లేని అంశాలు వెలుగులోకి వచ్చినపుడు సీబీఐ దర్యాప్తును కొనసాగించవచ్చు. కానీ ఈ కేసులో సీబీఐ అధికారులు అసలు ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలకు సంబంధించే ఇంకా దర్యాప్తు పూర్తి చేయలేదు. మరి అలాంటప్పుడు చార్జిషీట్లెలా దాఖలు చేస్తున్నారో ఎవరికీ అర్థం కాని విషయం.

పక్కదారి పట్టిన దర్యాప్తు..: జగన్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే వేసిన పిటిషన్‌లో టీడీపీ నాయకులు ఇంప్లీడ్ కావడం కుమ్మక్కు కోణాన్ని ఆవిష్కరించడం లేదా? జగన్ కాంగ్రెస్‌ను వీడి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాకే ఆయనపై వేధింపుల పర్వం ప్రారంభమైన విషయం ఎవరికి తెలియనిది? అవలా ఉంచితే, హైకోర్టు ఆదేశాల మేరకు ప్రారంభమైన సీబీఐ దర్యాప్తు.. అసలు విషయాన్ని వదిలేసి కేసును ఎందుకు సాగదీస్తున్నట్టు? దివంగత రాజశేఖరరెడ్డి ప్రభుత్వం జారీ చేసిన 26 జీవోల ఫలితంగానే ప్రజాధనం లూటీ జరిగిందని, తద్వారా లబ్ధి పొందిన వారు ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టారని పిటిషన్‌లో ఆరోపించారు. ఇదంతా ‘క్విడ్ ప్రో కో’ (ఫలానికి ప్రతిఫలం) అని పేర్కొన్నారు. కోర్టు కూడా ఈ క్విడ్ ప్రోకో కోణాన్ని దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. మరి ఆ క్విడ్ ప్రో కో కోణంలో దర్యాప్తును ఎందుకు వదిలేశారు? క్విడ్ ప్రో కో ను తేల్చాలంటే ముందుగా తేల్చాల్సింది నాటి కేబినెట్ ఆమోదించిన 26 జీవోల సంగతి కదా! కానీ సీబీఐ ఆ విషయాన్ని వదిలేసిందేం? కేసుకు మూలమైన జీవోలను వదిలేయడం దర్యాప్తు సక్రమంగా సాగడం లేదనేందుకు నిదర్శనం కాదా? జీవోల జోలికెళ్లకుండా, జగన్ చుట్టూ మాత్రమే ఉచ్చు బిగించాలన్నదే సీబీఐ యోచనగా కన్పించడం లేదా? హైకోర్టు ఆదేశాల్లో ఉన్న ‘ప్రభుత్వం’ అనే పదాన్ని తొలగించి, ఆ స్థానంలో ‘వైఎస్’ అనే పదాన్ని సీబీఐ చేర్చడం కుట్రను మొదట్లోనే బయట పెట్టలేదా? ప్రభుత్వం వైపు నుంచి దర్యాప్తు జరపకుండా.. జగనే తన తండ్రి వైఎస్‌ను ప్రభావితం చేసి ఇదంతా చేయించారనే వాదనను సీబీఐ తీసుకొచ్చింది. 

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు నాటి ప్రభుత్వంలోని 45 మంది మంత్రుల భాధ్యతా ఉంటుందని ఏ పిల్లాడినడిగినా చెబుతాడు. ప్రభుత్వ నిర్ణయాలకు మంత్రిమండలి సమష్టిగా బాధ్యత వహిస్తుందని హైస్కూలు పాఠాల్లో కూడా చదువుకున్నాం. ఒక్కసారైనా సచివాలయం, లేదా కనీసం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలోకి అడుగుపెట్టారని గానీ, తమను ప్రభావితం చేశాడని గానీ ఏ మంత్రీ లేదా ఐఏఎస్ అధికారీ చెప్పలేదు. అలాంటప్పుడు మంత్రివర్గాన్ని జగన్ ప్రభావితం చేశారని ఎలా చెప్పగలరు?

క్విడ్ ప్రో కో వాదనలో పసేదీ?:ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న ఫ్యాక్టరీకి మంచినీటి సరఫరా మంజూరు వంటివి అతి మామూలు విధాన నిర్ణయాలు కాదా? పరిశ్రమలకు భూములు లీజుకివ్వడం, వాటికి రాయితీలివ్వడం వైఎస్ ప్రభుత్వమే కొత్తగా ప్రారంభించిన విధానమా? ఆయనకు ముందు ఎన్నో ఏళ్లుగా రాష్ర్టంలో కొనసాగుతున్నదే కదా! గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పరిశ్రమలకు ఇంకా ఎక్కువ రాయితీలిస్తున్నారు కదా! అంతేకాదు, భూములు తక్కువ ధరకు కాదు.. ఏకంగాా ఉచితంగా కూడా ఇస్తున్న ఉదంతాలకూ కొదవ లేదు. 

అదేమీ కొత్తగా మన రాష్ర్టంలోనే పుట్టుకొచ్చిన విధానమూ కాదు. సాక్షిలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్న పెట్టుబడిదారులకు ఈ పత్రిక ప్రారంభం కాకముందే అన్ని విషయాలూ తెలుసు. సాక్షికి పోటీగా ఉన్న ఈనాడు దినపత్రిక అంచనా విలువ రు.6,800 కోట్లు. అది రూ.1,800 కోట్ల నష్టాల్లో ఉన్న సమయంలోనే రూ.100 ముఖ విలువ ఉన్న తన షేరును ఒక్కోటీ ఏకంగా రూ.5,28,000 చొప్పున అమ్మిన విషయం సాక్షిలో పెట్టుబడిపెట్టిన వారందరికీ ఏడు నెలల ముందే తెలుసు. ఈనాడుకు పోటీగా, దాని కన్నా అన్నివిధాలా మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, అన్నీ రంగుల పేజీలతో, మంచి ప్రొఫెషనల్స్‌తో ప్రారంభమయిన సాక్షిలో భాగం పొందడం లాభసాటని వారు భావించారు. రూ.10 ముఖ విలువ ఉన్న సాక్షి షేరు రూ.350కే లభించింది. ఇది ఈనాడు షేరు రూ.5,28,000 కన్నా ఎన్నో వేల రెట్లు తక్కువ. ఈ విషయాన్ని వదిలేసిన సీబీఐ, కోడిగుడ్డుపై ఈకలు పీకడానికి ఎందుకు ప్రయత్నిస్తోందో వేరే చెప్పాలా? అదీగాక, అసలు సాక్షి వాటాలకు ఎలాంటి విలువా లేదని సీబీఐ ఒకవైపు వాదిస్తోంది. మరోవైపేమో వాటివల్ల జగన్ అపార లబ్ధి పొందారంటోంది. ఇది పరస్పర విరుద్ధంగా కాదా?

2ఐ, ప్లూరీలపై ఆరోపణల్లో నిజమెంత?:2ఐ క్యాపిటల్, ప్లూరీ ఎమర్జింగ్ కంపెనీల ద్వారా మారిషస్, తదితర దేశాల నుంచి పెట్టుబడులను జగన్ తరలించారనేది సీబీఐ మరో ఆరోపణ. ఈ కంపెనీలు ఆర్‌బీఐ ఆమోదమున్నవి. వాటికి సెబీ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఉంది. 

ఇవే కంపెనీలు ఐడియా సెల్యులార్, గాయత్రీ ప్రాజెక్ట్స్ వంటి పెద్ద కంపెనీలలోనూ పెట్టుబడులు పెట్టాయి. సెబీ గుర్తించిన 144 విదేశీ వెంచర్ క్యాపిటల్ కంపెనీల్లో తొలి పేరు 2ఐదే. 2ఐ, ప్లూరిల ద్వారా సండూర్ పవర్‌లోకి వచ్చిన మొత్తం రూ.124 కోట్లు. ఆ రెండు కంపెనీలకూ తాను కేటాయించిన షేర్లను ఆ తర్వాత జగన్ ఎక్కువ ధర చెల్లించి తిరిగి కొనుగోలు చేశారు. తద్వారా ఆయా సంస్థలు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్లకు లాభం రావడంతో అవి తమ షేర్లను జగన్‌కు విక్రయించి ఎగ్జిట్ అయ్యాయి. సీబీఐ చెబుతున్నట్టుగా ఆ సంస్థల ద్వారా వచ్చిన డబ్బు జగన్‌దే అయి ఉంటే, ఆ షేర్లను తిరిగి కొనుగోలు చేయాల్సిన అవసరమేముంది? అందుకోసం తనకు వచ్చిన ఇన్వెస్ట్‌మెంట్ కన్నా ఎక్కువ మొత్తాన్ని వెచ్చించాల్సిన అవసరమేముంటుం ది? ఈ మాత్రం కనీస పరిజ్ఞానమూ సీబీఐకి లేదనుకోవాలా?

అసలీ కేసు నిలబడుతుందా?: ఆదాయానికి మిం చి ఆస్తుల కేసును ప్రభుత్వ పదవులు అనుభవించిన వారిపై మాత్రమే పెట్టాలని, పబ్లిక్ సర్వెంట్స్ కాని వారికి ఈ కేసు వర్తించదని న్యాయ నిపుణులంటున్నారు. నేరం జరిగిందని చెప్పిన సమయంలో జగన్ ఏ ప్రభుత్వ పదవిలోనూ లేరు. కనుక ఈ కేసే చెల్లదన్నది వారి వాదన. ‘‘ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల మీద జగన్‌పై సీబీఐ నమోదు చేసిన సెక్షన్ 13(ఇ) కేసు చట్టప్రకారం చెల్లదు. ఎంపీలను పబ్లిక్ సర్వెంట్లుగా భావించినా, 7, 9, 13 సెక్షన్లు వారికి వర్తించవు. ఈ విషయాన్ని స్వయంగా సుప్రీంకోర్టే స్పష్టం చేసింది’’ అని సీనియర్ న్యాయవాది ఎస్.రామచంద్రరావు పేర్కొన్నారు. అయినా ఈ కేసులో సీబీఐ గుడ్డిగా ముందుకే పోతుండటం వెనక ఎలాంటి ఒత్తిళ్లు పని చేస్తున్నాయో వేరే చెప్పనక్కరలేదు.
Share this article :

0 comments: