బాబుకు చేదు అనుభవం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబుకు చేదు అనుభవం

బాబుకు చేదు అనుభవం

Written By news on Monday, June 11, 2012 | 6/11/2012


బాబు చివరిరోజు ఉపఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. మిట్టమధ్యాహ్నం నడిరోడ్డు మీద వెంకటాపురం గ్రామస్తులు నిలదీయడంతో ఆయన హతాశులయ్యారు. ఎర్రగుంట్ల రోడ్‌షో ముగించుకుని శిరివెళ్ల వస్తున్న బాబును మధ్యలో వెంకటాపురం గ్రామస్తులు నడిరోడ్డుపైనే కాన్వాయ్‌కి అడ్డుపడి బాబును నిలిపివేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఉచిత విద్యుత్ ఇవ్వలేదని, ఇప్పుడే మీకు విద్యుత్ గుర్తొచ్చిందా అని నిలదీశారు. 

అంతకుముందే ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు ఇస్తానని హామీ ఇచ్చినా మహిళలు నిలదీసిన వైనం ఆయనకు మింగుడు పడలేదు. దీంతో తాను చేసిన తప్పు చచ్చినట్టు ఒప్పుకోవాల్సి వచ్చింది. అవునమ్మా.. అప్పుడు నేను ఉచిత విద్యుత్ ఇవ్వకుండా తప్పు చేశాను. ఇప్పుడు బాధపడుతున్నాను అన్నారు. రోడ్లు, తాగునీటిపై కూడా వెంకటాపురం గ్రామస్తులు ప్రశ్నలవర్షం సంధించారు. మీ ఆవేదన నాకు అర్థమైంది, పాత తప్పులను ఇప్పు డు పునరావృతం కానివ్వను అంటూ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
Share this article :

0 comments: