మాట తప్పని, మడమ తిప్పని వారసత్వంతో - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మాట తప్పని, మడమ తిప్పని వారసత్వంతో

మాట తప్పని, మడమ తిప్పని వారసత్వంతో

Written By news on Tuesday, June 12, 2012 | 6/12/2012

‘‘జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే కేంద్రంలో మంత్రిదపవి, ఆ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి పొందే అవకాశం ఉండేది’’ అని పిల్లిని సంచిలోంచి బయటపడేశారు. అదీ అసలు సంగతి! తన తండ్రి సమాధి వద్ద చేసిన బాస మేర మాట తప్పని, మడమ తిప్పని వారసత్వంతో తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారిని ఆదుకునేందుకు ఓదార్పుయాత్ర చేపట్టడమే ఆయన చేసిన తప్పని, విశ్వాసఘాతుక కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం సాధ్యం కాదని వేరే పార్టీ స్థాపించడమే జగన్ చేసిన నేరమని ఆజాద్ చెప్పకనే చెప్పారనే కదా దీని భావం! 

ఉప ఎన్నికలను నీతికి-అవినీతికి మధ్య పోరాటంగా, కాంగ్రెస్, టీడీపీలు, వారి అంతేవా సులు ప్రజలను నమ్మించేందుకు నానాతం టాలు పడుతున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అవినీ తికి నిలువెత్తు రూపం అయినట్లు తాము ఆయకు వ్యతిరేకంగా సచ్ఛీలురుగా పోరాడుతు న్నట్లు మొత్తం ప్రచారాన్ని ఆ దిశగా మళ్లింప జూస్తున్నారు. కానీ వారెంత మరుగుపర్చాలని చూసినా ఈ పోరాటం కుతంత్ర రాజకీయాలకు, వెల్లువెత్తుతున్న ప్రజాభిమానానికి మధ్య జరుగుతున్న యుద్ధం అన్నది సర్వత్రా స్థిరపడిపోయింది. 

అధికార పక్షం - ప్రధాన ప్రతిపక్షం రెండూ కలిసి కుట్రలకు, కుతంత్రాలకు పాల్పడుతూ ఒకే రూపుదాల్చి ఒకవైపు నిలిస్తే - ప్రజాభిమానమే అండగా రంగంలో నిలచిన జగన్‌మోహన్‌రెడ్డి ఏకైక ప్రత్యర్థిగా మరోవైపు మోహరించిన వైనం ఈ క్షణాన ఎన్నికల కురు క్షేత్రంలో బహిర్గతమవుతున్నది. ప్రజలు తమ శక్తిసామర్థ్యాలను గ్రహించి, ఓటు బలంతో విజయం సాధిస్తే - అదే ప్రజలు ఆత్మవిశ్వాసంతో ముంద డుగు వేస్తారు. 

ఇది చరిత్ర చెప్పిన సత్యం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో స్వాతంత్య్రోద్యమంలో రాటుదేలిన దేశభక్తులు, మేధావులు కలిసి ‘‘భారతదేశ ప్రజలమైన మేము మాకుగా మేమే ఈ రాజ్యాంగాన్ని ప్రసాదించుకున్నామని’’ ఆరంభంలోనే రాజ్యాంగంలో స్పష్టం చేశారు. అంతిమంగా నిర్ణయాత్మకశక్తి జనశక్తి మాత్రమే! ప్రజలే తీర్పరులు. న్యాయనిర్ణేతలు!

ఉప ఎన్నికల ఫలితాల పర్యవసానాలు కేవలం 18 శాసనసభ, ఒక లోక్‌సభ స్థానాలకే పరిమితంకావనీ, రాష్ట్ర ప్రభుత్వం మనుగడపై తక్షణం, కొంత ఆలస్యంగా కేంద్ర ప్రభుత్వంపై ప్రభావం చూపుతాయన్నది జగద్వి దితం! ‘‘ఈ ఉప ఎన్నికలలో ఓడిపోయినా, రాష్ట్రంలో, కేంద్రంలో సర్కారుకు వచ్చిన ముప్పేమీ లేదు. 

నిజానికి ఈ ఎన్నికలు కాంగ్రెస్ పాలనపై ప్రజాతీర్పు (రిఫరెండం) కాదు’’ అంటూ ఢిల్లీ కాంగ్రెస్ నేత ఆజాద్ వంటి వారు ఎంతగా చెప్పి నా, ఆయనతోపాటు మరో ఢిల్లీ నేత వయలార్ రవి ఎన్నికల ప్రచారానికి రాక తప్పని పరిస్థితి ఏర్పడడమే వాస్తవస్థితికి అద్దం పడుతున్నది. ఆజాద్ మాట స్వవచన విఘాతమేనని తేలిపోతున్నది. 

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స, కొత్తగా తీర్థం పుచ్చుకున్న చిరంజీవి, ఇతర కాంగ్రెస్ నేతలు ఎన్నికలను సమర్థంగా ఎదుర్కో లేకపోతున్నారనే కదా... ఢిల్లీవాలాలిరువురూ ఇక్కడ ప్రత్యక్షమయింది! కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబుల మధ్య నెలకొన్న అవినాభావ సంబంధం జగన్ మాటను నిజం చేస్తున్నది. 

ఒక్కొక్కరూ పది ఓట్లు కాంగ్రెస్‌కు వేయాలని (కాంగ్రెస్ ఎన్నికల తంతులో దొంగ ఓట్లు గుద్దుకోవడం అరుదేమీ కాదు గనుక) అలవాటులో పొరపాటున ఓ బహిరంగ సభలో పిలుపునిచ్చి కిరణ్‌కుమార్‌రెడ్డి అభాసుపాలయ్యారు. తిరుపతిలో ప్రసంగిస్తూ ‘జగన్‌మోహన్‌రెడ్డికి ఓటేస్తే పవిత్రమైన యాత్రాస్థలాన్ని అపవిత్రం చేసినట్లే’నని హిందూ మతతత్వాన్ని వాడుకోదలచి భంగపడ్డారు. 

అలాగే జగన్‌కు 14 సంవత్సరాల జైలుశిక్ష తప్ప దంటూ తానే న్యాయమూర్తిననుకొని వాక్రుచ్చి వ్యతిరేకత తెచ్చుకోవడంతో పాటు, ఎలక్షన్ కమిషన్ నుంచి సంజాయిషీ నోటీసులు అందుకున్నారు. ఆ సంజాయిషీని చూసి ఆయన ప్రచారం చేయడం కంటే పెద్ద శిక్ష కాంగ్రెస్‌కు అక్క రలేదని ఎన్నికల సంఘం భావించినట్లుంది. కనుకనే కనీసం ఆఖరు నాలుగు రోజులైనా ప్రచారానికి వెళ్లరాదని ఆయనను నిషేధించలేదు. 

బొత్స సత్యనారాయణ ‘‘రాజశేఖరరెడ్డి మరణంలో, ఆయన కుటుంబ సభ్యులు శ్రీమతి విజయమ్మ, జగన్‌ల కుట్ర ఉందని అనుమానంగా ఉంది’’ అనేశారు. రాజశేఖరరెడ్డి మరణంపై ప్రజల్లో నేటికీ అనుమానాలు తీరలేదని విజయమ్మ వెలిబుచ్చిన అభిప్రాయానికి తిరుగులేని ప్రతివాదాన్ని ప్రతిపాదిం చానని బొత్స భావించారు. 

కానీ, అస్త్రం తిరిగి తిరిగి తనకూ, కాంగ్రెస్ పార్టీ మెడకే చుట్టుకున్నది. ‘‘నా భర్తను నేను, నాబిడ్డ కుట్ర చేసి చంపామనే నీచ ప్రచారం కాంగ్రెస్ చేస్తున్నది’’ అని విజయమ్మ ప్రజలకు చెప్పి ‘మీరే ధర్మ నిర్ణేతలు, మీరే ఈ నీచమైన నిందలకు సమాధానం చెప్పాలి’’ అని ప్రజా కోర్టులో తీర్పు కోరడంతో కాంగ్రెస్ పెద్దల నోటమాట పెగలలేదు. 

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని హోదాలో బొత్స పుక్కిటపట్టిన ‘కుట్ర’ కథనంపై సందేహనివృత్తి చేయాల్సిన బాధ్యత పాలకులదేకదా! అంటూ వైఎస్సార్ సీపీ నేతలు నిలదీస్తుంటే నీళ్లునమలడం కాంగ్రెస్ నేతల వంత యింది. ఇక కొత్త భక్తుడికి నామాలెక్కువ అన్నట్లు చిరంజీవి ‘‘తండ్రి భౌతిక కాయాన్ని పక్కనపెట్టుకునే తనను ముఖ్య మంత్రిని చేయాలని శాసనసభ్యుల సంతకాల సేకరణకు పూనుకున్న పదవీలాలసుడు జగన్. 

నా వద్దకు కూడా కాంగ్రెస్ శాసనసభ్యులను పంపారు’’ అని వీరావేశంతో ఊగిపోతుంటే... అలా తన వద్దకు సంతకం కోసం వచ్చిన కాంగ్రెస్ శాసనసభ్యుల పేర్లు బయట పెట్ట మని సహజంగానే జగన్ పార్టీ నేతలు నిలదీశారు. పాపం అది అబద్ధం కనుకనో లేదా ఆ శాసనసభ్యులెవరో తన సరసనే ఉన్నారనో మాజీ ‘మెగాస్టార్’ అవాక్కయ్యారు. 

రాష్ట్ర నాయకుల నిర్వాకం ఇలా ఉందని, స్వయంగా రంగంలోకి దిగిన ఆజాద్ ఓట్ల లెక్కింపుతో అవసరం లేకుండానే తమ పార్టీకి దక్కే స్థానం రెండవదో లేక మూడవదోనన్నది అర్థమై (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం గనుక) మతితప్పి అపస్మారకంలో అసలు సంగతి బయటపెట్టేశారు. ‘‘జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే కేంద్రంలో మంత్రిదపవి, ఆ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి పొందే అవకాశం ఉండేది’’ అని పిల్లిని సంచిలోంచి బయటపడేశారు. అదీ అసలు సంగతి! 

తన తండ్రి సమాధి వద్ద చేసిన బాస మేర మాట తప్పని, మడమ తిప్పని వారసత్వంతో తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారిని ఆదుకునేందుకు ఓదార్పుయాత్ర చేపట్టడమే ఆయన చేసిన తప్పని, విశ్వాసఘాతుక కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం సాధ్యం కాదని వేరే పార్టీ స్థాపించడమే జగన్ చేసిన నేరమని ఆజాద్ చెప్పకనే చెప్పారనే కదా దీని భావం! పైగా అటు పార్టీ తరఫున తామే ఆదుకుంటామని, అలా మరణించిన వారి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ వాగ్దానం గంగలో కలిసింది. 

మాటపై నిలబడే విశ్వసనీయ తకు, మాట మార్చే కృతఘ్నతకూ మధ్య పోరాటం ఇది అన్న జగన్ ప్రచారం నిజమని తిరుగులేని విధంగా దీనితో నిరూపితమైంది. పాపం చంద్రబాబు! పాపం అని ఎందుకంటున్నానంటే వైఎస్ మరణానంతరం కాంగ్రెస్‌పార్టీ అస్తవ్యస్తం అవుతుంటే ఇక ప్రత్యామ్నా యం తానే గనుక, భవిష్యత్తులో ముఖ్యమంత్రిని తానే అనుకుని వినువీధుల్లో విహరిస్తున్న వేళ... వాస్తవం ఆయనను ఒక్కసారిగా భూమ్మీ దకు విసిరేసి ఆయన ఆశలను అడియాసలు చేసింది. 

దీంతో ఆయనలో అసహనం కట్టలు తెంచుకుంటున్నది. ఆ నిరాశా నిస్పృహలలో ఏదేదో మాట్లాడేస్తున్నారు. బిర్యానీ పొట్లానికి, పావు మందుకు ఆశపడి జనం జగన్ సభలకు పరిగెత్తుతున్నారని, పత్రికాప్రతినిధులు కూడా జగన్ వద్ద బెల్లం ఉన్నందునే (అది తన వద్ద లేనట్లు) చుట్టూ చేరుతున్నారని, జగన్‌కు ఓటేసిన వారంతా జైలుపాలు అయినట్లేనని... పాపం పిచ్చిపిచ్చిగా ప్రేలాపనలు చేస్తున్నారు. 

దానికితోడు టీడీపీకి మద్దతినిస్తామన్న సీపీఐ నేత నారాయణ కూడా మొహం చాటేస్తున్నట్లున్నది. అంతేకాదు. గతంలో టీడీపీలో రాజ్యసభ సభ్యునిగా ఉండి నేడు జగన్‌కు అండగా నిలిచిన మైసూరారెడ్డి ‘‘రాజశేఖరరెడ్డి లక్ష కోట్లు అక్రమార్జన చేశాడని టీడీపీలో ఉండగా తాను పుస్తకం రాసిన మాట నిజమేనని, అప్పుడు టీడీపీలో ఉన్నాను గనుక లక్ష కోట్లు అని ఏదో రాశాం గానీ, అవన్నీ కాకిలెక్కలే’’నని తేల్చి చెప్పడంతో చంద్రబాబు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారింది. 

ఇదీ ఉప ఎన్నికల మునివాకిట పాలకపక్షం, ప్రతిపక్షం పరిస్థితి! ప్రజాస్వా మ్యమా వర్ధిల్లు! ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా సాగుతున్న కుట్రలు- కుతంత్రా లను, నిందలు-నీచ ప్రచారాన్ని ఎదుర్కొంటూ ప్రజాస్వామ్యమా వర్ధిల్లు! ఇప్పటికే ప్రజాభీష్టాన్ని తారుమారు చేసే క్రమంలో ఎన్నికల అధికారులు ఖర్చు చూపలేని ఎన్నికల ధనం 35 కోట్లు, మరో పది కోట్ల విలువ చేసే బంగారం పట్టుకున్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా, ప్రధానంగా జగన్ పార్టీ కార్యకర్త లను 36 వేల మంది దాకా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చివరకు విజయమ్మ, షర్మిల ధరించే దుస్తుల సూట్‌కేసులను సైతం ‘మగ’ పోలీసులు పరీక్షించారు. ప్రజాస్వామ్యమా వర్ధిల్లు! ఏది ఏమైనా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా ఎన్నుకున్నది కావాలో లేదా అక్రమమార్గాన నడిచే ‘కస్టడీ’ల స్వామ్యం కావాలో అంతిమంగా నిర్దేశించేది ప్రజలే! ఆ ప్రజాచైతన్యాన్ని పెంపొందించేందుకే ఈ ఎన్నికలు! 
Share this article :

0 comments: