ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కలిశాయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కలిశాయి

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కలిశాయి

Written By news on Wednesday, June 13, 2012 | 6/13/2012

ఒకరికి ఒకరు మద్దతు ప్రకటించుకున్నారు
కొన్ని చోట్ల్ల భారీగా ఓట్లు తొలగించారు
అంతటా అధికార దుర్వినియోగం
పోలీసులు ఓవర్‌యాక్షన్ చేశారు
అన్ని కుట్రలనూ ప్రజలు తిప్పికొట్టారు
అన్ని స్థానాల్లో మాదే విజయం

హైదరాబాద్, న్యూస్‌లైన్: అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై రాజకీయం చేసిన ఈ ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీలు పలు నియోజకవర్గాల్లో పరస్పరం ఓట్ల మార్పిడి చేసుకోవడంతో పాటు యథేచ్ఛగా డబ్బు పంపిణీ చేశారని విమర్శించారు. అయినా వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపును మాత్రం ఆపలేరనీ... 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఖాయమని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. రాంబాబు మంగళవారం సాయంత్రం ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం పార్టీ కేం ద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు బాగా ఓట్లు పడతాయనుకున్న ప్రాంతాల్లో అధికారపక్షం ప్రభావంతో భారీగా ఓట్లను తొలగించారనీ... తిరుపతి, అనంతపురం నియోజకవర్గాల్లో ఇది ఎక్కువగా జరిగిందని ఆయన ఆరోపించారు.

ఇలాంటి కుమ్మక్కు చరిత్రలో తొలిసారి

ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాలు రెండూ దిగజారి కలిసిపోయిన పరిస్థితి ప్రజాస్వామ్య చరిత్రలో రాష్ట్రంలోనే జరిగిందని అంబటి దుయ్యబట్టారు. వైఎస్సార్ కాం గ్రెస్ అభ్యర్థుల విజయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేమని అంచనాకు వచ్చిన చోట్ల కాంగ్రెస్ అభ్యర్థి బలహీనంగా ఉంటే టీడీపీకి మద్దతు ప్రకటించారనీ... అలాగే టీడీపీ బలహీనంగా ఉన్న చోట్ల కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారనీ ఆరోపించారు. ప్రత్తిపాడులో కాంగ్రెస్ అభ్యర్థి తానెలాగూ గెలవలేనని తెలిసి టీడీపీకి ఓట్లేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారనీ... ఇంతకంటే నీచం ఏముంటుందని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ నేతలంతా ఎన్నికల ప్రచారంలో తాము గెలిస్తే ఏం చేస్తామో చెప్పుకోకుండా జగన్‌పై దుమ్మెత్తి పోస్తూ తిరిగారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, చిరంజీవి, చంద్రబాబు అందరూ జగన్ నే ఆడిపోసుకున్నారని విమర్శించారు. అధికార ప్రతిపక్షాలు పన్నిన కుట్రలు, కుతంత్రాలను తిప్పి కొడుతూ ప్రజలు చాలా విజ్ఞతతో తీర్పునిచ్చారనీ... తమ అభ్యర్థులను వారు గెలిపించబోతున్నారనీ ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 

పోలీసుల ఓవర్‌యాక్షన్

కొండా సురేఖ పోటీ చేసిన పరకాల నియోజకవర్గంలో పోలీసులు అతిగా ప్రవ ర్తించి వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలింగ్ సందర్భంగా ఇబ్బందులు పెట్టారని అంబటి విమర్శించారు. తిరుపతిలో కాంగ్రెస్ అభ్యర్థి తరపున పోలింగ్ కేంద్రంలో క్యూలోనించున్న ఓటర్లకు వెయ్యి నుంచి మూడు వేల రూపాయలు పంచుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తిలో సాక్షి టీవీ రిపోర్టర్‌పై అక్కడి టీడీపీ వారు దౌర్జన్యం చేస్తే... రక్షించాల్సిన పోలీసులు అతనినే అక్కడినుంచి వెళ్లి పోవాల్సిందిగా దురుసుగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. అక్కడి డీఎస్సీ వెంకట్రామిరెడ్డి ప్రవర్తన ఎలా ఉందో సాక్షి టీవీ ప్రత్యక్ష ప్రసారంలో అందరూ చూశారని చెప్పారు. దాడి చేయడానికి వచ్చినవారిని నిరోధించకుండా బాధితుల పట్ల దురుసుగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. ఒంగోలులో తమ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై కూడా దాడికి ప్రయత్నం జరిగిందన్నారు. నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి టి.సుబ్బరామిరెడ్డి పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి క్యూలో నించున్న వారిని ఓట్లేయాల్సిందిగా అభ్యర్థించడం ఎన్నికల నియమావళి (కోడ్) ఉల్లంఘన కిందకు వస్తుందనీ... ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల కమిషన్‌ను కోరతామనీ అంబటి రాంబాబు తెలిపారు.
Share this article :

0 comments: