విజయమ్మ పర్యటనలో అడుగడుగునా తనిఖీలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయమ్మ పర్యటనలో అడుగడుగునా తనిఖీలు

విజయమ్మ పర్యటనలో అడుగడుగునా తనిఖీలు

Written By news on Saturday, June 9, 2012 | 6/09/2012

అనుమతులు లేవంటూ వాహనాల సీజ్
ఆందోళనకు దిగిన వైఎస్సార్‌సీపీ నేతలు

పరకాల(వరంగల్), న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పరకాల పర్యటనలో పోలీసులు ఓవర్‌యాక్షన్ చేశారు. శుక్రవారం రాత్రి పరకాలలో జరిగిన రోడ్‌షోకు హాజరైన వైఎస్సార్‌సీపీ నాయకులు, అభిమానుల వాహనాలను అడుగడుగునా అడ్డుకున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ మొదటిసారిగా తెలంగాణ పర్యటనకు రావడంతో సహజంగానే పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్ సతీమణిగా విజయమ్మ పర్యటనకు బ్రహ్మరథం పట్టారు. అయితే రోడ్‌షోకు ముందునుంచే పరకాలకు వచ్చే వాహనాలన్నింటినీ అడుగడుగునా తనిఖీల పేరుతో క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. కావాలని కాలయాపన చేశారు. తద్వారా పర్యటనకు వెళ్లకుండా ప్రజల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఎన్ని ఆటంకాలు సృష్టించినా రోడ్‌షో విజయవంతమవగా.. అనంతరం తిరిగి వెళ్లిపోతున్న వాహనాలను పోలీసులు మళ్లీ ఆపేశారు. 

సుమారు 300 వాహనాలను ఆపి అనుమతులు లేవంటూ వేధింపులకు గురిచేశారు. అన్ని రకాల లెసైన్సులున్నప్పటికీ కావాలని ఆపి ఇబ్బందులు పెట్టారు. ఒక దశలో మా వాహనాలను ఎందుకు ఆపుతున్నారని, ఎన్నికల కోడ్‌కు తాము ఎక్కడా ఆటంకపర్చలేదని చెపుతున్నప్పటికీ.. పోలీసులు పెడచెవిన పెట్టారు. ైవె ఎస్ విజయమ్మ పర్యటనకు సెక్యూరిటీగా వచ్చిన వాహనాన్ని సైతం ఆపేశారు. ఇక వాహనాల్లోని మహిళలను సైతం కిందకు దింపకుండా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వాహనాలను తహశీల్దార్ కార్యాలయూనికి తరలించి తాళాలేశారు. దీంతో మహిళలు, వైఎస్సార్‌సీపీ నేతలు రోడ్లపైనే ఉండాల్సివచ్చింది.

వైఎస్సార్‌సీపీ నాయకుల ధర్నా: పోలీసుల తీరుతో మనస్తాపం చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు శుక్రవారం రాత్రి ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వైఎస్సార్‌సీపీపై కక్షసాధింపులకు పాల్పడుతోందంటూ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. బాజిరెడ్డి గోవర్ధన్, ఎం.రాజ్‌ఠాకూర్, ఎ.విజయ్‌కుమార్, ఆధ్వర్యంలో వందలాది మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. సీఎం డౌన్‌డౌన్, ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు నశించాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాత్రి పొద్దుపోయే వరకూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆందోళన కొనసాగించారు.
Share this article :

0 comments: