ప్రజా జీవితమంటే మేకప్, స్క్రిప్ట్...కాదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజా జీవితమంటే మేకప్, స్క్రిప్ట్...కాదు

ప్రజా జీవితమంటే మేకప్, స్క్రిప్ట్...కాదు

Written By news on Monday, June 11, 2012 | 6/11/2012


ప్రజా జీవితమంటే మేకప్ వేసుకుని స్క్రిప్ట్‌లు చదవడం కాదని రాజ్యసభ సభ్యుడు చిరంజీవిపై ఎంపీ సబ్బం హరి మండిపడ్డారు. స్క్రిప్ట్‌లు చదివి నటించేవారు ప్రజా జీవితానికి పనికిరారన్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడాన్ని జనం చూస్తున్నారని వ్యాఖ్యానించారు. విశాఖ విమానాశ్రయంలో ఆదివారం సబ్బం హరి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై ఎన్నికల ప్రచారాల్లో చిరంజీవి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబులు అవినీతి ఆరోపణలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అవినీతిపరులే నీతి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. 30 ఏళ్ల నట జీవితంలో చిరంజీవి బ్లాక్, వైట్ మనీ లేకుండా ఎంత నిజాయితీగా వున్నారో ఆయనకే తెలుసునన్నారు. జగన్ వెంట సంఘవిద్రోహులున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. చంద్రబాబు సీఎం అయ్యాకే రాష్ట్రంలో సంఘవిద్రోహ శక్తులు పేట్రేగిపోయాయని ఆరోపించారు. మారణాయుధాలతో ప్రత్యర్థుల్ని మట్టు బెట్టే సంస్కృతి బాబు హయాంలోనే నడిచిందనడానికి ఎన్నో ఉదాహరణలు వున్నాయన్నారు. ఈ సంగతి ప్రజలకూ తెలుసుననీ, అందువల్లే నేడు టీడీపీ ఉనికికోల్పోయే పరిిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. అభాం డాలు, అబద్ధాలు చెబుతున్నవారి పక్షాన ఉండాలో, అభివృద్ధి వైపు వుండాలో ఈనెల 15న ప్రజలు నిర్ణయిస్తారని సబ్బం హరి పేర్కొన్నారు.
Share this article :

0 comments: