వైఎస్సార్ సీపీ నేతల అక్రమ అరెస్టులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ నేతల అక్రమ అరెస్టులు

వైఎస్సార్ సీపీ నేతల అక్రమ అరెస్టులు

Written By news on Tuesday, June 12, 2012 | 6/12/2012

ఓటమి భయంతో అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతోంది. అధికార యంత్రాం గాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను వేధింపులకు గురిచేస్తోంది. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచీ అక్రమ కేసులు బనాయిస్తూ.. అరెస్టులు చేస్తోంది. తాజాగా ఎన్నికలకు ఒక రోజు ముందు సోమవారం మరింత బరితెగించింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో పలు చోట్ల మద్యం బాటిళ్ల నిల్వ, బుక్‌లెట్ల పంపిణీ ఆరోపణలపై వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 

ఒకరిద్దరికి బెయిల్ ఇవ్వగా మిగతావారిని రిమాండ్‌కు తరలించారు. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని నందలూరు, ఇందుపల్లి, వీరబల్లి తదితర ప్రాంతాలతోపాటు, రాయచోటి నియోజకవర్గంలోని సుండుపల్లె మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను పోలీసులే బెదిరించడం పలు విమర్శలకు దారి తీసింది.

తిరుపతిలో అర్ధరాత్రి అరెస్టులు
తిరుపతిలో సోమవారం రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. ఎక్కువ మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారినే అరెస్టు చేయాలని అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు రావడంతో అర్ధరాత్రి దాటిన తరువాత పెద్ద సంఖ్యలో అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆగమేఘాలపై 25 మంది ఎస్‌ఐలను కూడా నియమించినట్లు తెలిసింది. పలు చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను తీవ్ర స్థాయిలో బెదిరించినట్లు తెలిసింది. కాగా కొన్నిచోట్ల బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం నుంచి మీ సేవా కేంద్రాలకు, పోలింగ్ కేంద్రాలకు ఇచ్చిన కనెక్షన్లు పనిచేయకుండా ఉండేందుకు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కేబుల్ వైర్లను కాల్చివేశారు.
Share this article :

0 comments: