ఆన్ లైన్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆన్ లైన్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త!

ఆన్ లైన్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త!

Written By news on Wednesday, June 13, 2012 | 6/13/2012

ఆన్ లైన్ బ్యాంక్ ఖాతాదారులకు ఊరట కలిగించే వార్త త్వరలోనే వెల్లడి కానుంది. ఆన్ లైన్ లో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే కస్టమర్లు చెల్లించే రుసుమును రద్దు చేయాలని రిజర్వు బాంక్ ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఖాతాదారులు ఎలక్ట్రానిక్ పద్దతి ద్వారా నిధుల బదిలీ సంబంధించిన సేవలను ఉచితంగా అందిచాలని ప్రభుత్వం సూచించింది. అందుకోసం తగిన ఫ్రేమ్ వర్క్ ను సిద్ధం చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకుల ముఖ్య అధికారుల సమావేశంలో కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆదేశించారు. ఈ సమావేశానికి ఆర్ బీఐ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి కూడా హాజరయ్యారు. నేషనల్ ఎలక్ట్రానికి ఫండ్ ట్రాన్స్ ఫర్ (నెఫ్ట్), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీస్) పద్దతుల ద్వారా నగదు బదిలీకి బ్యాంకులు 5 రూపాయల నుంచి 55 రూపాయలను వసూలు చేస్తోంది. 
Share this article :

0 comments: