ఓరుగల్లు గడ్డపై తొలిఅడుగు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓరుగల్లు గడ్డపై తొలిఅడుగు

ఓరుగల్లు గడ్డపై తొలిఅడుగు

Written By news on Saturday, June 9, 2012 | 6/09/2012

- రాజన్న కుటుంబానికి ఆదరణ
- కొండా దంపతులకు అండ
- హోరెత్తిన ఎన్నికల ప్రచారం
- వైఎస్సార్‌సీపీలో నూతనోత్తేజం 

వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : ఓరుగల్లు గడ్డపై తొలి అడుగుపెట్టిన ‘రాజన్న’ కుటుంబానికి అపూర్వ అదరణ లభించింది. మహానేత వైఎస్సార్ సతీమణి, వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, కుమార్తె షర్మిలకు అడుగడుగున జనం నిరాజనాలు పలికారు. ప్రతిపక్షనేతగా వైఎస్సార్ పాదయాత్రతో అడుగులువేసిన పరకాల పోరుగడ్డపై ఉప ఎన్నిక శంఖరావాన్ని పూరించారు. తొలినుంచి వైఎస్ కుటుంబానికి అండగా నిలుస్తున్న కొం డా కుటుంబానికి బాసటగా నిలిచేందుకు తరలి వచ్చారు.

ఉదయం పది గంటలకు రైల్వేకోడూరు నుంచి హన్మకొండకు చేరుకున్న విజయమ్మ, షర్మిలకు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానాలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికా రు. కొండా దంపతుల కుమార్తె ఇంటి వద్ద కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం గీసుకొండ మండలం కోనాయమాకుల వద్ద జరిగిన బహిరంగ సభకు తరలివెళ్లారు. వెంకట్రామ థియేటర్ సెంటర్‌లో వందలాదిమంది కార్యకర్తలు ఎదురేగి బైక్‌ర్యాలీలో ఆమె కాన్వాయ్‌కు ముందుసాగారు. క్రిష్టియన్ కాలనీలోని చర్చివద్ద వందలాది కుటుం బాల వారు విజమ్మను కలిసి పలకరించారు. 

కొండంత అండగా కోనాయమాకుల
వరంగల్, నర్సంపేట ప్రధాన రహదారిపై నిర్వహించిన సభకు జనం వెల్లువలా తరలివచ్చా రు. ఉదయం 12 గంటల సమయంలో సభ ప్రారంభమైంది. ముందుగా షర్మిల ‘నేను...రాజన్న కుమార్తెను...జగనన్న చెల్లెలను... నా పేరు షర్మిల’ అంటూ ప్రసంగాన్ని కొనసాగిం చారు. ఆమె హావభావాలు దివంగత నేత వైఎ స్సార్‌ను తలపించడంతో జనం ఆమెలో మహా నేతను చూసుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ కుట్రలపై ఆమె ధ్వజమెత్తారు. అనంతరం విజయ మ్మ మాట్లాడుతూ తానే పరిస్థితుల్లో ప్రచార బాధ్యతలు చేపట్టాల్సి వచ్చిందో వివరించారు. వీరు మాట్లాడుతున్నంత సేపు జనం నుంచి విశే ష స్పందన లభించింది.

తమకు తొలినుంచి కొండా దంపతులు ఏవిధంగా అండగా నిలిచిం దీ తమ ప్రసంగంలో వివరించారు. మధ్యాహ్నం 2.15గంటల సమయంలో సభ ముగిసిన అనంతరం హన్మకొండలోని కొండా దంపతుల కుమార్తె ఇంటికి చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడే మధ్యాహ్నం భోజనం ముగించారు. ఈ సందర్భంగా కొండా దంపతులు, పలువురు పార్టీ నేతలు వారిని కలుసుకున్నారు. కొండా దంపతుల కుమార్తె సుస్మితాపటేల్ దంతులు వారికి సాదర సత్కారం చేశారు. 

హోరెత్తిన పరకాల 
సాయంత్రం 6.30గంటల సమయంలో విజ యమ్మ, షర్మిల హన్మకొండ నుంచి బయలుదేరి పరకాలకు చేరుకున్నారు. స్థానిక అంబేద్కర్ సెంటర్ నుంచి ఏటీఎం సెంటర్ వరకు రోడ్‌షో నిర్వహించారు. నియోజకవర్గంలోని ఆత్మకూ రు, పరకాల మండలంతో పాటు, పల్లెల నుంచి తరలివచ్చిన వేలాది మందితో పట్టణం జనసంద్రమైంది. ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, సు రేఖ, షర్మిళ, విజయమ్మల ప్రసంగాలతో సభ హోరెత్తింది. కాంగ్రెస్, టీడీపీ కుట్రలను, తెలంగాణ పేరుతో టీఆర్‌ఎస్ చేస్తున్న మోసాలను వివరించినప్పుడు జనం కేరింతలు కొట్టారు. విజయమ్మ తెలంగాణపై మరోసారి వైఎస్సార్‌సీపీ వైఖరిని వెల్లడించారు.

సభ ప్రాంగణం జై జగన్ నినాదాలతో దద్దరల్లింది. అనంతరం కా మారెడ్డిపల్లెలోని హనుమాన్‌గుడిని సందర్శిం చుకున్నారు. ఈ దేవాలయం కొండా దంపతుల కు సెంటిమెంట్‌గా మారింది. ప్రతీసారి ఎన్నిక ల ప్రచారాన్ని ఈ దేవాలయంలో పూజలు చేసిన అనంతరం చేపట్టడం వారికి ఆచారంగా వస్తున్నది. అనంతరం విజయమ్మ, షర్మిళల హ న్మకొండకు చేరుకుని అర్ధరాత్రి రైలుమార్గంలో ఒంగోలు బయలుదేరారు. చివరి అంకానికి చేరుకున్న పరకాల ప్రచారం విజయమ్మ రాకతో ఒక్కసారిగా పతాకస్థాయికి చేరుకున్నది. 
Share this article :

0 comments: