న్యాయమూర్తితో ఎందుకు మాట్లాడారు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » న్యాయమూర్తితో ఎందుకు మాట్లాడారు?

న్యాయమూర్తితో ఎందుకు మాట్లాడారు?

Written By news on Friday, June 29, 2012 | 6/29/2012

న్యాయమూర్తితో ఎందుకు మాట్లాడారు?
విలేకరులు, పత్రికాధిపతులతో ఎందుకు మాట్లాడారు?
ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలను ఖండించలేదెందుకు?
ప్రైవసీ మీకొక్కరికే ఉంటుందా? జగన్‌కు ఉండదా?

హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ.. సీబీఐ నియమావళికి విరుద్ధంగా మీడియాతోనూ, ప్రైవేటు వ్యక్తులతోనూ మాట్లాడిన ఫోన్ కాల్స్ గురించి సమాధానం చెప్పకుండా బుకాయించేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ కాల్స్ జాబితాను వెల్లడించడం ద్వారా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై జరుగుతున్న కుట్రను తాము బయటి ప్రపంచానికి చాటి చెబితే.. దానిపై జేడీ స్పందించకుండా రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. 

‘‘కాల్స్ జాబితా వెల్లడించడం వల్ల తన ప్రైవసీ (వ్యక్తిగత గోప్యత) దెబ్బ తిన్నదని జేడీ ఫిర్యాదు చేశారు.. ఆయన ఒక్కరికే ఆ ప్రైవసీ ఉందా? జగన్‌మోహన్‌రెడ్డికి ప్రైవసీ లేదా? ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలకు ప్రైవసీ లేదా? 28 బృందాలను తీసుకెళ్లివారి బెడ్‌రూంలలో కూడా తనిఖీలు నిర్వహించారే, అపుడు జేడీకి ప్రైవసీ గురించి గుర్తుకు రాలేదా?’’ అని అంబటి ప్రశ్నించారు. ‘‘మీరొక దర్యాప్తు అధికారి, మీరు పెట్టే కేసులపై తీర్పునివ్వాల్సిన న్యాయమూర్తితో మీరు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? మీడియాతోనూ, మీడియా యాజమాన్యాలతోనూ ఎందుకు మాట్లాడారు? ఇలా మాట్లాడ్డం సీబీఐ మాన్యువల్(నియమావళి)ను ఉల్లంఘిం చినట్లా? కాదా? సమాధానం చెప్పండి’’ అని నిలదీశారు.

నిజం కాకుంటే.. ఖండించరెందుకు?: తన కాల్స్ జాబితా ఎక్కడి నుంచి వచ్చిందని, అలా రావడం తప్పు అని అంటున్న లక్ష్మీనారాయణ తాను మాట్లాడిన కాల్స్ నిజం కాకపోతే.. వాటి ని ఎందుకు ఖండించడం లేదు? అని ప్రశ్నించారు. 

న్యాయమూర్తితో సహా ఎంపిక చేసుకున్న కొందరు విలేకరులతో, వారి యాజమాన్యాలతో మాట్లాడింది నిజమో కాదో ఆయన ఎందు కు చెప్పడం లేదన్నారు. అసలు తాను అధికారిక ఫోన్ నుంచి వీరందరితో మాట్లాడ్డం చట్టబద్ధమే అయితే, మాన్యువల్‌కు అనుగుణంగా ఉంటే జేడీ ధైర్యంగా ఫలానా వారితో మాట్లాడాను అని చెప్పి ఉండే వారని అన్నారు. జగన్ వ్యతిరేక మీడియాతో మాట్లాడుతున్నారని తాము తొలి నుంచీ ఆక్షేపిస్తున్నామ ని, లీకుల పేరుతో లక్ష్మీనారాయణ వార్తలు రాసేలా సమాచారం ఇస్తున్నారని చెప్పారు.ఆయన సమాచారం మేరకే జగన్‌పై ‘ఈనాడు’, దాని తోక పత్రిక పుంఖానుపుంఖాలుగా వార్తలు రాశాయని చెప్పారు. జగన్‌పై దుష్ర్పచారం సాగిస్తూ వస్తున్న వార్తలను ఒక్క రోజూ విచారణాధికారిగా జేడీ ఖండించలేదని, ఎందుకంటే ఆ వార్తలు ఆయన అందించినవేనని రాంబాబు అన్నారు. 

ఆ వార్తలను ఖండిస్తే తాను లీకులు ఇచ్చే మీడియా తిరిగి ప్రశ్నిస్తుందనే ఉద్దేశంతోనే జేడీ మిన్నకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా అంబటి సీబీఐ దర్యాప్తు మొదలైనప్పటి నుంచీ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన వార్తలను ప్రదర్శించారు.

నన్ను అడిగినవే.. పత్రికల్లో: తాను సీబీఐ విచారణకు వెళ్లినపుడు అక్కడ తనను ఏమేమి అడిగారో అవన్నీ ఆ మరుసటి రోజు పత్రికల్లో వచ్చాయని అంబటి తెలిపారు. లక్ష్మీనారాయణ చేస్తున్న కుట్రను తాము బయట పెడుతూ ఉంటే.. ఆయనకు అండగా ఇపుడు ఓ వర్గం మీడియా సమీకృతమై తమపై దాడికి దిగుతోందని, దానికి కారణం ఆయన ఇచ్చే లీకులేనని రాం బాబు దుయ్యబట్టారు. ఒక మహిళను అడ్డం పెట్టుకుని రాజకీ యం చేస్తున్నారంటూ ఓ వర్గం మీడియా తమను ఉద్దేశించి ప్రచారం చేస్తోందని, వాస్తవానికి ఆ పని చేస్తున్నది జేడీయేనని అంబటి అన్నారు. జేడీని న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు.
Share this article :

0 comments: