సిబిఐ జెడి ఫోన్ కాల్స్ జాబితాలో చంద్రబాల ఎవరు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సిబిఐ జెడి ఫోన్ కాల్స్ జాబితాలో చంద్రబాల ఎవరు?

సిబిఐ జెడి ఫోన్ కాల్స్ జాబితాలో చంద్రబాల ఎవరు?

Written By news on Thursday, June 21, 2012 | 6/21/2012

సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ చేసిన ఫోన్ కాల్ జాబితాను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ శాసనసభ పక్షం విడుదల చేస్తూ, సిబిఐ కుట్ర ప్రకారమే వై.ఎస్.జగన్ కేసును డీల్ చేస్తోందంటూ పెద్ద ఎత్తున ఆరోపణ చేసింది. మీడియా ప్రతినిదులతో పాటు వాసిరెడ్డి చంద్రబాల అనే ఆమె కు లక్ష్మీనారాయణ సెల్ ఫోన్ నుంచి వెళ్లిన ఫోన్ కాల్స్, అలాగే మీడియా నుంచి, చంద్రబాల నుంచి లక్ష్మీనారాయణకు వెళ్లిన ఫోన్ కాల్స్ జాబితాను విడుదల చేసి ఇందులో కుట్ర ఉందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఒక వర్గం మీడియాతోనే మాట్లాడారన్నది ఒక అభియోగం కాగా, చంద్రబాల ఆంధ్రజ్యోతి ఎమ్.డి.రాధాకృష్ణకు కూడా పది ఫోన్ కాల్స్ చేసినట్లు ఆ జాబితా వెల్లడించింది. ఒక టీవీ ప్రతినిధితో 389సార్లు జెడి మాట్లాడినట్లు జాబితా వెల్లడించడం విశేషం. ఒక వర్గం మీడియావారితోనే జెడి మాట్లాడారన్నది ఎమ్మెల్యేల అభియోగంగా ఉంది. అయితే చంద్రబాల గురించి కూడా అందరిలో ఆసక్తి ఏర్పడింది.చంద్రబాల తో 320సార్లు జెడి మాట్లాడారన్నది వీరి అభియోగం. ఎవరీ చంద్రబాల అంటూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభ ఆవరణలో ధర్నా చేసిన సందర్భంగా ప్లకార్డులను కూడా ప్రదర్శించడం విశేషం.మీడియా ప్రతినిదులతో జెడి మాట్లాడడం లో పెద్ద తప్పు ఉంటుందా అన్నది చర్చనీయాంశం. అయితే కేవలం కొందరితోనే ఆయన మాట్లాడారన్నది ఒక విమర్శ కావచ్చు. జగన్ కు వ్యతిరేకంగా వ్యవహరించే మీడియాతోనే ఆయన మాట్లాడారని, సిబిఐ ఆయా వ్యక్తులను విచారించే సందర్భంలో పలు విషయాలు బయటకు వచ్చిన తీరుపై సాక్షి ఫిర్యాదులు చేసిందని, అయినా పట్టించుకోలేదన్నది మరో అభియోగంగా ఉంది. కాగా మీడియాతో మాట్లాడినదానిపై ఎంతవరకు ఇది సమస్య అవుతుందో చెప్పజాలం. అయితే వాసిరెడ్డి చంద్రబాల పాత్రపై ఏవైనా కొత్త విషయాలు వెలుగులోకి వస్తే అప్పుడు సిబిఐ పాత్రపై విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా చంద్రబాలకు ఈ వ్యవహారాలతో సంబంధాలు లేవని తేలితే అప్పుడు సిబిఐకి గాని, లక్ష్మీనారాయణకు గాని పెద్ద ఇబ్బంది ఉండదు. అయితే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వద్ద ఇంకే ఆరోపణల జాబితా ఉంది? వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలను ఆ పార్టీ చూపబోతోందన్నదానిపైనే ఈ వ్యవహారం ఆధారపడి ఉంటుంది.ఇక ఇప్పుడు ఇది వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు, సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణకు మధ్య యుద్దంగా మారిందని అనుకోవాలి. ఇప్పుడు లక్ష్మీనారాయణ ఎలా స్పందిస్తారన్నది కూడా ఆసక్తికరం.మార్చి నెల నుంచి జూన్ పదిహేడో తేదీవరకు లక్ష్మీనారాయణ పోన్ కాల్స్ జాబితాను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ విడుదల చేసింది.
Share this article :

0 comments: