కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి: కొండా సురేఖ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి: కొండా సురేఖ

కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి: కొండా సురేఖ

Written By news on Saturday, June 23, 2012 | 6/23/2012

పరకాలలో కాంగ్రెస్, టీడీపీ కలిసి టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయించాయని విమర్శ
త్వరలో తెలంగాణలో ఓదార్పుయాత్ర

హైదరాబాద్, న్యూస్‌లైన్: మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు మాటను నిలబెట్టుకోకపోతే ముక్కు నేలకు రాయాలని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యనిర్వాహక సభ్యురాలు కొండా సురేఖ డిమాండ్ చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం కొండాసురేఖను ఆమె ఇంట్లో కలిశారు. ఈ సందర్భంగా సురేఖ విలేకరులతో మాట్లాడుతూ, పరకాలలో అన్ని పార్టీలు నిజాయితీగా పోటీ చేసుంటే విజయం తనకే వరించేదని చెప్పారు. టీఆర్‌ఎస్, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలు తనపై దండయాత్ర చేశారన్నారు. నియోజకవర్గంలో కొండా మురళి చేసిన వన్‌మెన్ ఆర్మీ పోరాట ఫలితమే ప్రజలు ఓట్ల రూపంలో తమ వెంట నిలిచారన్నారు. 

పరకాలలో కాంగ్రెస్ పూర్తిగా.. టీడీపీ కొన్ని చోట్ల టీఆర్‌ఎస్‌కు సహకరించాయని ఆమె ఆరోపించారు. పరకాలలో తాను గెలిచి ఓడానని, టీఆర్‌ఎస్ మాత్రం ఓడి, గెలిచిందన్నారు. తనపై ఎన్ని రకాలుగా దుష్ర్పచారం చేసినప్పటికీ టీఆర్‌ఎస్ మాటలు ప్రజలు విశ్వసించలేదని చెప్పారు. మూడు నెలల్లో తెలంగాణ తెస్తామని చెప్పి టీఆర్‌ఎస్ ప్రజలను మభ్యపెట్టి గెలుపొందిందని విమర్శించారు. సెప్టెంబర్ 15లోపు తెలంగాణ తేలేకపోతే కే సీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని సురేఖ డిమాండ్ చేశారు. ఒకవేళ మాటకు కట్టుబడి ఉండకపోతే తమ నుంచి ఎదురుదాడి తప్పదని ఆమె హెచ్చరించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై ప్రజల్లో ఉన్న అభిమానం ఉప ఎన్నికలతో మరోసారి రుజువైందన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై తమ నాయకుడు జగన్‌ను జైల్లో పెట్టించినప్పటికీ వారి కుట్రలు ఫలించలేదన్నారు. విజయమ్మ, షర్మిల నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు ఉప ఎన్నికల్లో ఊహకందని మెజారిటీతో గెలుపొందారని వివరించారు. 

మాకు అండగా ఉంటామన్నారు

‘‘మొదటి నుంచి మీరు త్యాగం చేసి మా వెన్నంటి ఉన్నారు. కష్టం వచ్చినా, నష్టమొచ్చినా కూడా మాలో ఒక్కరు. కాబట్టి ధైర్యంగా ఉండమని జగన్ చెప్పమన్నారని విజయమ్మ తనతో చెప్పారు. అదే విధంగా విజయమ్మ తన మనసులోని ఆలోచనలు తనతో పంచుకున్నారు’’ అని సురేఖ వివరిం చారు. తెలంగాణలో త్వరలో ఓదార్పుయాత్ర జరుగు తుందని స్పష్టంచేశారు. ఒకవేళ జగన్ జైలు నుంచి బయటకు రావడం ఆలస్యం అయ్యే అవకాశం ఉంటే ఆ కార్యక్రమాన్ని విజయమ్మ చేపడుతారని ఆమె తెలిపారు.
Share this article :

0 comments: