అకౌంట్లను ఎవరూ గుర్తు పట్టకుండా సి.నాయుడు నారా అనే పేరుతో - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అకౌంట్లను ఎవరూ గుర్తు పట్టకుండా సి.నాయుడు నారా అనే పేరుతో

అకౌంట్లను ఎవరూ గుర్తు పట్టకుండా సి.నాయుడు నారా అనే పేరుతో

Written By news on Monday, June 11, 2012 | 6/11/2012

చంద్రబాబు ఎంత తెలివైన దొంగో కోలా చెప్పిన విషయాలతో మరోసారి రుజువైంది
రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు యథేచ్ఛగా దోచుకున్న చంద్రబాబు ఆ సొమ్మును విదేశాల్లో దాచిపెట్టారు
అకౌంట్లను ఎవరూ గుర్తు పట్టకుండా సి.నాయుడు నారా అనే పేరుతో పెట్టారు
వీటిపై బాబు ఈడీతో విచారణ జరిపించుకోవాలి.. సచ్ఛీలత నిరూపించుకోవాలి

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుచంద్రబాబునాయుడుకు నాలుగు విదేశీ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన కోలా కృష్ణమోహన్ రుజువులతో సహా వెల్లడించారు. వీటిపై చంద్రబాబు సమాధానమివ్వాలి. రాష్ట్రానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు విదేశాల్లోని బ్యాంకుల్లో అకౌంట్లు ఎందుకు కలిగి ఉన్నారో ఉప ఎన్నికల సందర్భంగానైనా ప్రజలకు వివరించాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు డిమాండ్ చేశారు. 

ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జూపూడి మాట్లాడుతూ.. ‘‘అన్నా హజారేకు బావమరిదిగా చెప్పుకునే చంద్రబాబు విదేశీ గుట్టును ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తే రట్టు చేశారు. చంద్రబాబు ఎంత తెలివైన దొంగనేది కోలా చెప్పిన విషయాలతో మరోసారి రుజువైంది. హసన్ ఆలీ ద్వారా చంద్రబాబు నిర్వహించిన హవాలా కార్యకలాపాలను గతంలోనే మీడియా వెలుగులోకి తెచ్చింది’’ అని అన్నారు. విదేశీ అకౌంట్లను ఎవరూ గుర్తుపట్టకుండా చంద్రబాబు వేసిన ఎత్తుగడను జూపూడి వివరించారు. ‘‘రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు యథేచ్ఛగా దోచుకున్న చంద్రబాబు ఆ సొమ్మును విదేశాల్లో భద్రంగా దాచిపెట్టారు. 

వాటిని ఎవరూ గుర్తు పట్టకూడదనే ఉద్దేశంతో అకౌంట్లను సి.నాయుడు నారా అనే పేరుతో పెట్టించారు. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న మాదిరిగా నారా చంద్రబాబునాయుడు అని ఎందుకు పెట్టలేదు? అదంతా నల్లడబ్బు కాబట్టే ఆ విధంగా చేశారా’’ అని నిలదీశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కోలా వెల్లడించిన విషయాలపై డొంక తిరుగుడు సమాధానాలు కాకుండా సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘వాస్తవాలను కోలా బయటపెట్టేసరికి కంగుతిన్న చంద్రబాబు.. విదేశాల్లో అకౌంట్లు ఉంటే అందులో ఉన్న డబ్బు మీరే తీసుకోండంటారు. ఎవరు వెళ్లాలి? సామాన్యులు వెళ్లి అడిగితే ఎవరైనా చూపిస్తారా? అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? చంద్రబాబుకు చేతనైతే ఆయనపై వచ్చిన ఆరోపణలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) చేత విచారణ జరిపించుకోవాలి. సచ్ఛీలతను నిరూపించుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.

చంద్రబాబుపై ప్రభుత్వం విచారణ జరిపించాలి

‘‘చంద్రబాబుపై ఎప్పటి నుంచో వస్తున్న ఆరోపణలపై విజయమ్మ అన్ని ఆధారాలను సేకరించి కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై రాష్ట్ర హైకోర్టు మొదట విచారణకు ఆదేశిస్తే ధైర్యంగా విచారణను ఎదుర్కొంటానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు.. తన బినామీలను సుప్రీంకోర్టుకు పంపించారు. రాష్ట్రంలోనే తేల్చుకోవాలని సుప్రీం చెప్పేసరికి నీతులు వల్లించిన చంద్రబాబే హైకోర్టులో ఇంప్లీడ్ అయ్యారు. నాట్‌బిపోర్ నాటకంతో కేసు లేకుండా చేసుకున్నారు’’ అని విమర్శించారు. ‘‘జగన్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు తేదీ, సంతకం లేకుండా రెండు పేజీల లేఖను కోర్టు ద్వారా ఏ విధంగా విచారణ చేయిస్తున్నారో, అదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు మీద కూడా విచారణ జరిపించాలి. అలా చేయకపోతే వారిద్దరి మ్యాచ్‌ఫిక్సింగ్‌కు మరింత బలం చేకూర్చినట్లవుతుంది. చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు ఒక్కరూ స్పందించడంలేదంటే వారి బంధం ఎంతగా బలపడిందో అర్థం చేసుకోవచ్చు’’ అని అన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి 30 ఏళ్లు సేవ చేసి రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్ కుటుంబాన్ని వేధిస్తారా? ఆత్మాభిమానంతో జగన్ బయటకెళ్లేసరికి అక్రమ కేసులతో జైలుకు పంపిస్తారా’’ అని జూపూడి నిలదీశారు.

వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసింది చంద్రబాబే

దేశంలో వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసి, దేశాన్ని దోచి, ఆ సొమ్మును విదేశాల్లో దాచుకొన్నది చంద్రబాబేనని జూపూడి దుయ్యబట్టారు. ‘‘స్టాంపుల కుంభకోణం, దొంగనోట్ల తయారీతో చంద్రబాబు పాలనంతా అవినీతిమయమైంది. కేంద్రంలో అప్పటి ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతునిస్తూ.. వారిని బ్లాక్‌మెయిల్ చేసి విదేశాలకు పెద్ద ఎత్తున డబ్బును తరలించారు. చంద్రబాబుపై విచారణ చేపట్టేసరికి డబ్బు, పదవులతో ఆ వ్యవస్థలను మేనేజ్ చేశారు. ఈడీకి లంచమివ్వడం, విచారణ చేపట్టిన జడ్జిలను ప్రలోభాలకు గురిచేయడం ఆయనకే చెల్లింది. 

వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి ఆఖరికి పత్రికా యాజమాన్యాలను ఉపయోగించుకోవడం సిగ్గుచేటు. కోలా చెప్పినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రికకు గతంలో ఎండీగా ఉన్న వ్యక్తి చేతే ఈడీకి లంచం ఇప్పించిన ఘనుడు చంద్రబాబు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన చంద్రబాబు ప్రజలకు నీతులు చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన చేసిన నిర్వాకంతో ప్రజలు రెండుసార్లు ఛీత్కరించి గట్టి గుణపాఠం చెప్పారు. అప్పటి నుంచి ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడంలేదు. చివరకు అంబేద్కర్‌కు భారతరత్న ఇప్పించానని చెప్పుకునే స్థాయికి వెళ్లారు. బాబును పిచ్చాసుపత్రిలో చేర్పించే సమయం ఆసన్నమైంది’’ అని జూపూడి చెప్పారు.
పిల్లల పెంపకంపై చంద్రబాబు మాట్లాడటమా!

పిల్లల పెంపకంపై చంద్రబాబు మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉందని జూపూడి ఎద్దేవా చేశారు. నేరస్తుడిని వెదికిన తీరులో కొడుకును వెదకడానికి బెంగళూరు, చెన్నై, ఢిల్లీలకు బృందాలను పంపించిన వ్యక్తి నీతులు వల్లించడం సిగ్గుచేటన్నారు. మంది కొంపలు ముంచి వారి డబ్బుతో అమెరికాలో కొడుకును చదువించుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. విదేశాల్లో ఆయన కొడుకు ఏం వెలగబెడుతున్నారో ఇప్పటికైనా బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: