రాజకీయ కక్షతోఅవమానించటానికే..! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజకీయ కక్షతోఅవమానించటానికే..!

రాజకీయ కక్షతోఅవమానించటానికే..!

Written By news on Tuesday, June 12, 2012 | 6/12/2012

* నా భద్రతను, హోదాను, ప్రతిష్టను విస్మరించారు 
* సీబీఐ కోర్టుకు జగన్ సమర్పించిన మెమో పూర్తి పాఠం

‘‘ఒక పార్లమెంటు సభ్యుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా నేను సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న కారణంతో మాత్రమే అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఎంపీ, పార్టీ అధ్యక్షుడి హోదాల్లో నేను గత పది నెలలుగా కొనసాగుతున్నా. భవిష్యత్‌లోనూ కొనసాగుతా. 

ఈ రోజు (సోమవారం) నేను కోర్టుకు హాజరు కావాల్సి ఉండటంతో.. నాపై రాజకీయ కక్ష సాధింపుల కోసం, నన్ను అవమానించటం కోసం.. నా ప్రత్యేక కేటగిరీ ఖైదీగా నా హోదాను, జడ్ కేటగిరీ భద్రతలో ఉన్న ఎంపీగా నా ప్రతిష్టను విస్మరించి.. సాధారణ నేరస్థులను తరలించటానికి ఉపయోగించే వ్యాన్‌లో ఉద్దేశపూర్వకంగా నన్ను తీసుకువచ్చారు. నా భద్రతను గాలికి వదిలేశారు. ఇదే కేసులో రిమాండ్‌లో ఉన్న ఇతర నిందితులను కోర్టుకు హాజరుపరిచిన దానికి భిన్నంగా వ్యవహరించారు. కేసులో ఎ2, తదితరులను తరలించిన విధానానికి భిన్నంగా నన్ను వ్యాన్‌లో తీసుకువచ్చారు. 

ప్రభుత్వం, అధికారులు సాగిస్తున్న కక్ష సాధింపులు, దుశ్చేష్టల గురించి నాకు తెలిసినప్పటికీ.. కేవలం ఈ కోర్టు పైన ఉన్న గౌరవంతో, నిర్ణయించిన తేదీకి కోర్టు ఎదుట హాజరు కావాలన్న ఉద్దేశంతో మాత్రమే.. నేను నిరసన తెలపటం కానీ, వ్యాన్‌లో రానంటూ తిరస్కరించటం కానీ చేయలేదు. నిజానికి జైలు అధికారులు కూడా.. నా కుటుంబ సభ్యులు, నా భార్యను కలిసేందుకు నిరాకరించటం ద్వారా ఇదే వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఇదే వైఖరి కొనసాగితే.. నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష చేయక తప్పని పరిస్థితి వస్తుంది. 

ఈ రోజు నా ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని దిగమింగుకుని, నా వ్యక్తిగత భద్రతను ప్రమాదంలో పెట్టి.. కోర్టులో హాజరవటానికి, న్యాయం కోరటానికి నేను వ్యానులో ప్రయాణించాను. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ చట్టవ్యతిరేక, కక్ష పూరిత వైఖరిని గుర్తించి.. వారికి తగిన మార్గదర్శకాలు జారీచేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.’’
Share this article :

0 comments: