మారియట్ హోటళ్లలో చంద్రబాబు వాటా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మారియట్ హోటళ్లలో చంద్రబాబు వాటా

మారియట్ హోటళ్లలో చంద్రబాబు వాటా

Written By news on Tuesday, June 12, 2012 | 6/12/2012

ఆయన ఫెమా, మనీ ల్యాండరింగ్ చట్టాలను ఉల్లంఘించారు
బాబు సన్నిహితుడు కోలా కృష్ణమోహన్ ఆ వివరాలిచ్చారు
స్విస్ బ్యాంకు నంబర్లతో సహా వెల్లడించారు ఏ అకౌంట్‌కు డబ్బు పంపారో చెప్పారు
అప్పటి డీజీపీ దొర, ఇంటెలిజెన్స్ చీఫ్ శివశంకర్‌లు బెదిరించారని ఆరోపించారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమంగా విదేశీ బ్యాంకుల్లో డబ్బు కలిగి ఉన్న విషయంలో ఆధారాలు లభించినందున ఆయనపై విదేశీ ద్రవ్య నియంత్రణ చట్టం-1999 (ఫెమా), మనీల్యాండరింగ్ నిరోధక చట్టం-2002 ప్రకారం దర్యాప్తు జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ)ను కోరారు. ఈ మేరకు ఆయన ఈడీ అధికారులకు సోమవారం ఒక లేఖ రాశారు. హవాలా వ్యాపారి హసన్ అలీని ఈడీ అధికారులు ప్రశ్నించినప్పుడు చంద్రబాబుకు విదేశీ బ్యాంకుల నుంచి హవాలా రూపంలో డబ్బు అందజేసినట్లు వెల్లడైన విషయాన్ని కూడా బాజిరెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

పపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న మారియట్ హోటళ్లలో చంద్రబాబు వాటా ఉందని అందుకే ఆయన తరచూ సింగపూర్, స్విట్జర్లాండ్‌లకు వెళ్తుంటారని ఆరోపించారు. చంద్రబాబు అక్రమాస్తులపై వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఆయన స్టే తెచ్చుకొని తప్పించుకు తిరుగుతున్నారని, ఈ విషయాన్ని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెంట్లు పట్టించుకోవడం లేదని విమర్శించారు. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌కు పట్టుబడుతున్న కోట్లాది డబ్బులు టీడీపీ పంచుతున్నవేనని ఆరోపించారు. కనుక కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని కృష్ణమోహన్ చెప్పిన ఆధారాల ఆధారంగా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈడీ అధికారులు చంద్రబాబు ఆస్తులు, విదేశీ బ్యాంక్ ఖాతాలు, హవాలా కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరముందని లేఖలో కోరారు. బాజిరెడ్డి లేఖలోని ముఖ్యాంశాలు...

చంద్రబాబు అక్రమాలకు ఆధారాలివిగో...

‘‘చట్ట ఉల్లంఘనకు పాల్పడి విదేశాల్లో కూడబెట్టుకున్న డబ్బుపై విచారణ జరిపే అధికారం ఈడీకి ఉంది. కనుక చంద్రబాబు అక్రమాలపై దర్యాప్తు చేయాలని కోరుతున్నాం. చంద్రబాబు విదేశీ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి తాజా గణాంకాలు, ఆధారాలతో సహా ఆయనకు అత్యంత సన్నిహితుడు కోలా కృష్ణమోహన్ మీడియా సాక్షిగా వెల్లడించారు. ఈ ఆరోపణల తీవ్రత దృష్ట్యా వెంటనే విచారణ జరపాలని మనవి చేస్తున్నాం. చంద్రబాబు హవాలా ద్వారా విదేశీ బ్యాంకుల నుంచి నల్ల ధనాన్ని తిరిగి ఇండియాకు తెచ్చి ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఉప ఎన్నికలు 18 అసెంబ్లీ, ఒక పార్లమెంటు పరిధిలోని అన్ని స్థానాల్లో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. తాజాగా వెల్లడైన సమాచారం మేరకు చంద్రబాబుకు విదేశాల్లో నాలుగు అకౌంట్లు, ఆయన కుటుంబ సభ్యులకు 12 అకౌంట్లు ఉన్నాయి. అయితే చంద్రబాబు ఇవేవి తన ఎన్నికల అఫిడవిట్ చూపించలేదు. అంతేకాదు ఈ మధ్య ఆయన వెల్లడించిన ఆస్తుల వివరాల్లో కూడా విదేశీ ఖాతాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. చంద్రబాబు సన్నిహితుడు కోలా కృష్ణమోహన్ ఈ మధ్య కాలంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 1999లో మచిలీపట్నం పార్లమెంట్ టికెట్ కోసం రూ.5.10 కోట్ల రూపాయలు తీసుకున్నారని తెలిపారు. అలాగే చంద్రబాబుకు సింగపూర్‌లోని డ్యూష్ బ్యాంక్ (అకౌంట్ నెంబర్ 2248634590-4985) స్విస్‌బ్యాంక్ (అకౌంట్ నంబర్ 02040491211100) యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ (అకౌంట్ నంబర్ 00991534218169) నాట్‌వెస్ట్ బ్యాంక్, లండన్ (అకౌంట్ నంబర్ 4928364100832) బార్క్‌లెస్ బ్యాంక్, సింగపూర్ (అకౌంట్ నంబర్ 00851327000124) లో సి.నాయుడు నారా అనే పేరు మీద బ్యాంకు ఖాతాలు ఉన్నాయని ప్రకటించారు. 

అంతేకాదు సింగపూర్ బ్యాంక్ అకౌంట్‌లో దాదాపు 15వేల కోట్ల డాలర్లు ఉన్నాయని కూడా వెల్లడించారు. మచిలీపట్నం ఎంపీ సీటు కోసం చంద్రబాబు అడిగిన రూ.5.10 కోట్ల రూపాయల్లో రూ.4 కోట్లను ఒక మధ్యవర్తి ద్వారా లండన్ మిడ్‌ల్యాండ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ 433846958001 నుంచి చంద్రబాబు సింగపూర్ బ్యాంక్ అకౌంట్ 224863490498 నంబర్‌కు బదిలీ చేసినట్లు చెప్పారు. మరో రూ.పది లక్షలు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ విజయవాడ బ్రాంచ్ నుంచి చెక్ అందజేసినట్లు తెలిపారు. అదే విధంగా కోటి రూపాయలను 1999 ఏప్రిల్ 24న వ్యక్తిగతంగా కలిసి చంద్రబాబు ఇంట్లో అందజేసినట్లు వివరించారు. 

యూరో లాటరీ కేసులో తన అరెస్టు తర్వాత ఆంధ్రప్రదేశ్ అప్పటి డీజీపీ హెచ్.జె.దొర, ఇంటెలిజెన్స్ చీఫ్ శివశంకర్‌లు కలిసి బాబుకిచ్చిన డబ్బును తక్కువ చేసి చెప్పమని బెదిరించారని కోలా ఆరోపించారు. పూర్తి వివరాలను వెల్లడిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారని చెప్పారు. పోలీసుల బెదిరింపులకు భయపడి రూ.5.10 కోట్లలో కోటి పది లక్షలు మాత్రమే బహిరంగంగా చెప్పానని తెలిపారు. చంద్రబాబు ఏడు నెలల తర్వాత విజయవాడ కోర్టుకు కేవలం పది లక్షలు మాత్రమే అప్పగించారని, బహిరంగంగా వెల్లడించిన కోటి, అంతర్గతంగా అప్పగించిన రూ.4 కోట్లను ఇప్పటి దాకా ఇవ్వలేదని కృష్ణమోహన్ చెప్పారు. తన డబ్బు ఇవ్వమని అడిగేసరికి చంపేందుకు పలుమార్లు ప్రయత్నించారని, నల్లగొండ జిల్లా చిట్యాల దగ్గర జరిగిన ఘటనను కోలా వివరించారు. ఈ ఆరోపణలపై వెంటనే విచారణ జరపాలని మనవి చేస్తున్నాం.’’
Share this article :

0 comments: