మంత్రి పార్థసారధికి 2నెలల జైలు శిక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మంత్రి పార్థసారధికి 2నెలల జైలు శిక్ష

మంత్రి పార్థసారధికి 2నెలల జైలు శిక్ష

Written By news on Wednesday, July 25, 2012 | 7/25/2012

 ఫెరా నిబంధనలు ఉల్లంఘించిన కేసులో మంత్రి పార్థసారధికి నాంపల్లిలోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు రెండు నెలల జైలు శిక్ష విధించింది. ఆయన మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న కె.పి.ఆర్‌ టెలిప్రొడక్ట్స్ కు 5 లక్షల 15 వేల రూపాయల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే పది సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాలని కోర్టు తీర్పు చెప్పింది. శిక్ష నిలుపుదల చేయాలంటూ మంత్రి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంత్రికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

దిగుమతుల సుంకం చెల్లింపు విషయంలో కె.పి.ఆర్‌ టెలిప్రొడక్ట్‌ కంపెనీ ఫెరా నిబంధనలు ఉల్లంఘించినట్లు నేరం రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పు చెప్పింది. కె.పి.ఆర్‌ టెలిప్రొడక్ట్‌ కంపెనీ 2002లో విదేశాల నుంచి కొన్ని యంత్రాలు దిగుమతి చేసుకుంది. వాటికి సంబంధించి సుంకాలు చెల్లించక పోవడంతో పాటు ఈ విషయంలో ఫెరా నిబంధనలు కూడా ఉల్లంఘించారంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్‌ కంపెనీ ఎండి హోదాలో ఉన్న పార్థసారధిపై కోర్టులో కేసు నమోదు చేసి చార్జిషీట్‌ దాఖలు చేసింది.ఈ కేసులో ఈడీ ఆరోపణలు రుజువుకావడంతో పార్థసారధికి మూడు లక్షల రూపాయలు జరిమానా విధిస్తూ 2003లో న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పటి నుంచి పార్థసారధి ఈ జరిమానా చెల్లించకపోవడంతో పాటు కోర్టు విచారణకు కూడా హాజరుకాలేదు. దీంతో ఈడి విభాగం దాఖలు చేసిన తాజా పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం పార్థసారధి ఉద్దేశ్యపూర్వకంగానే ఈడి ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారని, విచారణకు హాజరు కాకపోవడం కూడా తప్పే అని నిర్థారించి ఆయనపై రెండు రోజుల క్రితం నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. కె.పి.ఆర్‌ టెలిప్రొడక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ హొదాలో మంత్రి పార్థసారధి ఈరోజు కోర్టుకు హాజరయ్యారు.
Share this article :

0 comments: