జగన్ బెయిల్ పిటిషన్ ఉపసంహరణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ బెయిల్ పిటిషన్ ఉపసంహరణ

జగన్ బెయిల్ పిటిషన్ ఉపసంహరణ

Written By news on Tuesday, July 24, 2012 | 7/24/2012

* మంత్రులకు న్యాయ సహాయం జీవోలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం
* ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు నివేదించిన జగన్ 
* పిటిషన్ ఉపసంహరణకు అనుమతించిన ధర్మాసనం 
* త్వరలో ‘న్యాయ సహాయం’ వివరాలతో మళ్లీ పిటిషన్

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: సీబీఐ కేసులో తనకు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉపసంహరించుకున్నారు. మరింత అదనపు సమాచారాన్ని జత చేస్తూ తిరిగి బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నామని.. అందువల్ల ప్రస్తుత బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టును కోరారు. జగన్ బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, జస్టిస్ ఫక్కిర్ మహ్మద్ ఇబ్రహీం ఖలీఫుల్లాలతో కూడిన ధర్మాసనం విచారిం చింది. 

పిటిషన్ ఉపసంహరణకు జగన్ చేసిన అభ్యర్థనపై ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. పిటిషన్ ఉపసంహరణకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో వివాదాస్పదమైన 26 జీవోలకు సంబంధించి మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీనారాయణ, గీతారెడ్డి తదితరులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. వారికి న్యాయ సహాయం అందించాలని నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేసిన విషయం తెలిసిందే. జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే సమయానికి ఈ జీవోలు జారీ కాలేదు. మంత్రులకు ప్రభుత్వం న్యాయ సహాయం అందించటమంటే ఆ జీవోల జారీలో ఎటువంటి అవకతవకలు జరగలేదని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 

ఆ జీవోల జారీకి సంబంధించే తన అరెస్ట్ జరిగింది కాబట్టి.. ఇప్పుడు ప్రభుత్వమే పరోక్షంగా ఆ జీవోలు సక్రమైనవేనని చెప్తోంది కాబట్టి.. మంత్రులకు న్యాయ సహాయం విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా మంత్రులకు న్యాయ సహాయం అం దిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఆయన తన పిటిషన్‌తో జత చేసి సుప్రీంకోర్టు ముందు ఉంచనున్నారు. ఇదే సమయంలో జీవోలకు సం బంధించిన పలు వాస్తవాలను ఆయన సుప్రీంకోర్టుకు నివేదించనున్నారు. వీటన్నింటినీ సుప్రీం కోర్టు ముందుంచేందుకే జగన్ తన బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. న్యాయ సహాయం జీవోలను జత చేసి వీలైనంత త్వరలో జగన్ తిరిగి బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు.
Share this article :

0 comments: