అన్నదాత వ్యతిరేక విధానాలపై వైఎస్‌ఆర్‌సీపీ పోరు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అన్నదాత వ్యతిరేక విధానాలపై వైఎస్‌ఆర్‌సీపీ పోరు

అన్నదాత వ్యతిరేక విధానాలపై వైఎస్‌ఆర్‌సీపీ పోరు

Written By news on Friday, July 27, 2012 | 7/27/2012

‘అనంత’ కలెక్టరేట్ ముట్టడి 
నాయకుల అరెస్ట్, విడుదల

అనంతపురం, న్యూస్‌లైన్: అన్నదాతల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రైతన్నలతో కలసి గురువారం అనంతపురం కలెక్టరేట్‌ను ముట్టడించారు. పెద్దసంఖ్యలో రైతులు, పార్టీ శ్రేణులు ఈ ముట్టడిలో పాల్గొనడంతో కలెక్టరేట్ ప్రాంతం దద్దరిల్లింది. వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ శంకరనారాయణ, పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, అనంతపురం, రాయదుర్గం ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, సీఈసీ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి, పైలా నర్సింహయ్య, సీజీసీ సభ్యులు తోపుదుర్తి కవిత, గిర్రాజు నాగేష్‌తో పాటు జిల్లాలోని ముఖ్య నాయకులు తరలివచ్చారు. 

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. రైతుల గురించి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతి క్షణం ఆలోచించేవారని, ఈ ప్రభుత్వం అన్నదాతల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. వాతావరణ బీమా నిలిపివేసి పంటల బీమా అమలు చేయాలని, పీఏబీఆర్ నుంచి పది టీఎంసీల నీటిని జిల్లాకు కేటాయిస్తూ జారీ చేసిన జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరువును దృష్టిలో ఉంచుకుని ప్రతి రైతుకూ ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. హంద్రీనీవా పనులకు బడ్జెట్ కేటాయించి పొలాలకు నీరందించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలన్నారు. ప్రతి మండలంలో పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి సమస్య తీర్చాలన్నారు. సకాలంలో తుంగభద్ర నీరు వచ్చేలా చర్యలు తీసుకుని బోర్లు మరమ్మతు చేయాలన్నారు. పండ్ల తోటలకు సబ్సిడీ, ప్రోత్సాహకాలు కొనసాగించాలన్నారు. వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్‌అందించడంతో పాటు కూలీలకు పనులు కల్పించాలన్నారు. చేనేత కార్మికుల అప్పులు రద్దు చేసి కొత్త రుణా లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేతలు మాట్లాడుతుండగానే పోలీసులు బలవంతంగా వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు యత్నించారు. దీంతో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ముఖ్య నాయకులను అరెస్ట్ చేయగా.. తదుపరి సొంతపూచీకత్తుపై వారు విడుదలయ్యారు. అనంతరం జిల్లా కలెక్టర్ దుర్గాదాస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
Share this article :

0 comments: