తెలంగాణ యువకులను, విద్యార్థులను రెచ్చగొట్టి రాళ్లేయించిన వారు తమ పిల్లలను ఎందుకు బయటకు పంపరని ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలంగాణ యువకులను, విద్యార్థులను రెచ్చగొట్టి రాళ్లేయించిన వారు తమ పిల్లలను ఎందుకు బయటకు పంపరని ?

తెలంగాణ యువకులను, విద్యార్థులను రెచ్చగొట్టి రాళ్లేయించిన వారు తమ పిల్లలను ఎందుకు బయటకు పంపరని ?

Written By news on Wednesday, July 25, 2012 | 7/25/2012


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అడుగు పెడితే తమ పార్టీ తుడిచి పెట్టుకు పోతుందనే భయంతోనే టీఆర్‌ఎస్ పిచ్చి చేష్టలు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సిరిసిల్లలో చేపట్టిన నేతన్న ధర్నా సందర్భంగా టీఆర్‌ఎస్ వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. పరకాల ఉపఎన్నికల ఫలితం తరువాత టీఆర్‌ఎస్ తమ పార్టీపై దాడి చేస్తోందని ఆయన అన్నారు. వాస్తవానికి ఆ పార్టీ ఒంటెత్తు, నియంతృత్వ పోకడలే తెలంగాణ వాదాన్ని బలహీన పరుస్తున్నాయని, తెలంగాణ రావడానికి అడ్డంకి ఆ పార్టీయేనని ఆయన దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్ వైఖరి వల్ల తెలంగాణ వాదుల మధ్య చీలిక వస్తోందని, తెలంగాణ వారిపైనే తెలంగాణ వారితో దాడులు చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. ఒక రాజకీయ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ నేతన్నల సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా చేస్తే అడ్డంకులు సృష్టించడం, టీఆర్‌ఎస్ కార్యకర్తల చేత రాళ్లు వేయించడం ఏ తరహా ప్రజాస్వామ్య విలువలని గట్టు ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ సృష్టించిన ఆటంకాలన్నీ అధిగమించి విజయమ్మ ధర్నాను విజయవంతం చేసినందుకు ఆయన కరీనగర్ జిల్లా ప్రజలకు పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ వాదం అనేది టీఆర్‌ఎస్ గుత్త సొత్తు కాదని, అదొక బలీయమైన ప్రజల ఆకాంక్ష అని ఆయన అన్నారు. 

అన్ని పార్టీల్లోనూ తెలంగాణ వాదులున్నారని ఆయన పేర్కొన్నారు. నిజంగా రాష్ట్రం సాధించాలన్న తపనే ఉంటే టీఆర్‌ఎస్ అన్ని పార్టీల్లోని తెలంగాణ వాదులను కలుపుకొని తెలంగాణ ఇచ్చే కాంగ్రెస్‌పై పోరాడాలే తప్ప ఇలా సహచర ప్రతిపక్షాలపై దాడి చేయకూడదని ఆయన హితవు పలికారు. జానారెడ్డి వంటి నాయకులను కేసీఆర్ భాయ్, భాయ్ అంటూ కలుసుకుని చాయ్‌లు తాగుతూ రాజకీయం చేస్తారే తప్ప చిత్తశుద్ధితో రాష్ర్ట సాధనకు కృషి చేయరని ఆయన విమర్శించారు. తొలి నుంచీ దొరలకు నేత, గీత కార్మికులు బాగుపడటం ఇష్టముండదని, కేసీఆర్, ఆయన వెంట ఉన్న కొన్ని సామాజిక వర్గాలే బాగుపడాలన్నది ఆయన అభిమతమని గట్టు విమర్శించారు. సిరిసిల్లలో తెలంగాణ యువకులను, విద్యార్థులను రెచ్చగొట్టి రాళ్లేయించిన వారు తమ పిల్లలను ఎందుకు బయటకు పంపరని ఆయన సూటిగా కేటీఆర్‌ను ప్రశ్నించారు. ‘తెలంగాణ కోసం 700 మంది ఆత్మార్పణ చేశారని కేసీఆర్ పదే పదే చెబుతూ ఉంటారే, అసలు చనిపోయిన కుటుంబాల వారి ఇంటికి వెళ్లి ఎపుైడె నా పరామర్శించారా? అని ఆయన నిలదీశారు. విజయమ్మకు నేతన్నలు ఇపుడే గుర్తుకు వచ్చారా అని ప్రశ్నిస్తున్న కేసీఆర్‌కు తెలంగాణ వాదం 2001లోనే ఎందుకు గుర్తుకు వచ్చిందో చెప్పాలని ఆయన అన్నారు. చంద్రబాబు తనకు మంత్రి పదవి ఇవ్వనపుడు కేసీఆర్‌కు తెలంగాణ వాదం ఎందుకు గుర్తుకు వచ్చింది? అని ప్రశ్నించారు.

ఆ పత్రికలవి అబద్ధాలు

జగన్‌పై తొలి నుంచీ విషం చిమ్ముతున్న మీడియా సిరిసిల్ల సంఘటనలపై ఘోరమైన అబద్ధాలు రాసిందని గట్టు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో ఈ నెల 20న ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థులపై లాఠీ చార్జి చేసిన ఫోటోను సిరిసిల్లలో జరిగిన సంఘటనగా ఈనాడులో ప్రచురించారని ఆయన విలేకరులకు చూపించారు. ఈ పత్రిక కనీస విలువలు పాటించడం లేదన్నారు. విజయమ్మ సభలో గుడ్లు, రాళ్లు రువ్వారని ఓవైపు తమ పత్రికల్లో రాస్తూనే వైఎస్సార్ కాంగ్రెస్ గూండాలు దౌర్జన్యం చేశారంటూ వార్తలు రాయడం ఏ తరహా నీతి అని ప్రశ్నించారు. తాము పెట్టిన సభలో టీఆర్‌ఎస్ వాళ్లు రాళ్లేసి భగ్నం చేయాలని చూస్తే వైఎస్సార్ కాంగ్రెస్ వారినే గూండాలని రాస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ టీఆర్‌ఎస్ వారి సభకు తాము వెళ్లి రాళ్ళేస్తే అపుడు కూడా టీఆర్‌ఎస్ వాళ్లను గూండాలని అభివర్ణిస్తారా? గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి అని ఆయన ప్రశ్నించారు. 
Share this article :

0 comments: