మూడు నెలలకోసారి కరెంట్ షాక్! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మూడు నెలలకోసారి కరెంట్ షాక్!

మూడు నెలలకోసారి కరెంట్ షాక్!

Written By news on Saturday, July 28, 2012 | 7/28/2012

మీ ఇంట్లో కరెంట్‌ బల్బులు, టీవీ, ఫ్యాన్‌, మిక్సీ, ఫ్రిజ్‌, కూలర్‌ ఉన్నాయా....? ఏంటీ..ఇవన్నీ నిత్యజీవితంతో పెనవేసుకుపోయాంటారా..! అయితే ఈ ఉపకరణాలన్నింటికీ దూరంగా ఉండటం నేర్చుకోండి. ఇవన్నీ లేని సమాజాన్ని ఊహించుకోండి..కాదు కాదు అలవాటు చేసుకోండి. ఎందుకంటారా..మరోసారి కరెంట్‌ చార్జీలను పెంచేందుకు సర్కారు సిద్ధమవతోంది. ప్రజల నడ్డివిరిచే నిర్ణయం తర్వలోనే తీసుకోనుంది.
మరోసారి విద్యుత్‌ చార్జీలు పెంపుకు కిరణ్‌సర్కారు సిద్ధవుతోంది. అంతేకాదు ఇక నుంచి ప్రతి మూడునెలలకోసారి విద్యుత్ చార్జీలను పెంచాలని సర్కారు డిసైడైంది. ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో మరోసారి ప్రజల నడ్డివిరగ్గొట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే సెప్టెంబర్‌ నుంచి ఈ బాదుడు షురూ కానుంది.
మొదటి విడతలో2012-13 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు గానూ రూ. 1400కోట్ల భారం ప్రజలపై పడనుంది. ప్రతిపాదనలను డిస్కంలు ఇప్పటికే ERCకి సమర్పించాయి. దీనిపై ERC ఆగస్టులో బహిరంగ విచారణ చేపట్టనున్నట్టు సమాచారం. ERC పచ్చజెండా ఊపితే ఈ సెప్టెంబర్‌ నుంచే ప్రజలకు షాక్‌ తగలనుంది. యూనిట్‌కు సగటున ఒక రూపాయి ఆరుపైసల చొప్పున మూడునెలలపాటు చార్జీలు వసూలు చేస్తారు. ఆ తర్వాత 2012-13 రెండో త్రైమాసిక సర్దుబాటు చార్జీల బారం డిసెంబర్‌ నుంచి వినియోగదారులపై పడనుంది. ఇలా క్రమంతప్పకుండా ఎవ్రీ త్రీ మంథ్స్‌కు ఓ సారి ప్రజలకు షాక్‌ ఇచ్చేందుకు సర్కారు సిద్దమవుతోంది.
ఇంతటితో ఆగకుండా పాతకాలం నాటి భారాన్ని ప్రజలపై మోపేందుకు రంగం సిద్ధమవుతోంది. 2010-11,2011-12 ఆర్థిక సంవత్సరాలకు చెందిన సర్దుబాటు చార్జీలకు సంబంధించి డిస్కంలు సమర్పించిన ప్రతిపాదనలపై ERC విచారణ చేపడుతోంది. దీనికి ERC పచ్చజెండా ఊపితే ప్రజలపై మరో ఎనిమిదివేల కోట్ల రూపాయలపైగా భారం పడనుంది.
Share this article :

0 comments: