'బతుకు' పోరాటం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'బతుకు' పోరాటం

'బతుకు' పోరాటం

Written By news on Friday, July 6, 2012 | 7/06/2012

గెలుపు సంగతి కాదు, అసలు పార్టీని బతికించుకోవడంపై దృష్టి సారించాలని, దీనికి ఏంచేయాలో ఆలోచించాలని టిడిపి సీనియర్లుమథనపడుతున్నారు. ‘ఏదో అద్భుతం జరిగితేతప్ప 2014లో మేం అధికారంలోకి వచ్చే
ఆలోచించాలని టిడిపి సీనియర్లుమథనపడుతున్నారు. ‘ఏదో అద్భుతం జరిగితే తప్ప 2014లో మేం అధికారంలోకి వచ్చే
అవకాశాలు కనిపించడం లేదు. గెలుపు సంగతి తరువాత ముందు పార్టీని బతికించుకోవడంపై నాయకత్వం దృష్టి సారించాలి’ అని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనంత సంక్షోభంలోకి కూరుకుపోతున్న పార్టీ పరిస్థితి సీనియర్లకు ఆందోళన కలిగిస్తోంది. 2009 అసెంబ్లీ సాధారణ ఎన్నికల తరువాత ఇప్పటి వరకు 41 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఉపఎన్నికలు జరిగితే, వీటిలో 22 నియోజకవర్గాల్లో టిడిపికి డిపాజిట్ దక్కలేదు. పార్లమెంటు ఉప ఎన్నికలకు సంబంధించి
రెండుచోట్లా డిపాజిట్ రాలేదు. 41 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కనీసం ఒక్కటంటే ఒక్క నియోజక వర్గంలో కూడా విజయం
సాధించలేదు. పరిస్థితి ఇలావుంటే, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం, గెలుపు మనదే అంటూ మీడియా ద్వారా ప్రచారం
సాగించుకుంటున్నాం కానీ అసలు లోపం ఎక్కడుందో, ప్రజల విశ్వాసాన్ని పొందేందుకుఏం చేయాలో సరైన దారిలో ఆలోచన సాగడం లేదని సీనియర్లు వాపోతున్నారు. ఎప్పుడూ పాత ముఖాలేనా? బాబు పక్కన వాళ్లేనా? అంటూ ప్రజలు, కార్యకర్తలు విమర్శిస్తున్నారు అంటూ కొందరు సీనియర్లపై నెపం నెట్టి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారనిసీనియర్లు చెబుతున్నారు. 95నుంచి ఇప్పటి వరకు బాబు పక్కనున్నవారిలో భారీగానే మార్పులు చోటు చేసుకున్నాయి. అయినా ఎందుకు విజయం సాధించడం లేదని మాజీ మంత్రి ఒకరు ప్రశ్నించారు. 2004 ఎన్నికలఫలితాలు రాగానే ఇలాంటి ప్రచారమే జరిగిందని ఆ మంత్రి తెలిపారు. వైస్రాయ్ ప్రభాకర్‌రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లాంటి ఒకరిద్దరిని చూపించి, ఎప్పుడూ వీళ్లేనా? వీళ్లవల్లనే పార్టీ ఓడిపోయిందనే ప్రచారం సాగించారు. దాంతో మనస్తాపం చెందిన ప్రభాకర్‌రెడ్డి పార్టీ వీడి వెళ్లారు. ఇక అప్పటి నుంచి ఉమ్మారెడ్డి ప్రాధాన్యత తగ్గించారు. అయితే పార్టీ మాత్రం అధికారంలోకి రాలేదు.ఇప్పుడు మళ్లీ అదే ప్రచారం మొదలైంది.ఎప్పుడూ అవే ముఖాలేనా? అంటూ సీనియర్లు పార్టీ వీడివెళ్లారు. ఈ ప్రచారానికి భయపడి సీనియర్లు సాధ్యమైనంత వరకు దూరంగానే ఉంటున్నారు. అయినా పార్టీపరిస్థితి మెరుగు పడటం లేదు కదా? అని మాజీ మంత్రి ప్రశ్నించారు. లోపం ఎక్కడుందో
చూడకుండా నెపం ఎవరి మీద వేద్దామా? అనేప్రయత్నమే పార్టీలో ఎక్కువ సాగుతోందని సీనియర్లు చెబుతున్నారు.
1989లో టిడిపి ఓడిపోయినప్పుడు 1991తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా
టిడిపి అధికారంలోకి వస్తుందనే వాతావరణంస్పష్టంగా కనిపించింది. దానికి తగ్గట్టే1992లో కర్నూలు జిల్లాలో జరిగిన ఉప
ఎన్నికల్లో టిడిపి గెలవడంతో టిడిపి అధికారంలోకి రావడం ఖాయం అనిపించింది. కానీ ఇప్పుడు వరుసగా రెండుసార్లు
ప్రతిపక్షంలో ఉన్నా, ఒక్క ఉప ఎన్నికల్లోకూడా టిడిపి విజయం సాధించలేకపోవడంపార్టీ శ్రేణులపై తీవ్ర ప్రభావం పడింది. ప్రచారం
ద్వారా గెలుస్తామనే విశ్వాసం కలిగించడానికిప్రయత్నిస్తున్నా, పెద్దగా ప్రభావం చూపలేకపోతోందని పార్టీ నాయకులు
చెబుతున్నారు. తెలంగాణ సమస్య వల్ల తెలంగాణలో పార్టీ కోలుకునే పరిస్థితులుకనిపించడం లేదని, దాంతో తెలంగాణ ఉప
ఎన్నికల్లో డిపాజిట్ వస్తే విజయంసాధించినంత సంబరపడాల్సి వస్తోందనిసీనియర్లు అంటున్నారు. 18నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోఐదుచోట్ల డిపాజిట్ గల్లంతయింది. నెల్లూరు పార్లమెంటు, అంతకు ముందు జరిగిన కడప పార్లమెంటు నియోజక వర్గంలోనూ టిడిపికి డిపాజిట్ దక్కలేదు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. ఈ రెండు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టిడిపికి డిపాజిట్‌కు సరిపడా ఓట్లు రాలేదు.తెలంగాణలోనే కాకుండా సీమాంధ్రలో సైతం పరిస్థితి ఇలానే ఉండటం పార్టీ నాయకులుతట్టుకోలేపోతున్నారు. ఇంత జరిగిన తరువాత కూడా మళ్లీ పార్టీ నాయకత్వం ప్రచారం మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నట్టుగా కనిపిస్తోందని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు ఆవేదనతో వ్యాఖ్యానించారు.

source: andhrabhoomi
Share this article :

0 comments: