రైతు సమస్యలపై వైఎస్ఆర్ సీపీ పోరు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతు సమస్యలపై వైఎస్ఆర్ సీపీ పోరు

రైతు సమస్యలపై వైఎస్ఆర్ సీపీ పోరు

Written By news on Thursday, July 26, 2012 | 7/26/2012

రైతుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు గురువారం అనంతపురం జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలను అరికట్టాలని, కొరత లేకుండా ఎరువుల పంపిణి చేయాలని పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ ముట్టడిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గుర్నాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు విశ్వేశ్వర్‌రెడ్డి, కవిత, అనంత జిల్లా కన్వీనర్‌ శంకర్‌ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: