నేతన్నలకు అండగా ఉంటాం: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేతన్నలకు అండగా ఉంటాం: విజయమ్మ

నేతన్నలకు అండగా ఉంటాం: విజయమ్మ

Written By news on Monday, July 23, 2012 | 7/23/2012

సిరిసిల్ల: కేంత్ర ప్రభుత్వ విధానాలతో రైతులు, చేనేత కార్మికులు అల్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు విజయమ్మ ఈరోజు ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దేశంలో రైతన్నలు ప్రథమ స్థానంలో ఉంటే, నేతన్నలు ద్వితీయ స్థానంలో ఉంటారని, అది జగమెరిగిన సత్యమన్నారు. నేడు రైతులు క్రాప్ హాలిడే ప్రకటించవలసి పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. నూలు ధరలు, పాలిస్టర్ దారం ధరలు బాగా పెరిగిపోయాయన్నారు. దాంతో నేత కార్మికులకు ఉపాధి లభించని పరిస్థితి ఏర్పడిందన్నారు. సిరిసిల్లలోని నేతన్నలను ఓదార్చమని జగన్మోహన రెడ్డి చెబితే తాను ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. త్వరలోనే జగన్ ముఖ్యమంత్రి అయి సువర్ణ యుగం తీసుకువస్తారన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఆప్పుడు చేనేత కార్మికుల కోసం జగన్ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని చెప్పారు.

చేనేత వస్త్రాలంటే రాజశేఖర రెడ్డికి ఇష్టం అని తెలిపారు. ఖద్దరు దుస్తులు ధరించాలన్న గాంధీ ఆశయాన్ని నేటి నేతలు మరిచిపోయారన్నారు. రాజశేఖర రెడ్డి చేనేత దుస్తులనే ధరించేవారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఒక రోజు చేనేత దుస్తులు ధరించాలని కూడా జిఓ తీసుకువచ్చారని గుర్తు చేశారు. చేనేతలకు అత్యధికమందికి రాజశేఖర రెడ్డి గారే పెన్షన్ ఇచ్చారని తెలిపారు. ఆప్కో ఆదాయం పెరిగింది రాజశేఖర రెడ్డి హయాంలోనేనని తెలిపారు. సిరిసిల్లలో 5వేల మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చారన్నారు. టెక్స్ టైల్ పార్కు కోసం ఆయన భూములు కేటాయిస్తే, వాటిని కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చారని తెలిపారు. నేతన్నలను ఆదుకున్న నేత వైఎస్ఆర్ అని చెప్పారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలను ఈ ప్రభుత్వం అమలు చేయలేకపోతుందన్నారు.

ప్రభుత్వం తన ఖజానా నింపుకోవడానికి పన్నులు, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు పెంచివేసిందని విమర్శించారు. రాజశేఖర రెడ్డి హయాలో ఒక్క పైసా పన్ను కూడా పెంచలేదని గుర్తు చేశారు. ప్రతి పేదవాటి మొఖంలో చిరునవ్వు ఉండాలనేది ఆయన ఆశించారన్నారు. జగన్ త్వరలోనే బయటకు వస్తారని, ముఖ్యమంత్రి అవుతారని, చేనేత కార్మికుల సమస్యలను రిష్కరిస్తారని చెప్పారు. తనను ఆప్యాయంగా ఆహ్వానించినందుకు సిరిసిల్ల వాసులకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు
Share this article :

0 comments: