వైఎస్సార్ కు నివాళి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ కు నివాళి

వైఎస్సార్ కు నివాళి

Written By news on Sunday, July 8, 2012 | 7/08/2012

ఇడుపులపాయ: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్‌ఆర్‌ సమాధిస్థలి దగ్గర అంజలి ఘటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. ఉద్వేగానికి లోనయిన విజయమ్మ, షర్మిల కంటతడిపెట్టారు. ప్రార్థనల్లో మహానేత వైఎస్‌ఆర్‌ సేవల్ని స్మరించుకున్నారు. రాజశేఖరరెడ్డి చెరగని చిరునవ్వును గుర్తు చేసుకున్నారు. 

సమాధి స్థలి దగ్గర ప్రార్థనల తర్వాత కుటుంబ సభ్యులంతా ఘాట్‌ ప్రాంగణంలో ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని సందర్శించారు. విగ్రహానికి పుష్పమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వైఎస్ విజయమ్మ, షర్మిల బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ భారతి, వైఎస్ పురుషోత్తంరెడ్డి, ఈసీ గంగిరెడ్డి, కమలమ్మ, విమలమ్మ తదితరులు వైఎస్సార్ కు నివాళులర్పించారు.



ఇడుపులపాయ: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి జయంతి సందర్భంగా ఆయన సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిల రక్తదానం చేశారు. వైఎస్సార్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో వీరు రక్తదానం చేశారు. అంతకుముందు తాడిపత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ వి.ఆర్.రామిరెడ్డి ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ ను వైఎస్ విజయమ్మ ప్రారంభించారు.


అనంతపురం: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గుర్నాదరెడ్డి, జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కేక్ కట్‌ చేశారు. రైతు సమస్యలపై వైఎస్ఆర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. డి.ఇరేహల్ మండలంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నివాళులుర్పించారు. రాయదుర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహానేత ఫోటోకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. రాయదుర్గంలో ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు అందజేశారు. 

కదిరిలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన వైఎస్ఆర్‌ సీపీ నేతలు ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఉత్తరంపేట గ్రామస్తులు వైఎస్‌ఆర్ ఘాట్ సందర్శించేందుకు తరలివెళ్లారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి సోమశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కొత్తచెరువులో పేద మహిళలకు చీరల పంపిణీ, అన్నదానం చేశారు. కొత్త చెరువులో మాజీ ఎమ్మెల్యే కడపల మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 





కరీంనగర్: ప్రజా జీవితంలో వైఎస్సార్ లాంటి నేతను మళ్లీ చూడలేమని రాష్ట్ర మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఎస్సీ బాలుర హాస్టల్‌లో ఆయన కేక్‌ కట్ చేశారు. మరోవైపు వైఎస్సార్ సీపీ కరీంనగర్ జిల్లా కన్వీనర్ కట్ట శివ ఆధ్వర్యంలో సబ్‌జైల్లో ఖైదీలకు పండ్లు పంపిణీ చేశారు. వైఎస్సార్ సీపీ గొల్లపల్లి మండల కన్వీనర్ ఎల్లంకి రమేష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. గోదావరిఖనిలో వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పేదలకు వైఎస్సార్ సీపీ నేతలు పండ్లు, స్వీట్లు పంచారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. యూత్ జిల్లా కన్వీనర్ మహేందర్ ఆధ్వర్యంలో పుట్టా మధు పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఎన్‌సీపీ జిల్లా అధ్యక్షులు నర్సయ్య వైఎస్‌ఆర్ సీపీలో చేరారు.


తిరుపతి: వైఎస్ఆర్ తీపి గుర్తులను చెరిపివేయడానికి కాంగ్రెస్‌ కుట్రపన్నుతోందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, కాంగ్రెస్ కార్యాలయాల్లో వైఎస్ బొమ్మలు తీసివేయొచ్చుగానీ, ప్రజల హృదయాల్లోంచి తొలగించలేరన్నారు. జగన్ కడిగిన ముత్యం, ఇందుకు ఉపఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు. వైఎస్‌ ఆశయాలు కొనసాగించే ఏకైక వ్యక్తి జగనేనని అన్నారు.


న్యూఢిల్లీ: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ నేత మారెప్ప విమర్శించారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఆయన హెచ్చరించారు. ఏపీ భవన్‌ ప్రాంగణంలో వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు నిర్వహించిన వైఎస్‌ఆర్ జయంతి వేడుకల్లో మారెప్ప పాల్గొన్నారు.


ఇడుపులపాయ: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధిని దర్శించుకునేందుకు వచ్చిన జనంతో ఇడుపులపాయ జనసంద్రమయ్యింది. వైఎస్‌ అభిమానులతో పోటెత్తింది. మహానేత లేని లోటు మరవలేమని, ఆయన పథకాలు అమలుకు నోచుకోవాలంటే జగన్ వల్లే సాధ్యమని వారు అంటున్నారు. వైఎస్ జయంతి సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన అశేష అభిమానులు మహానేతకు మనసారా నివాళులు అర్పించారు.



హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, వైవి.సుబ్బారెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహానికి ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పాలాభిషేకం చేశారు. యువజన విభాగం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.


కాకినాడ: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తునిలో తాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. అనపర్తిలో డాక్టర్ సత్యసూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ, బీసీ హాస్టల్లో విద్యార్థులకు స్వీట్లు పంచారు. పొలమూరులో వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి, కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్‌ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

ఏలేశ్వరంలో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కొత్తపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వైఎస్ఆర్ విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పూలమాలలు వేశారు. రాజమండ్రి క్వారీ సెంటర్‌లో వైఎస్‌ఆర్ జయంతి వేడుకులు ఘనంగా నిర్వహించారు. వైఎస్‌ఆర్ విగ్రహానికి మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాలాభిషేకం చేశారు. కాకినాడలోని బాలాజీ చెరువు సెంటర్‌లో మహానేత విగ్రహం వద్ద నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి నివాళులు అర్పించారు.




Share this article :

0 comments: