ఘనంగా వైఎస్ జయంతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఘనంగా వైఎస్ జయంతి

ఘనంగా వైఎస్ జయంతి

Written By news on Monday, July 9, 2012 | 7/09/2012

ఇడుపులపాయలో వైఎస్ విజయమ్మ, షర్మిల రక్తదానం
భారీగా నిర్వహించిన అభిమానులు,వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు
రాష్ట్రవ్యాప్తంగా రక్తమిచ్చిన 25 వేల మంది
పావురాలగుట్టకు తరలి వచ్చిన జనం

న్యూస్‌లైన్ నెట్‌వర్క్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 63వ జయంతి కార్యక్రమం ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఏ కూడలికి ఆ కూడలిలో వైఎస్ విగ్రహం వద్ద ప్రజలు స్వచ్ఛందంగా గుమికూడి నివాళులర్పించారు. పలుచోట్ల మహానేత ఫొటోకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. లౌడ్‌స్పీకర్లలో వైఎస్ పాటలు, ప్రసంగాలు పెట్టుకుని మహానేతను స్మరించుకున్నారు. వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు ఎక్కడికక్కడ.. అన్నదానాలు, రక్తదానాలు సహా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద విజయమ్మ, షర్మిల, కోడలు భారతి, అల్లుడు బ్రదర్ అనిల్‌కుమార్ సహా కుటుంబసభ్యులు వైఎస్‌కు నివాళులర్పించారు. 

అక్కడ అనంతపురం జిల్లాకు చెందిన అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో విజయమ్మ, షర్మిల కూడా రక్తదానం చేశారు. మరోవైపు జయంతి సందర్భంగా నివాళులర్పిం చేందుకు పలుప్రాంతాల నుంచి ఇడుపులపాయకు పెద్ద ఎత్తున అభిమానులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలివచ్చారు. వారిని వైఎస్ విజయమ్మ ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ మృతిచెం దిన పావురాలగుట్టకు ఆత్మకూరు, కరివేన, ప్రకాశం జిల్లా దోర్నాల, తదితర ప్రాం తాల నుంచి అభిమానులు తరలివచ్చి మహానేతకు ఘనంగా నివాళులర్పించారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జయంతి

హైదరాబాద్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జయంతి భారీ ఎత్తున జరిగింది. కార్యాలయం ఆవరణలోని వైఎస్ విగ్రహానికి పార్టీనేతలు, కార్యకర్తలు నివాళులర్పించారు.‘వైఎస్సార్ అమర్‌హై, జై జగన్’ నినాదాల నడుమ నెల్లూరు ఎంపీ, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాలతో శ్రద్ధాం జలి ఘటించారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, ముఖ్య నేత ఎస్. రామకృష్ణారెడ్డి,రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్యేలు భూమా శోభా నాగిరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, పార్టీ ఎస్సీవిభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్ సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ యువజన విభాగం నిర్వహిం చిన రక్తదాన శిబిరంలో అధ్యక్షుడు పుత్తా ప్రతాపరెడ్డి, పార్టీ సీఈసీ సభ్యుడు రాజ్ ఠాకూర్,మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి రక్తాన్ని ఇచ్చారు. తలసీమియా సొసైటీ కోసం నిర్వహించిన ఈ శిబిరంలో 368 మంది పాల్గొని రక్తం ఇచ్చారని కో-ఆర్డినేటర్ బి.మోహన్ తెలిపారు. వైఎస్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 25 వేల మంది రక్తదానం చేశారని పుత్తా ప్రతాపరెడ్డి చెప్పారు.

సీఎం పదవికి అర్థం వైఎస్: ఎంపీ మేకపాటి

ముఖ్యమంత్రి అనే పదవికి అర్థం, పరమార్థం, తాత్పర్యంగా నిలిచిన వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డేనని, అందుకే ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయారని మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు. జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ ముఖ్యమంత్రీ చేయనన్ని కార్యక్రమాలను వైఎస్ చేపట్టారని అన్నారు. వైఎస్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయకపోవడంపై విలేకరులు ప్రశ్నించగా.. వాళ్లు చేసినా చేయకపోయినా.. ప్రజలు చేసుకుంటున్నారు కదా అని బదులిచ్చారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విజయమ్మనుఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు, ‘సాక్షి’పత్రికపై చేస్తున్న విమర్శలను ప్రస్తావించగా ఆయన ఎందుకలా మాట్లాడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు.‘అసలు రాజగోపాల్ బాధ ఏమిటి? ఆయన బాధేమిటో మాకు అర్థం కావటల్లేదు. ఆయన ఎవరి మెప్పు కోసమో అతిగా మాట్లాడుతున్నారు. ఆ మాటలు నిజంగా ఆయన హృదయంలో నుంచి వచ్చినవని నేను అనుకోవడం లేదు. పోనీ లెండి.. పాపం ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. మాట్లాడుకోనీయండి’ అని రాజమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

జగన్ జైల్లో ఉన్నందుకు బాధగా ఉంది: శోభ

తండ్రి జయంతి రోజున వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో ఉండటం తమకు బాధ గా ఉందని పార్టీ శాసనసభా పక్ష ఉపనాయకురాలు భూమా శోభానాగిరెడ్డి అన్నారు. జగన్ ప్రజల మధ్య లేని లోటును తీర్చేందుకు వైఎస్ విజయమ్మ ఎపుడూ సిద్ధంగా ఉంటారని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్ జయంతిని కాంగ్రెస్ వారు అధికారికంగా జరపకపోవడం గర్హనీయమని ఆమె విమర్శించారు.

వైఎస్ ప్రేమించే రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారు: బాజిరెడ్డి

వైఎస్‌కు ఎంతో ఇష్టమైన రైతులను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసిందని, జనాభాలో 70 శాతం మంది ఉన్న రైతాంగం ఇబ్బందులు అందరికీ తెలిసినా స్పందన లేదని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్దన్ విమర్శించారు. తమ నాయకుడు జగన్ రైతుల ఇబ్బందులు ఎన్ని సార్లు ప్రభుత్వ దృష్టికి తెచ్చినా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. 

జగన్ లేక పోవడం బాధ కలిగిస్తోంది: జూపూడి

వైఎస్ జయంతి రోజున జగన్ జైలు గోడల మధ్య గడపాల్సి రావడం తామందరికీ బా ధాకరంగా ఉందని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు అన్నారు. కొత్త పార్టీని ఏర్పాటు చేసి తమకు ఛాలెంజ్‌గా మారారన్న అసూయతో కాంగ్రెస్, టీడీపీ కుట్రపన్ని జగన్‌ను జైలుకు పంపాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి నచ్చడం లేదు: ఎమ్మెల్యే మేకపాటి

వైఎస్ సంక్షేమ పథకాలు ప్రజలకు బాగా నచ్చాయని, అయితే రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం నచ్చలేదని, అందుకే వాటికి తూట్లు పొడుస్తున్నారని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ మరణించాక ఆయన పేరుతో స్మృతి వనాలు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకూ ఆ పని ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ రెండూ జగన్‌ను వేధిస్తున్నాయని, అందుకే ప్రజలు ఉప ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని ఆయన అన్నారు.
Share this article :

0 comments: