రిలయన్స్‌పై సెబీకి ఫిర్యాదు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రిలయన్స్‌పై సెబీకి ఫిర్యాదు!

రిలయన్స్‌పై సెబీకి ఫిర్యాదు!

Written By news on Wednesday, July 11, 2012 | 7/11/2012

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) వ్యవహారంపై దర్యాప్తు చేయాలని రిటైర్డు ఐఏఎస్ అధికారి, ఫోరం ఫర్ బెటర్ విశాఖ (ఎఫ్‌బీవీ) కన్వీనర్ ఈఏఎస్ శర్మ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ)ను కోరారు. ఈ మేరకు సెబీ చైర్మన్ యూకే సిన్హాకు కొద్దిరోజుల కిందట ఆయన ఫిర్యాదు చేశారు. కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లో గ్యాసు నిల్వలు తక్కువగా ఉన్న విషయాన్ని మదుపుదార్లకు చెప్పకుండా దాచిపెట్టడం వల్ల జరిగిన నష్టంపై దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. కేజీ బేసిన్‌లోని డీ-6 క్షేత్రంలో గ్యాసు నిల్వలు ముందస్తు అంచనాల కంటే 80 శాతం తక్కువగా ఉన్నాయని రిలయన్స్ భాగస్వామ్య సంస్థ (జాయింట్ వెంచర్-జేవీ) కెనడాకు చెందిన ‘నికో’ కొద్దిరోజుల క్రితం వెల్లడించిన విషయం తెలిసిందే. జేవీలో నికోకు 10 శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్‌ఐఎల్ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ఆయన సిన్హాను కోరారు. ఆయన ఫిర్యాదులోని ముఖ్యాంశాలు....

కేజీ బేసిన్‌లో గ్యాసు నిల్వలు అధికంగా ఉన్నాయని రిలయన్స్ చెప్పిన లెక్కల ఆధారంగా షేర్లు కొన్న మదుపుదార్లకు తాజా అంచనాలతో వాటిల్లిన నష్టమెంత?

లేని గ్యాసు నిల్వలను ఎక్కువ చేసి చూపించడం ద్వారా షేర్ విలువను రిలయన్స్ పెంచుకుంది. తద్వారా పెరిగిన షేర్ విలువ ఆధారంగా లావాదేవీలు జరిగాయి. ఈ లావాదేవీలపై లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. 
నికో సంస్థ నివేదిక నిజమైతే... ఈ మొత్తం వ్యవహారంపై రిలయన్స్‌పై సెబీ ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది? 
ఈ మూడు అంశాలపై లోతైన దర్యాప్తు జరపాలని శర్మ కోరారు.
Share this article :

0 comments: