177 పేజీలు, 14 మందిపై 4వ చార్జీ షీటును నాంపల్లి ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన సీబీఐ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 177 పేజీలు, 14 మందిపై 4వ చార్జీ షీటును నాంపల్లి ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన సీబీఐ

177 పేజీలు, 14 మందిపై 4వ చార్జీ షీటును నాంపల్లి ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన సీబీఐ

Written By news on Monday, August 13, 2012 | 8/13/2012

వాన్ పిక్ భూముల సేకరణ కేసులో సిబిఐ ఛార్జీషీట్ దాఖలు చేసింది. ఇందులో కొత్తగా అప్పటి రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావులతో పాటు సీనియర్ ఐ ఎ ఎస్ అధికారులు శ్యామ్యూల్,మన్మోహన్ సింగ్ ల పేర్లు కూడా ఉన్నట్లు కదనాలు వస్తున్నాయి. జగన్ ,విజయసాయిరెడ్డి,నిమ్మగడ్డ ప్రసాద్, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణరావులను కీలక నిందితులుగా సిబిఐ పేర్కొన్నట్లు చెబుతున్నారు. వీరు కీలకమైన నిందితులైతే మిగిలిన వారు సహకరించిన నిందితులుగా భావించినట్లు కనబడుతోంది. వీరివల్ల కేసు విచారణకు ఆటంకం లేదని సిబిఐ భావించి వారిని అరెస్టు చేయలేదని అనుకోవాలి. అయితే ఇకనైనా ఈ కేసుకు సంబంధించి మోపిదేవి,నిమ్మగడ్డ ప్రసాద్ లకు బెయిల్ వచ్చే అవకాశం మెరుగుపడుతుందని ఆశించవచ్చేమో తెలియదు. ఎందుకంటే సిబిఐ ఒక ఛార్జీ షీట్ వేసిన తర్వాత కూడా ఇంకా దర్యాప్తు సాగతీత ధోరణి అనుసరిస్తోంది.ఈ కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు చేర్చడంతో ఇప్పుడు ఆయన ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయితే ఆయనను ఎలాగూ అరెస్టు చేయలేదు కాబట్టి , కేసు రుజువయ్యే వరకు మంత్రి పదవి లో ఉండవచ్చని కాంగ్రెస్ చెప్పవచ్చు. లేదా పరిస్థితి బాగోపోతే ధర్మాన పదవి కోల్పోవచ్చు.కాంగ్రెస్ నేతలు కేసులు పెట్టినప్పుడు అదేదో జగన్ మాత్రమే చుట్టుకుంటుందని అనుకున్నారు. ఇప్పుడు అవి వారి మెడకు కూడా చుట్టుకుని విలవిలలాడుతున్నారు.


Share this article :

0 comments: