విజయమ్మకు బీసీ నేతల అభినందన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయమ్మకు బీసీ నేతల అభినందన

విజయమ్మకు బీసీ నేతల అభినందన

Written By news on Wednesday, August 22, 2012 | 8/22/2012


పులివెందుల(వైఎస్‌ఆర్‌జిల్లా), న్యూస్‌లైన్: బీసీల అభ్యున్నతికి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మకు అభినందనలు వెల్లువెత్తాయి. మంగళవారం పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ఆర్ జిల్లా, అనంతపురం జిల్లాలకు చెందిన బీసీ సంఘాల నేతలు ఆమెను ఘనంగా సన్మానించారు. వైఎస్ హయాంలో బీసీలకు పెద్దపీట వేశారని.. ప్రస్తుతం బీసీలకు అసెంబ్లీలో వంద సీట్లు కేటాయిస్తామంటూ విజయమ్మ హామీ ఇచ్చిన నేపథ్యంలో మేమంతా రుణపడి ఉంటామంటూ వారు ప్రమాణం చేశారు. ముందుగా పూల బొకేలను అందించిన వారు తర్వాత మహిళా నాయకుల ద్వారా శాలువా కప్పి సన్మానించారు. ధర్మవరం చేనేతలు తయారు చేసిన పట్టుచీరను బహూకరించారు.

వైద్యశాలలా...రోగశాలలా?: విజయమ్మ

రాష్ట్రంలోని వైద్యశాలలు రోగశాలలుగా మారాయని వైఎస్ విజయమ్మ విమర్శిం చారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో పసిపిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. రుయా ఆస్పత్రి దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వైద్యశాలల మెరుగుకోసం పోరాడతామని చెప్పారు. రాష్ట్రంలో పరిపాలన అధ్వానంగా తయారైందని, ప్రజలు ఎదుర్కొనే ప్రతి సమస్యపై వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు స్పందించి పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. 

పోస్టర్ల ఆవిష్కరణ: ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద మంగళవారం మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పోస్టర్లను ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ ఆవిష్కరించారు. సెప్టెంబర్ 2న మహానేత మూడోవర్ధంతిని పురస్కరించుకుని చేపట్టనున్న కార్యక్రమాల నేపథ్యంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి రూపొందించిన పోస్టర్లను వైఎస్ సమాధి వద్ద ప్రజల సమక్షంలో వైఎస్ విజ యమ్మ ఆవిష్కరించారు. వైఎస్‌ఆర్ వికలాంగుల సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.పి.నరసింహుడు ఆధ్వర్యంలో చేపట్టిన వికలాంగుల దండయాత్ర పోస్టర్‌ను విజయమ్మ పులివెందులలో ఆవిష్కరించారు. ఈనెల చివరినుంచి నవంబర్ నెలవరకు అన్ని జిల్లాల్లో 12 మంది వికలాంగుల బృందం పర్యటిస్తుందని సమితి అధ్యక్షుడు ఈ సందర్భంగా తెలిపారు.
Share this article :

0 comments: