విద్యుత్ ధర్నాలో పాల్గొన్న విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » విద్యుత్ ధర్నాలో పాల్గొన్న విజయమ్మ

విద్యుత్ ధర్నాలో పాల్గొన్న విజయమ్మ

Written By news on Wednesday, August 29, 2012 | 8/29/2012

పులివెందుల : కరెంటు కోతలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ బుధవారం పులివెందుల నియోజకవర్గంలో ధర్నా చేపట్టింది. నియోజకవర్గంలోని సింహాద్రిపురం, వేంపల్లె, పులివెందుల మండలాల్లోని సబ్ స్టేషన్ల వద్ద ఆందోళనకు దిగింది. వేంపల్లె సబ్ స్టేషన్ వద్ద చేపట్టిన ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు,పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ఏడు గంటలు కరెంటు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా అయిదు గంటలు కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. దాదాపు రెండు, మూడు నెలలుగా కోతలు పెడుతూ వినియోగదారులతో విద్యుత్ అధికారులు చెలగాటమాతున్నారని విజయమ్మ మండిపడ్డారు. పంచాయతీల్లో కనీసం వీధిలైటు వెలిగే పరిస్థితి కూడా లేదన్నారు. విద్యుత్ కోతలపై పరిశ్రమలన్నీ మూతపడే దుస్థితి నెలకొందన్నారు. అదనపు విద్యుత్ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే బాధ్యత ప్రభుత్వంపై ఉందని విజయమ్మ అన్నారు.
Share this article :

0 comments: