విజయమ్మ పలకరింపు కోసం.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయమ్మ పలకరింపు కోసం..

విజయమ్మ పలకరింపు కోసం..

Written By news on Wednesday, August 15, 2012 | 8/15/2012

అమ్మను దగ్గర నుంచి చూడాలని..ఆమెతో కరచాలనం చేయాలని..పలకరించి కష్టసుఖాలు చెప్పుకోవాలన్న తపన అక్కడ ప్రతి ఒక్కరిలో కన్పించింది. చిన్నారుల నుంచి ముదుసలి వరకు మహానేత సతీమణిని చూసేందుకు ఉవ్విళ్లూరారు. బారులు తీరి అమ్మను పలకరింపుతో పులకించారు. 

ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరుతూ ఏలూరులో రెండ్రోజులు దీక్ష చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మపై ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల ప్రజలు అవ్యాజమైన ప్రేమాభిమానాలు కురిపించారు. వారు చూపిన ఆప్యాయాతానురాగాలకు విజయమ్మ పరవ శించిపోయారు. దీక్షతో విజయమ్మ అలసటకు గురైనా ఏ మాత్రం పట్టించుకోలేదు. తనను చూసేందుకు వచ్చిన ప్రతి ఒక్కర్ని ఆప్యాయంగా పలకరిస్తూ, యోగ క్షేమాలు అడుగుతూ దీక్షను కొనసాగించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువకులు ఆమె కరచాలనం కోసం ఎగబడ్డారు. అదేరీతిలో మహిళలు, వృ ద్ధులు, వికలాంగులు, కార్మికులు, కర్షకులు దీక్షా వేదిక వద్దకు దూసుకొస్తుంటే వారిని నిలువరిం చడానికి ఒకదశలో పార్టీ శ్రేణులకు కష్టమైంది. 

మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం దీక్ష ముగిసే వరకు దీక్ష స్థలి వద్ద విద్యార్థి లోకం కదం తొక్కింది. ఏలూరుతో పాటు జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు ఏలూరు తరలివచ్చారు. తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి చేయందించి విజయమ్మ చిరునవ్వుతో పలకరించారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఏలా ఉన్నారు? ఏం చదువుతున్నారు? ఫీజు రీయింబర్స్‌మెంట్ అందుతుందా? అంటూ విద్యార్థులను ఆమె పలకరించిన తీరు ఆకట్టుకుంది. విజయమ్మ ఆటోగ్రాఫ్‌లు తీసుకుని వి ద్యార్థులు ఆనందపడ్డారు. తామంతా మద్దతుగా ఉంటామని నినదించారు.

ఆభాగ్యులం.. ఆదుకోండి
భీమడోలు, చింతలపూడి : విజయమ్మను నగరంలోని శ్రీ రవితేజ ఎడ్యుకేషనల్ సంక్షేమ సొ సైటీ కి చెందిన హెచ్‌ఐవీ బాధిత చిన్నారులు కలి శారు. చిన్నారులను ఆదుకోవాలని సంస్థ అధినే త ఐకా రాజు ఆమెను కోరారు. సొసైటీకి అండ గా ఉంటానని విజయమ్మ భరోసా ఇచ్చారు.
Share this article :

0 comments: