కాంగ్రెస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ?

కాంగ్రెస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ?

Written By news on Tuesday, August 14, 2012 | 8/14/2012

యువనేత రాహుల్ గాంధీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ను ఉద్దేశించి చేసినట్లు వచ్చిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. కాంగ్రెస్ ను జగన్ లాంటి వ్యక్తులు ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మార్చారని అన్నట్లు ఒక పత్రికలో కధనం వస్తే, జగన్ పార్టీ ఓ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ అన్నట్లు మరో పత్రికలో రాశారు. ఎలా అన్నప్పట్టికీ జగన్ ను ఉద్దేశించి బిసి నేతలు నారగోని తదితరుల వద్ద ప్రస్తావించడం గమనించదగిన అంశం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని ఆయన గమనించాలి. అసలు కాంగ్రెస్ ఐనే ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా అనుకోవాలి. లేకుంటే రాహుల్ గాందీకి ఇంత ప్రాముఖ్యత ఎలా వస్తుంది. గత కొంతకాలంగా ఆయన ఎక్కడ బాధ్యతలు స్వీకరిస్తే అక్కడ పరాజయపరాభావాలను కాంగ్రెస్ ఎదుర్కోవలసి వచ్చింది. అయినప్పట్టికీ కాంగ్రెస్ నేతలు రాహుల్ ప్రధాని కావాలని ఎందుకు అంటున్నారు? స్వయంగా ప్రధాని మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో చేరాలని పిలుపు ఇస్తున్నారు. కొన్ని కుటుంబాల చేతిలో పార్టీ కేంద్రీకృతమైందన్న వాదన ఆయన కుటుంబానికి కూడా వర్తిస్తుంది కదా?అసలు సీతారామ్ కేసరి నుంచి సోనియాగాంధీ ఏ స్థితిలో పగ్గాలో చేపట్టారో ఒకసారి చరిత్రలోకి రాహుల్ వెళితే మంచిది. తమది కూడా అదే బాపతు అని ఆయనకు బాగా తెలుస్తుంది. అంతేకాదు.1969లో కాంగ్రెస్ అభ్యర్ధిని కాదని పోటీ అభ్యర్ధిని పెట్టి ఇందిరగాంధీ ఎలా కాంగ్రెస్ ను ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మార్చారో కూడా ఆయన తెలుసుకుంటే ఇంకా మంచిది. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలుగా మార్చినంతమాత్రాన ఇందిరాగాంధీ, సోనియాగాంధీ లు అన్నీ తప్పులు చేశారని అనడం లేదు. కాకపోతే జగన్ ఒక్కరిదే ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ అని రాహుల్ అన్నట్లు వచ్చిన వార్తలు చదువుతుంటే , కాంగ్రెస్ మాత్రం అందుకు భిన్నంగా ఉందా అన్న ప్రశ్న ఎదురవుతుంది.
Share this article :

0 comments: