కరెంట్ ‘కోతల’పై ఆగ్రహం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కరెంట్ ‘కోతల’పై ఆగ్రహం

కరెంట్ ‘కోతల’పై ఆగ్రహం

Written By news on Friday, August 24, 2012 | 8/24/2012

వైఎస్సార్సీపీ, ఏఐటీయూసీల ఆధ్వర్యంలో ఆందోళనలు 
సబ్ స్టేషన్ల ముట్టడి, ధర్నాలు, రాస్తారోకోలు

న్యూస్‌లైన్ నెట్‌వర్క్: విద్యుత్ కోతలపై ఆగ్రహం వెల్లువెత్తుతోంది. వేళాపాళాలేని కోతలతో ప్రజలను ఇక్కట్ల పాల్జేస్తున్న ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గురువారం పలు జిల్లాల్లో ధర్నాలు జరిగాయి.అనంతపురంలోని ఎలక్ట్రిసిటీ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీ పీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ప్రధాన ద్వారం గేట్లు మూసివేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోతలువెంటనే ఎత్తివేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏడీఈ లక్ష్మీనారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు.రాజమండ్రి వై జంక్షన్ వద్ద ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం రాత్రి కాగడాల ప్రదర్శన జరిగింది.ముమ్మిడివరంలో వివిధయువజన సంఘా ల ఆధ్వర్యంలో ప్రదర్శన, సబ్ స్టేషన్ ఎదుట 216 జాతీయ రహదారిపై రాస్తారోకోచేశారు.అంబాజీపేట కొబ్బరి ఆయిల్ మిల్లర్స్ యూనియన్ విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన తెలిపిం ది.ఏలేశ్వరం ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద వ్యవసాయ కూలీ సంఘం ప్రదర్శన, ధర్నా నిర్వహించింది. పెద్దాపురంలో టీడీపీ కార్యకర్తలు రాస్తారోకో చేసి, సబ్‌స్టేషన్‌ను ముట్టడిం చారు. 

జగ్గంపేటలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఇతర సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన చేసి, ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాకినాడలోని కుళాయిచెరువు వద్ద ఉన్న సబ్ స్టేషన్‌వద్ద భవననిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహిం చారు. సామర్లకోటలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రదర్శన,ధర్నా నిర్వహించారు. విద్యుత్ కోతను నిరసిస్తూ శంఖవరం విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆర్‌అండ్‌బీ రోడ్డుపై దళితులు బైఠాయించారు. కరీంనగర్‌జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు సబ్‌స్టేషన్ అద్దాలు, కుర్చీలను రైతులు ధ్వంసం చేశారు. రికార్డులను చిందరవందర చేసి కొత్తగట్టు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. తాడికల్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి కరీంనగర్-వరంగల్ రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మల్లాపూర్ మండలం కొత్తదాం రాజ్‌పల్లి, పెద్దపల్లి మండలం రాఘవపూర్‌లో సబ్‌స్టేషన్లను ప్రజలు ముట్టడించారు. రామడుగులో రాస్తారోకో నిర్వహిం చగా, మల్యాల మండలం ఓబులాపూర్‌లో విద్యుత్ వసూలుకు వచ్చిన సిబ్బందిని గ్రామస్తులు నిర్బంధించారు. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, పినపాక, ఇల్లెందు, సత్తుపల్లి, అశ్వారావుపేట, మధిర నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో విద్యుత్‌చ కోతలకు నిరసనగా సబ్‌స్టేషన్లముట్టడి, రాస్తారోకో,ధర్నాలు నిర్వహించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లోని 26 కేం ద్రాల్లో కార్మికులు విద్యుత్ కార్యాలయాలను ముట్టడిం చారు. మరికొన్నిచోట్ల ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. వందలాదిమంది అరెస్టయ్యారు. హైదరాబాద్ విద్యుత్ సౌధ ముట్టడి సందర్భంగా ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖరరావు, మాజీ ఎమ్మెల్యే కె. రామకృష్ణ, మెదక్ జిల్లా సంగారెడ్డిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి ఓబులేసు తదితరులు అరెస్టయ్యారు. అనంతపురం, గుంటూరు, విజయవాడలలో వందలాదిమందిని అరెస్ట్ చేసి సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. 
Share this article :

0 comments: